AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు ప్రకారం ఇల్లు కట్టినా కష్టాలు తీరడం లేదా? ఈ చిన్న తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి!

చాలామంది వాస్తు శాస్త్రం ప్రకారం ఎంతో నిష్టగా ఇల్లు నిర్మించుకుంటారు. కానీ, అడుగు పెట్టినప్పటి నుండి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు లేదా అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వాస్తు ప్రకారం ఇల్లు కట్టినప్పటికీ ఇబ్బందులు ఎదురవుతుంటే, దానికి ఇంట్లో ఉండే కొన్ని ప్రతికూల వస్తువులే కారణమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణంతో పాటు మనం చేసే కొన్ని పొరపాట్లు ఎలా ప్రభావం చూపుతాయో ఇక్కడ తెలుసుకోండి.

వాస్తు ప్రకారం ఇల్లు కట్టినా కష్టాలు తీరడం లేదా? ఈ చిన్న తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి!
Vastu Mistakes At Home
Jyothi Gadda
|

Updated on: Apr 09, 2026 | 9:13 AM

Share

వాస్తు శాస్త్ర నియమాలను పాటించి ఇల్లు నిర్మించినప్పటికీ, కొన్నిసార్లు జీవితంలో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి మనం చేసే చిన్న పొరపాట్లే అంటున్నారు వాస్తు నిపుణులు. కేవలం ఇంటి నిర్మాణం మాత్రమే కాకుండా, ఇంట్లోని వస్తువుల అమరిక, మన అలవాట్లు కూడా వాస్తు దోషాలకు కారణమవుతాయని చెబుతున్నారు. మనం తెలియక ఇంట్లో ఉంచుకునే కొన్ని వస్తువులు నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని అంటున్నారు. అలాంటివి ఇంట్లో ఉండకూడదని వస్తువులేంటో తప్పక తెలుసుకోండి.

పనిచేయని గడియారాలు: ఆగిపోయిన గడియారాలు ప్రగతిని అడ్డుకుంటాయని వాస్తు చెబుతోంది.

విరిగిన అద్దాలు: పగిలిన లేదా గీతలు పడిన అద్దాలు ఇంట్లో ఉండటం వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది.

ఇవి కూడా చదవండి

పాడైపోయిన ఎలక్ట్రానిక్స్: ఉపయోగించని, మొరాయించే ఎలక్ట్రానిక్ వస్తువులు రాహు దోషానికి కారణమవుతాయి.

సింహద్వారం వద్ద జాగ్రత్తలు: ఇంటి ప్రధాన ద్వారం లక్ష్మీదేవి వచ్చే దారి. అక్కడ చెప్పులు చిందరవందరగా వేయడం, చెత్త కుప్పలు ఉంచడం వల్ల సానుకూల శక్తి ఇంటిలోకి ప్రవేశించదు. ద్వారం వద్ద ఎప్పుడూ వెలుతురు ఉండేలా చూసుకోవాలి.

అలంకరణ చిత్రపటాలు: ఇంట్లో శాంతిని ఇచ్చే చిత్రపటాలు ఉండాలి. యుద్ధం, ఏడుస్తున్న ఆకృతులు లేదా ముళ్ల మొక్కల చిత్రాలు ఉండటం వల్ల ఇంట్లో ఒత్తిడి పెరుగుతుంది. అలాగే, బెడ్‌రూమ్‌లో అద్దం మంచానికి ఎదురుగా ఉండటం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పరిష్కార మార్గాలు: ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి, ముఖ్యంగా ఈశాన్య మూల ఖాళీగా ఉండాలి. సాయంత్రం వేళల్లో దీపారాధన చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఎండిపోయిన మొక్కలను వెంటనే తొలగించి, పచ్చని మొక్కలను పెంచడం వల్ల సానుకూలత పెరుగుతుంది. వాస్తు అనేది కేవలం పునాదులకు మాత్రమే కాదు, మనం నివసించే విధానానికి కూడా సంబంధించింది. పైన పేర్కొన్న చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీ ఇంట్లో మళ్లీ సుఖశాంతులు నెలకొనే అవకాశం ఉంది.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
డెలాయిట్‌లో మంచి జాబ్ వదిలి ఇండస్ట్రీకి వచ్చాడు.. ఇప్పుడు ఆయనే..
డెలాయిట్‌లో మంచి జాబ్ వదిలి ఇండస్ట్రీకి వచ్చాడు.. ఇప్పుడు ఆయనే..
ప్రెగ్నెంట్ అయినా ఫిట్‌నెస్‌ తప్పనిసరి అంటున్న నటి
ప్రెగ్నెంట్ అయినా ఫిట్‌నెస్‌ తప్పనిసరి అంటున్న నటి
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. థియేటర్లలో యూత్ ఎగబడి చూశారు
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. థియేటర్లలో యూత్ ఎగబడి చూశారు
సబ్జా vs చియా సీడ్స్.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
సబ్జా vs చియా సీడ్స్.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
మంట పుట్టిస్తున్న సమ్మర్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మంట పుట్టిస్తున్న సమ్మర్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కోపాన్ని మోస్తుంటే ఏం జరుగుతుందో సైకాలజిస్టుల మాట
కోపాన్ని మోస్తుంటే ఏం జరుగుతుందో సైకాలజిస్టుల మాట
అక్బర్, టిప్పు సుల్తాన్ మెచ్చిన రాజరికపు రుచి.. వీధి చిరుతిండి..
అక్బర్, టిప్పు సుల్తాన్ మెచ్చిన రాజరికపు రుచి.. వీధి చిరుతిండి..
అందం కోసం ఆరాటంలో జెన్‌ ఆల్ఫా.. కోల్పోతున్నది ఏంటి
అందం కోసం ఆరాటంలో జెన్‌ ఆల్ఫా.. కోల్పోతున్నది ఏంటి
ఉచ్ఛ స్థితితో రవి.. ఆ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!
ఉచ్ఛ స్థితితో రవి.. ఆ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!
ఇంటర్ ఫలితాల్లో2026 అమ్మాయిల సత్తా.. మేడ్చల్‌ జిల్లా టాప్!
ఇంటర్ ఫలితాల్లో2026 అమ్మాయిల సత్తా.. మేడ్చల్‌ జిల్లా టాప్!