పాకశాస్ర్తంలో రికార్డు సృష్టించిన పదేళ్ల చిన్నారి శాన్వి

పాకశాస్ర్తంలో ప్రావీణ్యత సంపాదించిన వారికే ఒక్కోసారి గరిటే తిప్పడం చేతకాక చేతులెత్తేస్తుంటారు.. ఇక పదేళ్ల పిల్లలకేం వస్తుంది చెప్పండి! అసలా ఏజ్‌ వాళ్లు వంటింట్లోకే అడుగు పెట్టరు. పెట్టినా వంట జోలికి వెళ్లరు.. వెళ్లినా టీనో, మ్యాగీనో చేసుకుంటారంతే! కానీ ఓ పదిన్నరేళ్ల బుజ్జాయి ఉంది.. ఆ పాప రకరకాల వంటలను ఇట్టే చేసేస్తుంటుంది.. మన వంటకాలే కాదు.. విదేశీ వంటకాలు కూడా రుచికరంగా చేస్తుంటుంది.. ఆ పాప పేరు శాన్వి ఎం ప్రాజిత్‌.. వింగ్‌ కమాండర్‌ […]

పాకశాస్ర్తంలో రికార్డు సృష్టించిన పదేళ్ల చిన్నారి శాన్వి
Follow us
Balu

|

Updated on: Oct 12, 2020 | 3:39 PM

పాకశాస్ర్తంలో ప్రావీణ్యత సంపాదించిన వారికే ఒక్కోసారి గరిటే తిప్పడం చేతకాక చేతులెత్తేస్తుంటారు.. ఇక పదేళ్ల పిల్లలకేం వస్తుంది చెప్పండి! అసలా ఏజ్‌ వాళ్లు వంటింట్లోకే అడుగు పెట్టరు. పెట్టినా వంట జోలికి వెళ్లరు.. వెళ్లినా టీనో, మ్యాగీనో చేసుకుంటారంతే! కానీ ఓ పదిన్నరేళ్ల బుజ్జాయి ఉంది.. ఆ పాప రకరకాల వంటలను ఇట్టే చేసేస్తుంటుంది.. మన వంటకాలే కాదు.. విదేశీ వంటకాలు కూడా రుచికరంగా చేస్తుంటుంది.. ఆ పాప పేరు శాన్వి ఎం ప్రాజిత్‌.. వింగ్‌ కమాండర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఫ్రాజిత్‌ బాబు కూతురు! గంట టైమిస్తే 30 కంటే ఎక్కువ వంటలను అవలీలగా రుచికరంగా వండేస్తుంది.. పాకశాస్ర్తంలో పాప చూపిస్తున్న ప్రతిభకు ముచ్చటపడిన ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారు తమ బుక్కులలో ఈ పాపకు చోటిచ్చారు.. మొన్న ఆగస్టు 29న విశాఖపట్నంలోని తన ఇంట్లో వంట చేస్తున్న ఈ పదేళ్ల ఆరు నెలల 12 రోజుల ప్రాయమున్న పాపాయిని ఆన్‌లైన్‌లో పర్యవేక్షించింది ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అథారిటీ.. రుజువు కోసం ఇద్దరు గెజిటెడ్‌ ఆఫీసర్లను ఆమె పక్కన పెట్టింది. అరవై నిమిషాల్లో శాన్వి ఏకంగా 30 రకాల వంటలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.. మా అమ్మ సాయంతోనే ఇది సాధించగలిగాను తప్ప నా గొప్పేం లేదంటూ వినయంగా చెప్పుకొచ్చింది శాన్వి.. ఆ పాప అమ్మ స్టార్‌ చెఫ్‌ అట! ఓ కుకరీ షో కాంటెస్ట్‌లో ఫైనల్స్‌ వరకు వచ్చారట! తల్లి పోలికలు వచ్చి ఉంటాయి ఈ పాపకు! అన్నట్టు శాన్వికి ఓ యూ ట్యూబ్‌ ఛానెల్‌ కూడా ఉందట! అందులో రుచికరమైన వంటలను ఎలా చేయాలో చెబుతుందట!