AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డు పక్కన చెట్లకు నెంబర్లు ఎందుకుంటాయి..? వామ్మో.. ఇంత పెద్ద చరిత్ర దాగి ఉందా..?

రోడ్ల పక్కన కొన్నిచోట్ల మీరు చెట్లను చూస్తే వాటిపై నెంబర్లు ఉండటం మీరు గమనించి ఉంటారు. అయితే ఇలా ఎందుకు ఉంటాయనే అనుమానం చాలామందికి ఉంటుంది. సాధారణంగా నెంబర్లు వేసి ఉంటారని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దీని వెనుక చాలా కారణమే ఉంది.

రోడ్డు పక్కన చెట్లకు నెంబర్లు ఎందుకుంటాయి..? వామ్మో.. ఇంత పెద్ద చరిత్ర దాగి ఉందా..?
Trees Numbers
Venkatrao Lella
|

Updated on: Aug 29, 2026 | 10:41 PM

Share

మీరు ఆడవిలో చూసినా లేదా రోడ్లపై వెళుతున్నా చెట్లపై నెంబర్లు వేసి ఉండటం చూసి ఉంటారు. పెయిటింగ్‌తో నెంబర్లు వేయడం లేదా మెటల్ ట్యాగ్‌లు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే చెట్లకు నెంబర్లు ఎందుకు వేస్తారనే సందేహాం చాలామందికి కలుగుతూ ఉంటుంది. అయితే చెట్లకు ఇలా నెంబర్లు ఇవ్వడం వెనుక పెద్ద రీజన్ ఉంది. చెట్టు హిస్టరీ, దాని ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు గుర్తించవచ్చు. అటవీశాఖ ఈ నెంబర్లను వేస్తూ ఉంటుంది. ఈ నెంబర్ల వెనుక అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. దీని ద్వారా చెట్టుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వడమే కాకుండా దాని జాతి, పెరుగుదల, వయస్సు, పరిమాణం, పెరుగుదల లాంటి వివరాలను ఈజీగా అటవీశాఖ అధికారులు ట్రాక్ చేయవచ్చు.

ప్రతీ చెట్టుకు ప్రత్యేక గుర్తింపు

ఈ నెంబర్ ద్వారా ఆ చెట్టు చరిత్ర మొత్తం తెలుసుకోవచ్చు. దీని ద్వారా చెట్టుకు ప్రత్యేక గుర్తింపు అనేది ఉంటుంది. రికార్డుల్లో ఈ చెట్టు పొడవు, చుట్టుకొలత, జాతి వంటి వివరాలను నమోదు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఒక్కొ చెట్టుకు ఒక్కొ ప్రత్యేకమైన నెంబర్ ఇవ్వడం వల్ల ఆ చెట్టు చరిత్రను సులువుగా తెలుసుకోవచ్చు. ఇక ఈ చెట్టు ఎండిపోయిందా లేదా పురుగుల ప్రభావంతో నాశనమైందా అనేది గుర్తించవచ్చు. ఈ ప్రత్యేక నెంబర్ ద్వారా కొంతకాలం అయిన తర్వాత ఆ చెట్టు పెరిగిందా.. లేదా అనేది ట్రాక్ చేయవచ్చు. ఒక ప్రాంతంలో ఏ జాతి వృక్షాలు ఎక్కువగా ఉన్నాయి.. ? అవి ఎలా పెరుగుతున్నాయి? అనేవి తెలుసుకోవచ్చు. ఇక ఏయే ప్రాంతాల్లో ఏయే చెట్లు పెరుగుతున్నాయనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు. చెట్లపై పరిశోధనలు చేయడానికి కూడా ఈ నెంబర్లు ఉపయోగపడతాయి.

అడవిలో వృక్ష సంపదను ఎలా లెక్కిస్తారు..?

ఇక అడవిలో వేర్వేరు జాతులకు చెందిన వృక్షాలు ఉంటాయి. అడవిలో వందలు, వేల ఎకరాల్లో ఇవి విస్తరించి ఉంటాయి. దీంతో వీటిని లెక్కించడం, కొలవడం చాలా కష్టంతో కూడుకున్న పని, దీంతో శాంపిల్ ప్లాట్ పద్దతి ద్వారా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడి చెట్లను కొలుస్తారు. దీంతో ఆ ప్రాంతంలో చెట్ల ఎత్తు, వయస్సు ఎంత ఉంది… చుట్టుకొలత ఎంత ఉంది అనే వివరాలను నమోదు చేస్తారు. ఈ సమాచారాన్ని అంచనా వేసి అడవిలో మొత్తం వృక్ష సంపద ఎంత ఉందనేది లెక్కిస్తారు. ఈ శాంపిల్ ప్లాట్లలోని చెట్లకు నెంబర్లు వేయడం ద్వారా ఒక్కొ చెట్టుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది.

Follow Us