AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పిల్లల జీవితాన్ని మార్చే 20 సెకన్ల మ్యాజిక్! ఈ పేరెంటింగ్ రూల్ గురించి తప్పక తెలుసుకోండి..

పిల్లల పెంపకం అంటే కేవలం వారికి మంచి ఆహారం, చదువు అందించడమే కాదు.. వారిని మానసికంగా ఎంత బలంగా తయారుచేస్తున్నామనేది కూడా ముఖ్యం. దీని కోసం ఖరీదైన బొమ్మలు అక్కర్లేదు, కేవలం మీ ప్రేమతో కూడిన ఒక కౌగిలింత సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల పెంపకంలో కేవలం 20 సెకన్ల ఆలింగనం (Hug) ఎంతటి సానుకూల మార్పులను తీసుకువస్తుందో వారు వివరిస్తున్నారు. 20-సెకండ్ హగ్ రూల్ అని పిలుస్తారు. 20 సెకండ్ హగ్ రూల్ అంటే ఏమిటో ప్రతి పేరెంట్‌ తప్పక తెలుసుకోవాలి.

మీ పిల్లల జీవితాన్ని మార్చే 20 సెకన్ల మ్యాజిక్! ఈ పేరెంటింగ్ రూల్ గురించి తప్పక తెలుసుకోండి..
Benefits Of Hugging Kids
Jyothi Gadda
|

Updated on: Apr 08, 2026 | 1:57 PM

Share

సాధారణంగా మనం పిల్లలను ప్రేమతో తడుతాము లేదా ముద్దు పెట్టుకుంటాము. కానీ, కనీసం 20 సెకన్ల పాటు నిరంతరాయంగా వారిని హత్తుకోవడం వల్ల వారి శరీరంలో అద్భుతమైన రసాయనిక మార్పులు జరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. పలు పరిశోధనల ప్రకారం, ఈ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్ పిల్లల మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. పిల్లలను కేవలం 20 సెకన్ల పాటు హత్తుకోవడం వల్ల వారి మెదడులో ఆక్సిటోసిన్ (Oxytocin) అనే హార్మోన్ విడుదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది పిల్లల్లో ఒత్తిడిని తగ్గించి, వారిని మానసికంగా దృఢంగా మారుస్తుంది. దీనివల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..

ఒత్తిడి నివారణ: పిల్లలు కూడా పాఠశాల లేదా ఇతర కారణాల వల్ల ఒత్తిడికి గురవుతారు. ఒక సుదీర్ఘమైన ఆలింగనం వారి శరీరంలోని కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయిని తగ్గించి, వారిని రిలాక్స్‌గా ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

ఆత్మవిశ్వాసం పెరుగుదల: తల్లిదండ్రుల నుండి లభించే స్పర్శ పిల్లలకు తాము సురక్షితంగా ఉన్నామనే భరోసాను ఇస్తుంది. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని, ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండే గుణాన్ని పెంచుతుంది.

జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యం: మానసికంగా ప్రశాంతంగా ఉన్న పిల్లల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఆక్సిటోసిన్ విడుదల వల్ల వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

బంధం బలపడటం: బిజీ లైఫ్ వల్ల పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నామని బాధపడే తల్లిదండ్రులు, రోజుకు రెండు మూడు సార్లు ఇలా 20 సెకన్ల పాటు వారిని హత్తుకోవడం వల్ల వారి మధ్య అనుబంధం ఎంతో బలపడుతుంది.

పిల్లలు కోపంగా ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు లేదా భయపడుతున్నప్పుడు ఈ 20 సెకన్ల రూల్ పాటించడం వల్ల వారు త్వరగా సాధారణ స్థితికి వస్తారు. ఈ రోజు నుండే మీ పిల్లలతో ఈ మధురమైన అలవాటును ప్రారంభించండి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
తులం బంగారం అతి తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?
తులం బంగారం అతి తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?
ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..?
ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..?
జస్ట్ రూ.25తో హైదరాబాద్‌ నుంచి కొమురవెల్లికి ప్రయాణం
జస్ట్ రూ.25తో హైదరాబాద్‌ నుంచి కొమురవెల్లికి ప్రయాణం
ఫ్రిజ్‌లో దాచినా పచ్చిమిర్చి త్వరగా పాడవుతున్నాయా?
ఫ్రిజ్‌లో దాచినా పచ్చిమిర్చి త్వరగా పాడవుతున్నాయా?
వర్షంలో తడిస్తే జుట్టు రాలిపోతుందా? అసలు నిజం ఇదే..!
వర్షంలో తడిస్తే జుట్టు రాలిపోతుందా? అసలు నిజం ఇదే..!
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి గోల్డ్ మెడల్
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి గోల్డ్ మెడల్