IPL 2020 : ఎవరు.. ఎలా.. ప్లేఆఫ్‌కు చేరుకుంటారో తెలుసా…
Playoff Race : కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు…వెనకటికి ఓ సామెత.. ఇది ఇప్పుడు ఐపీఎల్-13 సీజన్‌లో కొన్ని జట్లకు సరిగ్గా సరిపోతుంది. కొన్ని జట్లు గెలవాలనే కసితో ముందుకు దూకుతున్నారు.. అయితే ఓటములను ఎదుర్కొంటున్నారు. గెలవాలనే కాంక్షతో మొండిగా ఆడుతోన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో అత్యంత ప్రమాదకారిగా మారింది. విధ్వంసాన్ని సృష్టిస్తోంది. మిగిలిన జట్ల ప్లేఆఫ్ అవకాశాలను దారుణంగా దెబ్బతీస్తోంది. చెన్నై దెబ్బకు కోల్‌కత నైట్ రైడర్స్ ప్లేఆఫ్ రేస్ […]

Playoff Race : కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు…వెనకటికి ఓ సామెత.. ఇది ఇప్పుడు ఐపీఎల్-13 సీజన్‌లో కొన్ని జట్లకు సరిగ్గా సరిపోతుంది. కొన్ని జట్లు గెలవాలనే కసితో ముందుకు దూకుతున్నారు.. అయితే ఓటములను ఎదుర్కొంటున్నారు.
గెలవాలనే కాంక్షతో మొండిగా ఆడుతోన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో అత్యంత ప్రమాదకారిగా మారింది. విధ్వంసాన్ని సృష్టిస్తోంది. మిగిలిన జట్ల ప్లేఆఫ్ అవకాశాలను దారుణంగా దెబ్బతీస్తోంది. చెన్నై దెబ్బకు కోల్‌కత నైట్ రైడర్స్ ప్లేఆఫ్ రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించే పరిస్థితితులు కనిపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి ఉంటే.. ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకోగలిగి ఉండేది. అలా జరగలేదు. అంతా అనుకున్నట్లుగానే.. వీర విహారంతో అందరిని చూపులు ఆకర్శిస్తోంది.
నేరుగా ప్లేఆఫ్ చేరుకోవాలీ అంటే.. ఏ జట్టుకైనా 16 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. ఆ అవకాశం ఇప్పటి వరకు ఒక్క ముంబై ఇండియన్స్‌కు మాత్రం ఉంది. కీరన్ పొలార్డ్ సారథ్యంలోని ఆ జట్టు 16 పాయింట్లతో ప్లేఆఫ్ చేరుకుంది. కోల్‌కత నైట్ రైడర్స్ నేరుగా ప్లేఆఫ్ చేరడానికి గల అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో మిగిలి ఉన్నది.. ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే. అందులో గెలిచినా 14 పాయింట్ల వద్దే ఆగిపోతుంది. ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన జట్ల గెలుపోటముల మీద ఆధారపడాల్సిందే.
అయితే… నేరుగా ప్లేఆఫ్ చేరే అవకాశాలు ఆ రెండు జట్లకేలా ఉన్నాయి. ఒకటి- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు- ఢిల్లీ కేపిటల్స్. పాయింట్ల పాట్టికలో ప్రస్తుతం వీరికి 14 పాయింట్లు ఉన్నాయి. ఇంకా వీరు రెండు మ్యాచ్‌లను చొప్పున ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లో ఆ రెండు జట్లు ఏ ఒక్క మ్యాచ్‌లో నెగ్గినా నేరుగా ప్లేఆఫ్‌కు చేరుకుంటాయి. ప్రస్తుతం 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్.. 14 పాయింట్లతో ఉంది. వారి రన్‌రేట్‌గా కూడా మెరుగ్గానే ఉంది. ఢిల్లీ రన్‌రేట్ 0.030గా ఉండటంతో ఆ జట్టు టాప్-4లో ఉండే అవకాశాలు ఎక్కువ. అప్పుడు రన్‌రేట్ తగ్గకుండా చూసుకోవడమే కాకుండా రేసులో ఉన్న జట్లు భారీ తేడాతో గెలవకుండా ఉంంది.
ఇదిలావుంటే.. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మాత్రం వరుసగా ఆరు మ్యాచ్‌లల్లో ఘన విజయాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం నేరుగా ప్లేఆఫ్ వెళ్లే అవకాశాలు ఆ జట్టుకు కూడా ఉన్నాయి. 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది కేఎల్ రాహుల్ టీమ్. ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పుడున్న దూకుడును ఇలాగా కొనసాగిస్తే ఈ రెండింటినీ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే- 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. వరుసగా ఆరు మ్యాచ్‌లల్లో నెగ్గిన పంజాబ్ ఈ రెండూ గెలిస్తే… అదో రికార్డే అవుతుంది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లతో పంజాబ్ తలపడాల్సి ఉంది.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత నైట్ రైడర్స్.. 16 పాయింట్లను అందుకోలేవు. 14 లేదా అంతకు దిగువకే నిలిచిపోతాయి. ఇక్కడ సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్‌రేట్ 0.396గా ఉంది. అంటే కింగ్స్ పంజాబ్ కంటే మెరుగ్గా ఉంది హైదరాబాద్. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ, ఢిల్లీల కంటే సన్‌రైజర్స్ రన్‌రేట్ బాగుండటం వారికి సానుకూలాంశం. ఇది నిలబడాలంటే మిగిలిని రెండు మ్యాచ్‌ల్లో గెలిచి తీరాలి. సన్‌రైజర్స్ తన తదుపరి మ్యాచ్‌ల్లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌లతో తలపడనుంది. మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న టీమ్ ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది.