New Medical Theory: పంజాబ్ రాష్ట్రంలో కోవిడ్ రోగులు కాని 32 మందిలో బ్లాక్ ఫంగస్ డిసీజ్, కారణం ఏమిటంటే ? ఆశ్చర్యపోతున్న డాక్టర్లు

దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో 158 బ్లాక్ ఫంగస్ కేసులు బయటకి రాగా ఇందులో 32 మంది రోగులకు అసలు కోవిద్ సోక లేదని వెల్లడైంది.

New Medical Theory: పంజాబ్ రాష్ట్రంలో కోవిడ్ రోగులు కాని 32 మందిలో బ్లాక్ ఫంగస్ డిసీజ్, కారణం ఏమిటంటే ?  ఆశ్చర్యపోతున్న డాక్టర్లు
32 Non Covid Patients
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 27, 2021 | 9:20 AM

దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో 158 బ్లాక్ ఫంగస్ కేసులు బయటకి రాగా ఇందులో 32 మంది రోగులకు అసలు కోవిద్ సోక లేదని వెల్లడైంది. కోవిద్ నుంచి కోలుకున్న రోగులు స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుందని ఇప్పటివరకు భావిస్తున్నామని, కానీ ఈ 32 మంది కోవిద్ రోగులు కారని డాక్టర్లు చెప్పారు. ఇతర వివిధ వ్యాధులకు వీరు స్టెరాయిడ్స్ తీసుకున్నారని వారు తెలిపారు. ఇమ్యూనిటీ (రోగనిరోధక శక్తి) లేని ఏ వ్యక్తి అయినా అధికంగా స్టెరాయిడ్స్ తీసుకున్న ఫలితంగా ఈ ఇన్ఫెక్షన్ సోకుతుందని గగన్ దీప్ సింగ్ అనే నోడల్ అధికారి తెలిపారు. బ్లాక్ ఫంగస్ ను మొదట్లోనే గుర్తించి చికిత్స చేస్తే సులభంగా నయమవుతుందన్నారు. ఏ డిసీజ్ కైనా మోతాదుకు మించి స్టెరాయిడ్స్ తీసుకున్న పక్షంలో ఈ ఫంగస్ కు గురి అవుతారన్న విషయం తేలిందన్నారు. రాష్ట్రంలో కోవిద్ ఎక్స్ పర్ట్ టీమ్ హెడ్ అయిన డాక్టర్ కె.కె. తల్వార్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడినందున ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, అందువల్ల ప్రత్యామ్నాయాలను వాడాలని తాము ఇతర వైద్య సిబ్బందికి సూచిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఈ 32 మంది ఏయే వ్యాధులకు గురయ్యారో తెలుసుకోవలసి ఉందన్నారు. ఇదే సమయంలో తాము కూడా లైన్ ఆఫ్ ట్రీట్ మెంట్ ను ఖరారు చేసేందుకు యత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు.

మరోవైపు బ్లాక్ ఫంగస్ కు గురైన రోగులకు అవసరమైన మందులు లభ్యమయ్యేలా చూడాలని సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ తమ ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇవి లభ్యం కావాలని ఆయన ఆదేశించారు. ఈ ఫంగస్ వ్యాపించకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కాగా కోవిద్ రోగులు కానివారిలో ఈ ఫంగస్ కనబడడం వైద్య సిబ్బందిని ఆశ్చర్యపరుస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: నిరాధారం, అంతా కట్టుకథ ! చేతులు, కాళ్లపై మేకులా ? ఆ గాయాలు తానే చేసుకున్నాడన్న యూపీ పోలీసులు,

Road Accident: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు దుర్మరణం