ప్లే ఆఫ్స్‌కు చేరతా ః కోల్‌కతా మెంటార్‌ హస్సీ కాన్ఫిడెన్స్‌

కాన్ఫిడెన్స్‌ ఉంటే కొండల్ని కూడా పిండిచేయవచ్చంటారు.. నిజంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మెంటార్‌ డేవిడ్‌ హస్సీ ఆత్మవిశ్వాసాన్ని చూస్తే ముచ్చటేస్తోంది.. ఐపీఎల్‌లో ప్లే ఆఫ్‌కు చేరే అవకాశాలు ఆ జట్టుకు దాదాపుగా లేనట్టే!

ప్లే ఆఫ్స్‌కు చేరతా ః కోల్‌కతా మెంటార్‌ హస్సీ కాన్ఫిడెన్స్‌
Balu

|

Oct 30, 2020 | 5:47 PM

కాన్ఫిడెన్స్‌ ఉంటే కొండల్ని కూడా పిండిచేయవచ్చంటారు.. నిజంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మెంటార్‌ డేవిడ్‌ హస్సీ ఆత్మవిశ్వాసాన్ని చూస్తే ముచ్చటేస్తోంది.. ఐపీఎల్‌లో ప్లే ఆఫ్‌కు చేరే అవకాశాలు ఆ జట్టుకు దాదాపుగా లేనట్టే! కానీ హస్సీ మాత్రం తన జట్టు కచ్చితంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందని అంటున్నాడు.. నిన్న రాత్రి చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా గెలిచి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ అయిదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.. ఇప్పటి వరకు కోల్‌కతా ఆడిన 13 మ్యాచ్‌లలో కేవలం ఆరు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది.. పాయింట్ల పట్టికలో ఆ జట్టకు ఉన్నవి 12 పాయింట్లే.. ఇక మిగిలింది ఒకే ఒక్క మ్యాచ్‌… అందులో తప్పనిసరిగా గెలిచి తీరాలి.. గెలవడమంటే మామూలుగా కాదు.. భారీ విజయాన్ని అందుకుని నెట్‌ రన్‌రేట్‌ను పెంచుకోవాలి.. అది మాత్రం సరిపోదు.. పంజాబ్‌, హైదరాబాద్‌ టీమ్‌లు తర్వాతి మ్యాచ్‌లలో ఓడిపోవాలి.. ఇలాంటి పరిస్థితులలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరడం చాలా కష్టం.. డేవిడ్‌ హస్సీ మాత్రం కొండంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. తన టీమ్‌ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందని , అక్కడ కూడా విజయం సాధించి తీరుతుందని అంటున్నాడు. చేతికొచ్చిన చాలా మ్యాచ్‌లను చేజేతులా జారవిడుచుకుని ఈ స్థితికి వచ్చామని, అయినప్పటికీ తాము ఇంకా పోటీలోనే ఉన్నామని హస్సీ అన్నాడు. రాబోయే రోజుల్లో తాము అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తామని చెప్పాడు. టీ-20 మ్యాచ్‌లలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని, రిజల్ట్స్‌ తమకు అనుకూలంగా ఉంటాయన్న నమ్మకం తనకుందని పేర్కొన్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌ను ప్రస్తావిస్తూ ఆ జట్టు అద్భుతంగా ఆడిందన్నాడు. విజేతగా నిలవడానికి అన్ని అర్హతలు చెన్నైకు ఉన్నాయని తెలిపాడు. అంబటిరాయుడు, రుతురాజ్‌లు చక్కగా ఆడారని కితాబిచ్చాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu