ఎంతప‌ని చేశావు త‌ల్లీ..! మూఢ నమ్మ‌కాల‌తో క‌న్నబిడ్డ‌నే చంపుకుంది..

ఎంతప‌ని చేశావు త‌ల్లీ..! మూఢ నమ్మ‌కాల‌తో క‌న్నబిడ్డ‌నే చంపుకుంది..

త‌ల్లికి బిడ్డ‌పై ప్రేమ ఎంత‌.. ఏ మనిషి వ‌ర్ణించ‌లేనంత‌..అవును అమ్మ ప్రేమ‌కు కొల‌మానం అస్స‌లు ఉండ‌దు. న‌వ‌మాసాలు మోసి క‌న్న బిడ్డ ఆక‌లితో ఉంటే త‌ల్లి ఏం చేస్తోంది. త‌ల తాక‌ట్టుపెట్ట‌యినా, ప్రాణాల‌కు తెగించి అయినా బిడ్డ కడ‌పునింపుతుంది. కానీ విశాఖ జిల్లాకు చెందిన ఓ మహిళ మాత్రం తల్లి ప్రేమకు క‌ళంకం తెచ్చేలా ప్ర‌వ‌ర్తించింది. మూఢ నమ్మకాలతో 4 నెలల పాపకు పాలివ్వకుండా వారంపాటు ఆక‌లితో ఏడిపించింది. గుక్క‌ప‌ట్టి ఏడ్చి, ఏడ్చి చివ‌ర‌కు అల‌సిపోయి ఆ […]

Ram Naramaneni

|

May 03, 2020 | 7:56 AM

త‌ల్లికి బిడ్డ‌పై ప్రేమ ఎంత‌.. ఏ మనిషి వ‌ర్ణించ‌లేనంత‌..అవును అమ్మ ప్రేమ‌కు కొల‌మానం అస్స‌లు ఉండ‌దు. న‌వ‌మాసాలు మోసి క‌న్న బిడ్డ ఆక‌లితో ఉంటే త‌ల్లి ఏం చేస్తోంది. త‌ల తాక‌ట్టుపెట్ట‌యినా, ప్రాణాల‌కు తెగించి అయినా బిడ్డ కడ‌పునింపుతుంది. కానీ విశాఖ జిల్లాకు చెందిన ఓ మహిళ మాత్రం తల్లి ప్రేమకు క‌ళంకం తెచ్చేలా ప్ర‌వ‌ర్తించింది. మూఢ నమ్మకాలతో 4 నెలల పాపకు పాలివ్వకుండా వారంపాటు ఆక‌లితో ఏడిపించింది. గుక్క‌ప‌ట్టి ఏడ్చి, ఏడ్చి చివ‌ర‌కు అల‌సిపోయి ఆ ప‌సిగుండె ఆగిపోయింది.

విశాఖ మన్యం జి.మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీ జాగేరులో ఈ దారుణ ఘ‌టన జ‌రిగింది. మూఢ నమ్మకాలతో కన్నతల్లే త‌న‌ 4 నెలల చిన్నారిని చంపుకుంది. చిన్నారి జాత‌కంలో దోషం ఉందని… పాలిస్తే తల్లికి చావు గండం ఉందంటూ ఓ భూత వైద్యుడు చెప్పిన మాటలను ఆమె గుడ్డిగా నమ్మింది. ఏడు రోజుల పాటు పసిపాపకు చుక్క పాలు కూడా ఇవ్వ‌లేదు. పాపాయి ఆక‌లితో గుక్కెట్టి ఏడుస్తున్నా ఆమె రాతి గుండె క‌రగ‌లేదు‌. చిన్నారి ప‌దే, ప‌దే ఏడుస్తూ ఉండ‌టాన్ని గ‌మ‌నించిన స‌మీప బంధువు… చిన్నారి తల్లిదండ్రులను మందలించాడు. అయినా స‌రే మాట విన‌క‌పోవ‌డంతో… బాలింత అయిన తన భార్య దగ్గరికి తీసుకెళ్లి పాలు పట్టిస్తుండగా పాపాయి ప్రాణాలు విడిచింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu