యువకుడి వేధింపులు భరించలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తోన్న విద్యార్థిని చివరి మాటలు.

ప్రేమ వేధింపులు తట్టుకోలేక గుంటూరుకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా మేడి కొండూరు మండలం కొర్రపాడుకు చెందిన విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. అయితే గత కొన్ని రోజులుగా ఓ పోకిరి ఆమె వెంట పడుతూ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక...

యువకుడి వేధింపులు భరించలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తోన్న విద్యార్థిని చివరి మాటలు.
Narender Vaitla

|

Dec 20, 2020 | 3:17 PM

10th class girl committed suicide: ప్రేమ వేధింపులు తట్టుకోలేక గుంటూరుకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా మేడి కొండూరు మండలం కొర్రపాడుకు చెందిన విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. అయితే గత కొన్ని రోజులుగా ఓ పోకిరి ఆమె వెంట పడుతూ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఆ యువకుడు పెడుతోన్న బాధలు భరించలేక ఆ చిన్నారి చివరికి ఆత్మహత్య చేసుకుంది.

ఆత్మహత్య చేసుకున్న ఆ విద్యార్థిని చివరి మాటలు ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. చావు, బతుకుల మధ్య ఉన్న ఆ చిన్నారి.. ‘ఆ అబ్బాయి నన్ను ఏడిపించాడు. ఆ బాధ తట్టుకోలేకే ఆత్మ హత్య చేసుకున్నాను. దీనికి మా తల్లిదండ్రులకు ఎలాంటి సంబంధం లేదు. ఆ అబ్బాయి వల్లే నేను చనిపోతున్నాను. దయచేసి ఆ అబ్బాయికి శిక్ష పడేలా చేయండి’ అంటూ  చెప్పిన మాటలు ఆమె ఎంత మదనపడిందో చెబుతున్నాయి. ఇక విద్యార్థిని మృత‌దేహాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి సందర్శించి ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. విద్యార్థిని మృతికి కారణమైన యువకుడిని వెంటనే శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu