International Labour Day 2021: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. మే డే.. ఎందుకు జరుపుకుంటారు.. చరిత్ర ఎంటో తెలుసుకుందామా….

Worker's Day 2021: మే డే.. దీనినే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం మే 1న దీనిని జరుపుకుంటారు. దీనినే కార్మికుల సెలవు దినం అంటారు.

International Labour Day 2021: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. మే డే.. ఎందుకు జరుపుకుంటారు.. చరిత్ర ఎంటో తెలుసుకుందామా....
International Labours Day 2
Follow us

|

Updated on: May 01, 2021 | 12:26 PM

Worker’s Day 2021: మే డే.. దీనినే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం మే 1న దీనిని జరుపుకుంటారు. దీనినే కార్మికుల సెలవు దినం అంటారు. కానీ అమెరికాలో మాత్రమే దీనిని లాయాల్టీ డేగా జరుపుకుంటారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. కార్మికుల పోరాట, కార్మికుల ఐక్యతకు గుర్తుగా ఈరోజును జరుపుకుంటారు. కార్మిక దినోత్సవం జరుపుకోవడానికి యావత్ ప్రపంచ దేశాలన్నింటిలో శ్రమ దోపిడిని నిరసిస్తూ.. కార్మికుల్లో స్పూర్తిని రగిలిస్తూ.. వేసిన ముందుడుగే ఈ మేడే.

చరిత్ర..

19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవ ఫలితంగా అమెరికా, యూరప్ దేశాలలో అనేక భారీ పరిశ్రమలు స్తాపించారు. ఈ పరిశ్రమలలో గాలి, వెలుతురు, కనీస సౌకర్యాలు లేకుండా రోజుకు 16-18 గంటలు కార్మికులతో చాకిరీ చేయించుకునేవారు. అయితే 1886లో ఈ విధానాన్ని నిరసిస్తూ.. మేలో చికాగోలోని హే మార్కెట్ లో  కార్మికుల ప్రదర్శన జరిగింది. తొలిసారిగా 1884లో రోజుకి 8 గంటలు మాత్రమే పని ఉండాలని కార్మికులు ఆందోళన ప్రారంభించారు. ఈ ఆందోళన 1886 నాటికి తారాస్థాయికి చేరింది.1886 మే 1న 40 వేల మంది కార్మికులు సమ్మె మొదలు పెడితే 3 మే నాటికి ఈ సంఖ్య లక్ష మందికి చేరుకుంది. ఆ సమ్మే మరింత ఉధృతమయ్యేసరికి యాజమాన్యాలు పోలీసులను కార్మికుల పైకి రెచ్చగొట్టారు. దీంతో పోలీసులు కార్మికులపై కాల్పులు జరపగా.. అందులో ఇద్దరు మరణించారు. దీంతో ఆగస్ట్ స్పైస్, పార్సన్స్, క్లోరిన్ మెస్ట్ లూయీస్ లింగ్ అనే కార్మిక నాయకుల ఆధ్వర్యంలో మెక్కార్మిక్ రీపర్ వర్క్ పారిశ్రామిక సంస్త ముందు పెద్ద ఎత్తున సమ్మె జరిగింది. శాంతియుతంగా జరుగుతున్న ఈ ప్రదర్శన మీద పోలీసులు హేమార్కెట్ వద్ద 4 మే రోజున జరిపిన కాల్పులో 8 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారు. తర్వాతి రోజుల్లో గాయపడిన వారిలో మరో ఏడుగురు చనిపోయారు. అయితే ఈ సంఘటనలకు మొత్తానికి కార్మిక నాయకులే కారణమని వారిపై హత్యా నేరం మోపి వారిని అరెస్ట్ చేసారు. నవంబరు 11, 1887లో ఈ కార్మిక నాయకులను దోషులుగా నిర్ధారించిన కోర్టులు పార్సన్స్, స్పైస్, ఎంగెల్, ఫిషర్ లకు ఉరిశిక్ష అమలు చేశాయి. దీనిని వ్యతిరేకిస్తూ మరో కార్మిక నాయకుడు లూయీస్ లింగ్ తననోటిలో బాంబు పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మొత్తాన్ని ‘హే మార్కెట్ దారుణ హత్యాకాండ’గా అంటారు. అప్పుడు మొదలైన కార్మిక ఆందోళనలు క్రమంగా పలు దేశాలకు వ్యాపించాయి. 1900 నుంచి 1920 వరకు ఐరోపాలో ప్రభుత్వ, ధనిక వ్యాపారుల దోపిడిని నిరసిస్తూ.. సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే 1న నిరసన ప్రదర్శనలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మే డే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టేవారు. తరవాతి దశకంలో మే 1ను నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపేవారు. హిట్లర్ పాలనలో ఆ రోజుని జాతీయ కార్మికుల దినోత్సవంగానూ జరుపుకునేవారు. ఇటలీలో ముస్సోలీ, స్పెయిన్‌లో జనరల్ ఫ్రాంకోలు మే డే పై అనేక ఆంక్షలను విధించారు. ఇక క్రమంగా చికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. ఆపై ప్రపంచవ్యాప్తంగా మే డే జరుపుకున్నారు. ఇవే కాకుండా అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలూ, నిరసన ప్రదర్శనలూ చేపట్టడం జరిగింది.

భారత్‏లో మేడే..

మనదేశంలో ఇతర దేశాల కంటే ముందే కలకత్తాలో కార్మికుల పనిగంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లోనే సమ్మె చేశారు. 1923లో తొలిసారిగా భారత్ దేశంలో మే డే ను పాటించారు. ఆ తర్వాత 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడడంతో అప్పటి నుంచి కార్మికవర్గాల్లో చైతన్యం మొదలైంది. దీంతో మే డే పాటిస్తున్నారు. కానీ అసంఘటిత కార్మిక వర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్‌, లిబరలైజేషన్‌, గ్లోబలైజేషన్‌ (ఎల్పీజీ) పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఐరోపా దేశాల్లో మే 1ని సెలవు దినంగా పాటించడం మొదలుపెట్టారు. అనంతరం అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి. చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు ఆ రోజునే అమల్లోకి వచ్చాయి.

Also Read: Bank Holidays: మే నెలలో 12 రోజులు బ్యాంక్స్ బంద్.. ఈనెలలో బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడంటే..

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఆ రోజు నుంచే అమలులోకి…