చైనాలో మరో విషాదం.. ట్యాంకర్ పేలి 18 మంది మృతి..
కరోనా మహమ్మారికి జన్మస్థలమైన చైనాలో మరో విషాదం చోటుచేసుకుంది. బెజియాంగ్ ప్రావిన్స్‌లోని వెన్లింగ్ సిటీ సమీపంలో ఓ ట్యాంకర్ ట్రక్కు పేలింది.

కరోనా మహమ్మారికి జన్మస్థలమైన చైనాలో మరో విషాదం చోటుచేసుకుంది. బెజియాంగ్ ప్రావిన్స్‌లోని వెన్లింగ్ సిటీ సమీపంలో ఓ ట్యాంకర్ ట్రక్కు పేలింది. అది కూడా ఓ జాతీయ రహదారిపై. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 189 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే.. స్థానిక పోలీసులు, రెస్క్యూ టీం రంగంలోకి ది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన స్థలంలో రోడ్డుకు ఇరువైపు పెద్ద పెద్ద భవనాలు, వర్క్ షాపులు ఉన్నాయి. ట్రక్కు పేలుడు ధాటికి అవన్నీ కుప్పకూలాయి. ఈ క్రమంలోనే పలువురు ప్రాణాలు కోల్పోయారు. భవనాలన్ని దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. పేలిన ట్రక్కు లిక్విఫైడ్ గ్యాస్‌తో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.