World Book Day: అలసిన మనసులను సేద తీర్చుతుంది.. పుస్తకం. మనకు నిజమైన నేస్తం.. నేడు ‘ప్రపంచ పుస్తక దినోత్సవం’..

World Book Day 2021: పుస్తకం.. ఒంటరితనంలో ఉంటే స్నేహితుడిలా అక్కున చేర్చుకుంటుంది. ఎన్నో బాధలతో అలసిన

  • Rajitha Chanti
  • Publish Date - 9:57 am, Fri, 23 April 21
World Book Day: అలసిన మనసులను సేద తీర్చుతుంది.. పుస్తకం. మనకు నిజమైన నేస్తం.. నేడు 'ప్రపంచ పుస్తక దినోత్సవం'..
World Book Day 2021

World Book Day 2021: పుస్తకం.. ఒంటరితనంలో ఉంటే స్నేహితుడిలా అక్కున చేర్చుకుంటుంది. ఎన్నో బాధలతో అలసిన మనసులను సేద తీర్చుతుంది. అందుకే ఓ మంచి పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం అది చదివే వాళ్ళకే తెలుస్తోంది. నిస్సహయంగా మిగిలిపోయామనే భావాన్ని సైతం తొలగించి.. నిన్ను నీకే సరికొత్తగా చూపిస్తుంది. కాలంతోపాటు మీతో ఉన్న మనుషుల స్వభావం మారవచ్చేమో గానీ.. మీ దగ్గర ఉన్న పుస్తకాలు మీకు తోడుగా ఉంటాయి. అలాగే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునే దారిలో చేయి పట్టుకుని నడిపించే సాధనం పుస్తకం. మనోవికాసానికి, మార్గనిర్దేశానికి గురువులా ఉపయోగపడుతుంది. అందుకే పుస్తకం అనితరమైన ఆయుధంగా, నేస్తంగా సమస్తంగా అన్ని తరాలవారినీ అలరిస్తోంది. ఏప్రిల్‌ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం..

World Book

పుస్తక దినోత్సవం.. ఈరోజునే ఎందుకు జరుపుకుంటారు ? దీని వెనక ఉన్న కారణామేంటి అని ఎప్పుడైన ఆలోచించారా ?.. ఈ రోజునే జరుపుకోవడానికి కూడా ఓ కారణం ఉంది.

17వ శతాబ్దంనాటి యూరప్‌లో ఈ రోజును సెయింట్ జార్జ్ డే గా పాటించేవారు. స్పెయిన్ లో ఇదే రోజున ప్రతి పుస్తక కొనుగోలు పై ఒక గులాబీని బహుమతిగా ఇస్తారు. సెవాంతెస్, షేక్సిపియర్, ఇన్కా గర్సిలాసో, వేగా అనే ప్రఖ్యాత రచయితలు 1616 సంవత్సరంలో ఇదే రోజు మరణించారు. అంతేకాదు జోసెఫ్ ప్లా, వ్లాదిమర్, మారిస్ ద్రువాం ఇలా ఇంకా చాలా చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత రచయితలు ఇదే రోజు మరణించడమో, జన్మించడమో కూడా ఈ పుస్తక దినోత్సవం చేసుకోవడానికి ఒక కారణం. అయితే ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు తేదీల్లో పుస్తక మహోత్సవాలు నిర్వహించినా ఇన్ని ప్రత్యేకతలున్న ఏప్రిల్ 23 వ తేదీన ప్రపంచ పుస్తక దినోత్సవం పాటించాలని 1955లో యునెస్కో ప్రకటించింది. అంతేకాకుండా ప్రపంచ పుస్తక, కాపీ హక్కుల దినంగా జరపాలని, రచయితలు, ప్రచురణకర్తలు, పాఠకులు, ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది. అలాగే ఏటా ప్రపంచంలోని ఒక ప్రముఖ నగరాన్ని ‘ప్రపంచ పుస్తక రాజధాని’గా ప్రకటిస్తూ వస్తోంది. 2017 సంవత్సరానికి గానూ రిపబ్లిక్‌ ఆఫ్‌ గినీలోని ‘కొనాక్రీ’ సిటీని, 2018 సంవత్సరానికి గానూ గ్రీస్‌లోని ‘ఏథెన్స్‌’ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించింది. 2019 సంవత్సరానికి కూడా దరఖాస్తులు చేస్కోవాల్సిందిగా తాజా ప్రకటన చేసింది యునెస్కో.

Book Day

Book Day

మనిషి మేధస్సును, విజ్ఞానాన్ని పెంచడానికి పుస్తకాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఒక్క పుస్తకం ద్వారా అందుకున్న విజ్ఞానం మనిషి జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే చిరిగిన చోక్కా అయినా తొడుక్కో గానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో.. ఓ మంచి పుస్తకం స్నేహితుడితో సమానం. ఓ మంచి పుస్తకం జీవితాన్ని మారుస్తుంది’ అని కందుకూరి ‍వీరేశలింగం పంతులు చెప్పిన మాటలు నేటికి వింటూనే ఉంటాం. కానీ.. ప్రస్తుత కాలంలో పుస్తక పఠనం పూర్తిగా తగ్గిపోయింది. ఎదైనా పుస్తకం చదవాలనిపిస్తే.. ఆన్ లైన్ లో చదువుతున్నారు. పుస్తకాలను తీసుకొని చదవడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. అందుకే పలు స్వచ్ఛంద సంస్థలు తమకు తోచినట్టుగా ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే లైబ్రరీలకు వచ్చే వారి సంఖ్య తగ్గి .. పుస్తకాలయాలు ఒంటరిగా మిగిలిపోతున్నాయి.

Book Read

పుస్తక పఠనంతో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. మేధస్సు పెంచడమే కాకుండా అనవసర ఆలోచనలను నియంత్రిస్తాయి. శారీరాన్ని ఆరోగ్యం ఉంచడమే కాకుండా… ఒత్తిడిని తగ్గిస్తాయి. రాత్రి పడుకోబోయే ముందు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదివడం వలన గాడ నిద్ర పట్టి శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుంది. అలాగే ఏకాగ్రత చేకూరి ఒంటరితనాన్ని దూరం చేస్తుంది.

World Book Day

Also Read: భార్గవ్ అమ్మాయిలను గౌరవించడు.. అతనో వుమెనైజర్.. షాకింగ్ విషయాలు చెప్పిన మరో అమ్మాయి..