Aakasam Nee Haddura : సూర్య ఈజ్ బ్యాక్, సుధ కొంగర రాక్..మూవీ టీమ్‌పై ప్రశంసల వర్షం
అన్ని ఇండస్ట్రీలలో ఇప్పుడు బయోపిక్స్ రాజ్యమేలుతున్నాయి. సేఫ్ సినిమా తీయాలంటే సెలబ్రిటీల బయోపిక్స్ తీస్తే చాలు అని ఫిల్మ్ మేకర్స్ ఫీలవుతున్నారు. అయితే ఇప్పటివరకు క్రీడాకారులు, సినిమా తారల బయోపిక్స్ చూశాం.

‘ఆకాశం నీ హద్దురా’
టైటిల్ : ఆకాశమే నీ హద్దురా నటీనటులు : సూర్య, అపర్ణా బాలమురళీ, మోహన్ బాబు తదితరులు దర్శకత్వం : సుధా కొంగర నిర్మాతలు : సూర్య, గునీత్ మొంగ సంగీతం : జీవీ ప్రకాశ్ కుమార్ సినిమాటోగ్రఫీ: నికెత్ బొమ్మిరెడ్డి విడుదల తేది : నవంబర్ 12( అమెజాన్ ప్రైమ్)
ఇంట్రో :
అన్ని ఇండస్ట్రీలలో ఇప్పుడు బయోపిక్స్ రాజ్యమేలుతున్నాయి. సేఫ్ సినిమా తీయాలంటే సెలబ్రిటీల బయోపిక్స్ తీస్తే చాలు అని ఫిల్మ్ మేకర్స్ ఫీలవుతున్నారు. అయితే ఇప్పటివరకు క్రీడాకారులు, సినిమా తారల బయోపిక్స్ చూశాం. కాని ఓ బిజినెస్‌మ్యాన్ లైఫ్ స్టోరీ సినిమాగా తెరకెక్కిందంటే కాస్త ఆసక్తికరమైన విషయంగానే చెప్పుకోవాలి. తాజాగా ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ‘ఆకాశం నీ హద్దురా’ తెరకెక్కింది. ‘సింప్లీ ఫ్లై’ అనే పుస్తకాన్ని ఆధారంగా తీసుకుని ఈ సినిమా తీశారు. గోపీనాథ్ పాత్రలో సూర్య నటించారు. ఈ సినిమా కోసం ఆయన తనని తాను ఎంతో మార్చుకున్నారు. అలాంటి సినిమా గురువారం అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. మరి ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ :
ఓ సాధారణ స్కూల్ టీచర్ కొడుకు రాత్రింబవళ్లు కష్టపడి ఓ ఎయిర్ లైన్స్ సంస్థను ఎలా స్థాపించాడు అన్నదే సినిమా కథాంశం. 2003లో విమానం ల్యాండింగ్ కోసం ఓ పైలట్ ప్రయత్నించడం, ఏవియేషన్ అధికారులు అనుమతించకపోవడంతో సినిమా స్టార్టవుతుంది. చంద్రమహేష్ అలియాస్ మహా (సూర్య) అధికారులతో గొడవపడి ఎందుకు ల్యాండ్ చేయించాడు. అసలు ఏవియేషన్ అధికారులు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆసలు విమానం సంగతేంది. విమానానికి మహాకు ఏంటి సంబంధం, ‘విమాన’ ప్రయాణంలో మహా భార్య సుందరి (అపర్ణా బాలమురళి), భక్తవత్సలం నాయుడు (మోహన్‌బాబు), పరేశ్ గోస్వామి (పరేశ్ రావల్)ల పాత్రలేంటి అనే అంశాలపై కథ నడుస్తోంది.
ఎలా ఉందంటే :
బయోపిక్ తీయడం మాములు విషయం కాదు. చాలా లెక్కలు ఉంటాయి. పలు అంశాలు బ్యాలెన్స్ చేయాలి. సోల్ దెబ్బతినకుంగా, ప్రేక్షకులకు దెబ్బతినకుండా మూవీని ముందుకు నడిపించాలి. ఈ వ్యవహారమంతా కత్తి మీద సామే. ఈ విషయంలో దర్శకురాలు సధా కొంగరకు నూటికి 99 మార్కులు వేయాల్సిందే. నిజంగా ఆమె కథను చెప్పిన విధానం, కథనాన్ని రక్తి కట్టించిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సినిమాని రియల్టిక్‌గా తీయడంలోనూ సధా కొంగర తన మార్క్ చూపించారు. నాయకనాయికల మధ్య సీన్లను చాలా నేచురల్‌గా తెరకెక్కించారు. జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం కూడా సినిమాకు అస్సెట్ అని చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అతడు ప్రతి సీన్‌కు ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అలరించాడు. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా అదిరిపోయే రేంజ్‌లో సినిమాను నిర్మించారు.
నటీనటులు ఎలా చేశారంటే :
సరైన పాత్ర దొరకాలే కానీ సూర్య అందులో జీవిస్తాడు. అందుకోసం తనని తాను మార్చకుంటాడు. విభిన్నతకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే సూర్య ఆ క్రమంలో ఇటీవల కాలంలో పలు ప్లాపులను ఎదుర్కొన్నాడు. కానీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అతడు ఈ సినిమాలో కెప్టెన్ గోపీనాథ్ పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. కొన్ని సన్నివేశాల్లో అయితే హృదయాన్ని తాకే విధంగా ఎమోషన్స్ పలికించాడు. హీరోయిన్ అపర్ణా బాల మురళీ నటన కూడా భలే నటించింది. మోహన్ బాబు, పరేశ్ రావల్ లాంటి లెజెండ్స్ నటన గురించి చెప్పేది ఏముంటుంది. సూర్య తల్లి పాత్రలో ఊర్వశి, ఇతర నటీనటులు పాత్ర పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్:
సూర్య నటన, కథ-కథనం పాటలు కథలోని భావోద్వేగాలు నేపథ్య సంగీతం దర్శకత్వం
Also Read :
నెల్లూరు జిల్లాలో కల్తీ పాలు, తాగితే అంతే !