వాషింగ్‌టన్ పోస్ట్‌లో.. ప్రణయ్- అమృత విషాద ప్రేమ గాథ

ప్రణయ్ అమృత.. విషాద ప్రేమకథ గురించి అందరికీ తెల్సిందే. గతేడాది మిర్యాలగూడలో చోటుచేసుకున్న ఈ దారుణ పరువుహత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. తక్కువ కులం వ్యక్తిని ప్రేమించి, తాను వద్దన్నా అతనిని పెళ్లి చేసుకుందన్న ఒకే ఒక్క కారణంతో అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్‌ని దారుణంగా నడిరోడ్డుపై హత్య చేయించాడు. ప్రణయ్ చనిపోయే నాటికి అమృత ఐదునెలల గర్భిణి కాగా తాజాగా ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఈ […]

వాషింగ్‌టన్ పోస్ట్‌లో.. ప్రణయ్- అమృత విషాద ప్రేమ గాథ
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2019 | 8:51 PM

ప్రణయ్ అమృత.. విషాద ప్రేమకథ గురించి అందరికీ తెల్సిందే. గతేడాది మిర్యాలగూడలో చోటుచేసుకున్న ఈ దారుణ పరువుహత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. తక్కువ కులం వ్యక్తిని ప్రేమించి, తాను వద్దన్నా అతనిని పెళ్లి చేసుకుందన్న ఒకే ఒక్క కారణంతో అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్‌ని దారుణంగా నడిరోడ్డుపై హత్య చేయించాడు. ప్రణయ్ చనిపోయే నాటికి అమృత ఐదునెలల గర్భిణి కాగా తాజాగా ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఈ హత్య మనదేశం మొత్తం కలకలం రేపింది. అనంతరం దేశ వ్యాప్తంగా ఈ పరువుహత్యపై ఆందోళనలు మిన్నంటాయి. అయితే దాదాపు ఏడాది తర్వాత ఈ దారుణ ఘటనపై అంతర్జాతీయ మీడియా దృష్టి కూడా పడింది.

సమాజంలో పరువు హత్యలపై చోటుచేసుకున్న భిన్నవాదనల నేపథ్యాన్ని అమెరికన్ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ముఖ్యంగా కులం పేరుతో భారత్‌లో నేటికి పరువు హత్యలు జరుగుతున్నాయని ప్రణయ్ పరువుహత్యను ఉదాహరణగా పేర్కొంది. అంతే కాదు భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్నదేశంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆశ్చర్యకరమని తెలిపింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ కులం పేరిట సంకుచిత భావంతో ఇలాంటి ఘటనలు చేసుకోవడం దురదృష్టకరమని పేర్కొంది. అలాగే ప్రణయ్ హంతకులు బెయిల్ పై విడుదలవడాన్ని సైతం పత్రిక ప్రముఖంగా వెల్లడించింది.

అంతేకాదు 2017 సంవత్సరం దేశంలోని వివాహాలపై జరిపిన ఓ సర్వేలో కేవలం 5.8 శాతం కులాంతర వివాహాలు మాత్రమే జరుగాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ప్రణయ్ హత్య తర్వాత మిర్యాలగూడతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన భిన్నవాతావరణాన్ని కూడా కథనంలో తెలిపింది. ప్రణయ్ హంతకులకు మద్దతుగా, వ్యతిరేకంగా ఏర్పడిన సమూహాలపై కూడా ప్రత్యేకంగా దృష్టిని సారించింది.

Latest Articles
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
మోదీ గొప్ప మనస్సు గుర్తు చేసుకున్న బిజూ జనతా దళ్ మాజీ నేత
మోదీ గొప్ప మనస్సు గుర్తు చేసుకున్న బిజూ జనతా దళ్ మాజీ నేత
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ఎలా జరిగిందో తెలుసా?
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ఎలా జరిగిందో తెలుసా?
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైక్ రైడర్స్.. వీడియో వైరల్
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైక్ రైడర్స్.. వీడియో వైరల్
కంత్రీ స్కెచ్‌తో పోలీసులకే ఫ్యూజులౌట్.. ఆఖరికి దేన్ని వదలట్లేదుగా
కంత్రీ స్కెచ్‌తో పోలీసులకే ఫ్యూజులౌట్.. ఆఖరికి దేన్ని వదలట్లేదుగా