కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్ట్‌ల హతం

జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో భద్రతా బలగాలు, టెర్రరిస్ట్‌ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కుల్గామ్‌లోని గోపాల్‌పోరా ప్రాంతంలో టెర్రరిస్ట్‌లు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో వారిపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో.. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు చేపట్టాయి. దీనిపై ఉత్తర కశ్మీర్ డీఐజీ అతుల్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిద్దరిని షోపియన్‌కు చెందిన జహీద్ మాంటో, కుల్గామ్‌కు చెందిన అహ్మద్‌గా గుర్తించాం. […]

కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్ట్‌ల హతం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 22, 2019 | 4:08 PM

జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో భద్రతా బలగాలు, టెర్రరిస్ట్‌ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కుల్గామ్‌లోని గోపాల్‌పోరా ప్రాంతంలో టెర్రరిస్ట్‌లు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో వారిపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో.. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు చేపట్టాయి.

దీనిపై ఉత్తర కశ్మీర్ డీఐజీ అతుల్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిద్దరిని షోపియన్‌కు చెందిన జహీద్ మాంటో, కుల్గామ్‌కు చెందిన అహ్మద్‌గా గుర్తించాం. వీరిద్దరు హిజ్బుల్‌ ముజాహిదీన్ సంస్థలో పనిచేస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మందుగండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నాం’’ అని తెలిపారు.