ఒకప్పటి స్టార్ హీరోయిన్ దుస్థితి తెలిస్తే షాకవ్వాల్సిందే..!

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి చక్కగా వర్తిస్తుంది. ఇక ఈ ఇండస్ట్రీలో హీరోయిన్‌ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ అనే చెప్పాలి. ఇక సీరియల్ నటీమణుల పరిస్థితి మరింత ఘోరం. హీరోయిన్లు, మెయిన్ ఆర్టిస్ట్‌లకు ఉన్నట్టుగా వీళ్లకు పారితోషకాలు ఉండవు. ఇకఎన్నో సీరియల్స్‌లో నటిగా మెప్పించిన ఒక ఆర్టిస్ట్ ఇప్పుడు అవకాశాలు లేక దోసలు వేసుకుంటోంది. మరోవైపు, ఈ విషయంపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మాత్రం ఆమె చేసిన […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:20 pm, Thu, 27 February 20
ఒకప్పటి స్టార్ హీరోయిన్ దుస్థితి తెలిస్తే షాకవ్వాల్సిందే..!

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి చక్కగా వర్తిస్తుంది. ఇక ఈ ఇండస్ట్రీలో హీరోయిన్‌ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ అనే చెప్పాలి. ఇక సీరియల్ నటీమణుల పరిస్థితి మరింత ఘోరం. హీరోయిన్లు, మెయిన్ ఆర్టిస్ట్‌లకు ఉన్నట్టుగా వీళ్లకు పారితోషకాలు ఉండవు. ఇకఎన్నో సీరియల్స్‌లో నటిగా మెప్పించిన ఒక ఆర్టిస్ట్ ఇప్పుడు అవకాశాలు లేక దోసలు వేసుకుంటోంది.

మరోవైపు, ఈ విషయంపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మాత్రం ఆమె చేసిన పనికి హాట్సాఫ్ చెబుతున్నారు. అవకాశాల లేక ఎంతో మంది నటీమణులు వ్యభిచార కూపంలోకి జారుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఆమె కష్టపడి పనిచేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందంటూ చాలా మంది నెటిజన్లు ఆమెను కొనియాడుతున్నారు. అంతకీ ఆమె ఎవరంటే మలయాళంలో ఓ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆర్టిస్ట్ కవితా లక్ష్మి. తన పిల్లలను చదివించడం కోసం ఓ పక్క యాక్ట్ చేస్తూనే మరో పక్క ఇలా దోసలు వేసుకుంటూ సంపాదించుకుంటోంది.

పదేళ్లుగా తిరువనాథపురంలోని నయట్టింకరలో నివసిస్తున్న కవిత, ప్రస్తుతం విదేశాలలో ఉన్నత చదువుతున్న తన కొడుకు ఫీజు చెల్లించడానికి ఇలా అదనపు ఆదాయ మార్గాన్ని ఎన్నుకుంది. ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుండి తనకు ఎటువంటి సహాయం రాలేదని ఆమె పేర్కొంది. రుణం పొందటానికి కవిత బ్యాంకులను సంప్రదించింది. కానీ.. ఆమెకు భూమి, ఆస్తులు లేనందున ఆమె దరఖాస్తును తిరస్కరించారు. ఈమె 13 ఏళ్ల క్రితమే తన భర్త నుండీ విడాకులు తీసుకొని తన ఇద్దరు పిల్లలను చదివించుకోవడం కోసం ఎంతో కష్టపడుతోంది.