తెలంగాణలో కరోనా టెర్రర్.. ఒక్క రోజే 872 పాజిటివ్ కేసులు..
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తెలంగాణాలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇవాళ కొత్తగా 872 పాజిటివ్ కేసులు

Coronavirus In Telangana: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తెలంగాణాలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ప్రకారం ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 872 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,674 కి చేరింది. వీరిలో కరోనాతో పోరాడుతూ 4,005 మంది కోలుకొని డిశ్చార్జి కాగా..217 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 4,452 యాక్టివ్ కేసులున్నాయి.
లాక్ డౌన్ సడలింపులతో రాష్ట్రంలో కరోనా కేసులుగణనీయంగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు చనిపోయారు. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 713, రంగారెడ్డిలో 107, మేడ్చల్‌లో 16, సంగారెడ్డిలో 12, వరంగల్ రూరల్‌లో 6, మంచిర్యాల 5, కామారెడ్డి, మెదక్‌లో 3చొప్పున, జనగాం, కరీంనగర్, మహబూబాబాబ్లో 2 చొప్పున, వరంగల్ అర్బన్లో ఒక్క కేసులు నమోదయ్యాయి.
Also Read: ప్రపంచానికే భారత్ ఓ గొప్ప ఔషధాలయం..!



