ఆ రాష్ట్రంలో 11 మంది అసెంబ్లీ సిబ్బందికి కరోనా!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కట్టడికి అసోం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో

ఆ రాష్ట్రంలో 11 మంది అసెంబ్లీ సిబ్బందికి కరోనా!
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2020 | 6:22 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కట్టడికి అసోం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 11 మంది అస్సాం అసెంబ్లీ ఉద్యోగులకు సెషన్‌కు ముందు కరోనా పరీక్షలు చేయడంతో కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందని వైద్య అధికారులు పేర్కొన్నారు. అస్సాం శాసనసభకు చెందిన 11 మంది ఉద్యోగులకు ఒకే రోజు కోవిడ్-19 పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది.

అసోంలో ఆగస్టు 31 నుంచి అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుంది. దీంతో అసెంబ్లీ ఉద్యోగులందరినీ రాష్ట్ర ఆరోగ్య శాఖ పరీక్షిస్తోంది. ఉద్యోగులందరిపై యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, సిబ్బందిలో 270 మంది పరీక్షించబడ్డారని, వారిలో 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ మృగేంద్ర కుమార్ తెలిపారు.

Read More:

జగన్ కీలక నిర్ణయం.. బీటెక్‌ కోర్సుల్లో అప్రెంటిస్‌షిప్‌, ఆనర్స్‌ డిగ్రీ..!

ఇక ప్రతి నియోజకవర్గానికి కరోనా టెస్టింగ్‌ మొబైల్‌ లేబొరేటరీ..!