AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి.. ఈ షాకింగ్‌ నిజాలు తెలుసుకున్న తరువాత..

ప్లాస్టిక్ గ్లాసుల వినియోగం తగ్గించాలని మనం పేపర్ కప్పుల వైపు మళ్లాం. కానీ, ఈ పేపర్ కప్పులు కూడా మన ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయని మీకు తెలుసా? అవును.. మనం రోజువారీగా టీ, కాఫీలు తాగడానికి ఉపయోగించే పేపర్ కప్పుల (Paper Cups) వెనుక మనకు తెలియకుండానే ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదాలు పొంచి ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. పర్యావరణానికి మేలు చేస్తాయని భావించే ఈ కప్పులు, వాస్తవానికి శరీరానికి హానికరమని నిపుణులు హెచ్చరించారు. పేపర్ కప్పుల వినియోగం వల్ల కలిగే ముప్పుల గురించి ఇక్కడ తెలుసుకోండి.

పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి.. ఈ షాకింగ్‌ నిజాలు తెలుసుకున్న తరువాత..
Paper Cups
Jyothi Gadda
|

Updated on: Apr 09, 2026 | 8:02 AM

Share

సాధారణంగా కాగితం నీటిని పీల్చుకుంటుంది. కాబట్టి పేపర్ కప్పులు తడవకుండా ఉండటానికి వాటి లోపల హై-డెన్సిటీ పాలిథిలిన్ అనే ప్లాస్టిక్ పొరను అతికిస్తారు. మనం 85 నుండి 90 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి ఉన్న పానీయాలను ఈ కప్పుల్లో పోసినప్పుడు, కేవలం 15 నిమిషాల్లోనే సుమారు 25,000 మైక్రో-ప్లాస్టిక్ కణాలు ఆ పానీయంలో విడుదలవుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

ఆరోగ్యంపై ప్రభావం:

ఈ సూక్ష్మ ప్లాస్టిక్ కణాలతో పాటు ‘ఫ్లోరైడ్’, ‘క్లోరైడ్’ మరియు ‘సల్ఫేట్’ వంటి హానికరమైన రసాయనాలు కూడా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల కలిగే నష్టాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలు మొదలవుతాయి. క్రమంగా ఇవి ప్రేగులకు సంబంధించిన వ్యాధులను కలిగిస్తాయి. హార్మోన్ల మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. థైరాయిడ్, ఇతర హార్మోన్ల వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు.. ఈ పేపర్ కప్పుల వాడకం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ రసాయనాలు శరీరంలో పేరుకుపోవడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. అందుకే సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఆశ్రయించాలని నిపుణులు సూచించారు.

పేపర్ కప్పులకు బదులుగా మట్టి కప్పులు వాడమని సూచిస్తున్నారు. ఇవి పర్యావరణానికి, ఆరోగ్యానికి అత్యంత సురక్షితమైనవి. వీటిలో తాగడం వల్ల సహజమైన మట్టి సువాసన కూడా లభిస్తుంది. లేదంటే,స్టీల్ గ్లాసులు ఉన్నా సరే. ఇంట్లో లేదా ఆఫీసులో వీలైనంత వరకు స్టీల్ లేదా మెటల్ గ్లాసులను వాడటం అలవాటు చేసుకోండి. గాజు గ్లాసులు కూడా ఉత్తమం. ఇవి వేడిని తట్టుకుంటాయి. ఎటువంటి రసాయనాలను విడుదల చేయవు.

వాస్తవంగా కాగితం కప్పు కదా.. సురక్షితమే అనే భ్రమలో ఉండకండి. బయట టీ తాగేటప్పుడు మీ స్వంత గ్లాసును వెంట తీసుకెళ్లడం లేదా మట్టి పాత్రలను వాడమని దుకాణదారుడిని కోరడం మంచిది. ఆరోగ్యం విషయంలో చేసే చిన్న మార్పు పెద్ద ప్రమాదాలను తప్పిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
తిరుమలలో ఈ దర్శనాల గురించి మీకెవరూ చెప్పరు.. ఎన్ని మార్గాలంటే
తిరుమలలో ఈ దర్శనాల గురించి మీకెవరూ చెప్పరు.. ఎన్ని మార్గాలంటే
ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా.
ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా.
కరెంట్ లేకపోయినా ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు.. 5 ట్రిక్స్..
కరెంట్ లేకపోయినా ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు.. 5 ట్రిక్స్..
నూనె పీల్చకుండా అదిరిపోయే బలవర్ధకమైన ఉలవ వడలు
నూనె పీల్చకుండా అదిరిపోయే బలవర్ధకమైన ఉలవ వడలు
'డోంట్ ‍ట్రబుల్ ద ట్రబుల్' సినిమాలో నటించిన ఈ పాప ఎవరో తెలుసా?
'డోంట్ ‍ట్రబుల్ ద ట్రబుల్' సినిమాలో నటించిన ఈ పాప ఎవరో తెలుసా?
మిక్సీ సరిగ్గా తిరగడం లేదా.. జస్ట్ 2 నిమిషాల్లో ఇలా సెట్ చేయండి..
మిక్సీ సరిగ్గా తిరగడం లేదా.. జస్ట్ 2 నిమిషాల్లో ఇలా సెట్ చేయండి..
పళ్ళు లేని ముసలివాళ్లు కూడా తినేంత దూదిలాంటి ఆరోగ్యమైన రొట్టెలు
పళ్ళు లేని ముసలివాళ్లు కూడా తినేంత దూదిలాంటి ఆరోగ్యమైన రొట్టెలు
షేన్ వార్న్, జంపా రికార్డులు బ్రేక్ చేసిన కుల్దీప్ యాదవ్
షేన్ వార్న్, జంపా రికార్డులు బ్రేక్ చేసిన కుల్దీప్ యాదవ్
కేవలం రూ.299కే ఫోన్.. ఆరు నెలల రీఛార్జ్ ఫ్రీ..
కేవలం రూ.299కే ఫోన్.. ఆరు నెలల రీఛార్జ్ ఫ్రీ..
ఈ గింజలను నానబెట్టి రాస్తే.. జట్టు వద్దన్నా పెరుగుతుందట!
ఈ గింజలను నానబెట్టి రాస్తే.. జట్టు వద్దన్నా పెరుగుతుందట!