Earth Quake: వామ్మో ఏంటింది.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టర్కీలో మళ్లీ భూకంపం
రెండు నెలల క్రితం భారీ భూకంపంతో అతలాకుతలమైన టర్కీలో మరోసారి భూ ప్రకంపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం తెల్లవారుజామున 4.25 గంటలకు అఫ్సిన్ నగరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.0గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.

రెండు నెలల క్రితం భారీ భూకంపంతో అతలాకుతలమైన టర్కీలో మరోసారి భూ ప్రకంపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం తెల్లవారుజామున 4.25 గంటలకు అఫ్సిన్ నగరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.0గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. భూఅంతర్భాగంలోని 10 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు వచ్చినట్లు పేర్కొంది. ఇటీవల టర్కీలో చోటుచేసుకున్న పెను విళయం నుంచి ఇప్పడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే మరోసారి భూకంపం రావడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాల్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ భూకంప ప్రళయంలో లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. 50 వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం సుమారు 16 లక్షల మంది ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. అయితే దేశంలో సుమారు 2 లక్షల ఇళ్లను నిర్మించేందుకు టర్కీ ప్రభుత్వం ఇటీవలే ప్రణాళికలు రూపొందించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..
