5

కేటీఆర్ ఫోటో షేర్ చేసిన సాహో ప్రభాస్..

హైదరాబాద్‌లో వ్యాపిస్తున్న డెంగ్యూ జ్వరాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన చేసిన పనికి హీరో ప్రభాస్ ఫిదా అయ్యారు. కేటీఆర్ తన ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తున్న ఫోటోలను ప్రభాస్ తన ఫేస్‌బుక్ ద్వారా పంచుకున్నారు. డెంగ్యూ, విషజ్వరాలు రాకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అందరికీ చెప్పాలని ప్రభాస్ కోరారు. హైదరాబాద్‌తో సహా చాలా ప్రాంతాల్లో డెంగ్యూ, వైరల్ ఫీవర్లతో ప్రజలు బాధపడుతున్నారు. నగరవ్యాప్తంగా ఎక్కడ చూసినా […]

కేటీఆర్ ఫోటో షేర్ చేసిన సాహో ప్రభాస్..
Follow us

| Edited By:

Updated on: Sep 11, 2019 | 8:13 AM

హైదరాబాద్‌లో వ్యాపిస్తున్న డెంగ్యూ జ్వరాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన చేసిన పనికి హీరో ప్రభాస్ ఫిదా అయ్యారు. కేటీఆర్ తన ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తున్న ఫోటోలను ప్రభాస్ తన ఫేస్‌బుక్ ద్వారా పంచుకున్నారు. డెంగ్యూ, విషజ్వరాలు రాకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అందరికీ చెప్పాలని ప్రభాస్ కోరారు.

హైదరాబాద్‌తో సహా చాలా ప్రాంతాల్లో డెంగ్యూ, వైరల్ ఫీవర్లతో ప్రజలు బాధపడుతున్నారు. నగరవ్యాప్తంగా ఎక్కడ చూసినా జ్వరాల కేసులే నమోదవుతున్నాయని తెలిపారు. జ్వరాలు వ్యాపించకుండా ప్రజలకు పరిసరాలపై శుభ్రతపై అవగాహన కల్పించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే నీటి తొట్టెలు, పూల కుండీలు, ఎయిర్ కూలర్లలో నీరు నిల్వవుండకుండా చూడాలని అన్నారు. దోమలు వ్యాపించడానికి ఇవే కారణమని చెప్పారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. తానే స్వయంగా ఇంటిని శుభ్రం చేసిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అలాగే అందరూ ఇంటి పరిసరాలను క్లీన్ చేసి ఆ ఫోటోలను తనతో పంచుకోవాలని పిలుపునిచ్చారు. దీనిపై స్పందించిన హీరో ప్రభాస్.. మంత్రి కేటీఆర్‌ను మెచ్చుకున్నారు. అందుకు బదులుగా తన ఫోటోలను షేర్ చేసినందుకు.. ఈ వినూత్న కార్యక్రమంలో తనవంతు కృషి చేస్తున్నందుకు ప్రభాస్‌కు కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు.

బౌండరీలు, కంఫర్ట్ జోన్‌ దాటి బోల్డ్ కంటెంట్ కూడా వెంటనే ఓకే చెప్
బౌండరీలు, కంఫర్ట్ జోన్‌ దాటి బోల్డ్ కంటెంట్ కూడా వెంటనే ఓకే చెప్
'బికినీ'ని ప్రయోగానికి రెడీ అవుతన్న ఇస్రో..
'బికినీ'ని ప్రయోగానికి రెడీ అవుతన్న ఇస్రో..
కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌-రే చూసి షాక్.
కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌-రే చూసి షాక్.
స్క్విడ్ గేమ్ రెండో సీజన్ టీజర్‌ రిలీజ్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్క్విడ్ గేమ్ రెండో సీజన్ టీజర్‌ రిలీజ్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మీ ఎల్‌ఐసీ పాలసీ చచ్చిపోయిందా..? ఆ సమయంలోపు బతికించుకోపోతే ఇకఅంతే
మీ ఎల్‌ఐసీ పాలసీ చచ్చిపోయిందా..? ఆ సమయంలోపు బతికించుకోపోతే ఇకఅంతే
ప్రమాదం అంచున ప్రపంచంలో అతి పెద్ద పువ్వు.. ఉనికిని కోల్పోతుందంటూ
ప్రమాదం అంచున ప్రపంచంలో అతి పెద్ద పువ్వు.. ఉనికిని కోల్పోతుందంటూ
జాన్వీ కహానీ.. డబుల్‌ 'ఆర్‌' మీదే ఫుల్ ఫోకస్.. విషయం ఇదే..
జాన్వీ కహానీ.. డబుల్‌ 'ఆర్‌' మీదే ఫుల్ ఫోకస్.. విషయం ఇదే..
Team India: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత.. 2వ జట్టుగా భారత్
Team India: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత.. 2వ జట్టుగా భారత్
తల్లిని కోల్పోయిన దుఃఖం మధ్యే డ్యూటీలో కొనసాగిన పోలీస్
తల్లిని కోల్పోయిన దుఃఖం మధ్యే డ్యూటీలో కొనసాగిన పోలీస్
'చేసింది ఊరికే పోదు..' రెహ్మన్‌ పై పోలీస్‌ కేస్‌..
'చేసింది ఊరికే పోదు..' రెహ్మన్‌ పై పోలీస్‌ కేస్‌..