Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine’s Day 2023: ప్రేమికుల రోజున మీ భాగస్వామికి ఇలాంటి బహుమతి అస్సలు ఇవ్వకండి.. బ్రేకప్ అవ్వొచ్చు..!

ప్రేమ జంటలకు ఫిబ్రవరి నెల చాలా స్పెషల్. ఇది ప్రేమకు అంకితం చేసిన నెలగా ప్రేమికులు భావిస్తారు. ఈ నెల 14 ప్రేమికులకు చాలా స్పెషల్ డే. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 14 వరకు వాలెంటైన్స్ వీక్‌ అంటారు.

Valentine's Day 2023: ప్రేమికుల రోజున మీ భాగస్వామికి ఇలాంటి బహుమతి అస్సలు ఇవ్వకండి.. బ్రేకప్ అవ్వొచ్చు..!
Love Story
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 10, 2023 | 8:29 AM

ప్రేమ జంటలకు ఫిబ్రవరి నెల చాలా స్పెషల్. ఇది ప్రేమకు అంకితం చేసిన నెలగా ప్రేమికులు భావిస్తారు. ఈ నెల 14 ప్రేమికులకు చాలా స్పెషల్ డే. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 14 వరకు వాలెంటైన్స్ వీక్‌ అంటారు. ప్రేమను వ్యక్తపరిచే, ప్రపోజ్ చేయాలనుకునే జంటలు వాలెంటైన్స్ వీక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఫిబ్రవరి 14న ప్రేమికులు తమ భాగస్వామికి సర్‌ప్రైజ్ ఇవ్వడానికి, ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. అయితే, వాలెంటైన్స్ డే రోజున ప్రేమికులు కొన్ని బహుమతులను ఇవ్వకూడదని అంటుంటారు. అలాంటి బహుమతులు ఇస్తే.. ఇద్దరి మధ్య బ్రేకప్ అవుతుందని చెబుతుంటారు. మరి ఎలాంటి బహుమతులు ఇవ్వొద్దో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రేమికుల రోజున మీ భాగస్వామికి ఈ బహుమతులు ఇవ్వకండి..

1. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా మీ భాగస్వామికి డ్రెస్ బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నట్లయితే రంగుల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పొరపాటున కూడా బ్లాక్ డ్రెస్ కొనివ్వొద్దు. హిందూ మతంలో నలుపు రంగు అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే పొరపాటున కూడా భాగస్వామికి బ్లాక్ డ్రెస్ గిఫ్ట్‌గా ఇవ్వకూడదు.

2. జ్యోతిష్యం ప్రకారం చేతి రుమాలు, పెన్నులు బహుమతిగా ఇవ్వకూడదు. ఇది ఇద్దరి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పనికి సంబంధించిన ఏదైనా వస్తువును బహుమతిగా ఇస్తే వ్యాపారంలో నష్టం వాటిల్లుతుందని కూడా అంటారు. దీంతో పాటు, సంబంధాలలో కూడా దుష్ప్రభావం చూపుతుంది.

3. ప్రేమికుల రోజున పొరపాటున కూడా మీ భాగస్వామికి బూట్లు బహుమతిగా ఇవ్వొద్దు. బూట్లు విడిపోవడానికి చిహ్నంగా పరిగణించబడతాయి.

4. చాలామంది ప్రేమికులు తమ భాగస్వామికి వాచ్‌లను గిఫ్ట్‌గా ఇస్తుంటారు. కానీ జ్యోతిషశాస్త్రంలో ఇది మంచి బహుమతిగా పరిగణించబడదు. మీరు ఎవరికి వాచీని బహుమతిగా ఇస్తున్నారో, వారి పురోగతికి ఆటంకం ఏర్పడుతుందని విశ్వాసం. అందుకే ప్రేమికుల రోజున మీ భాగస్వామికి వాచ్ ఇవ్వొద్దు.

5. ప్రేమికుల రోజున మీ భాగస్వామికి పెర్ఫ్యూమ్, వైన్, జ్యూస్ వంటి వాటిని బహుమతిగా ఇవ్వొద్దు. వీటిని వస్తువులను బహుమతిగా ఇవ్వడం ద్వారా, దంపతుల మధ్య సంబంధం కొద్దికాలంలోనే క్షీణించడం ప్రారంభిస్తుందని మరియు సంబంధంలో దూరం ఏర్పడుతుందని నమ్ముతారు.

మరిన్ని ఆఫ్‌బీట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఎన్నో ఏళ్ల ప్రయాణం ముగిసింది.. ఈ బైక్‌లు ఇకపై భారతదేశంలో ఉండవు!
ఎన్నో ఏళ్ల ప్రయాణం ముగిసింది.. ఈ బైక్‌లు ఇకపై భారతదేశంలో ఉండవు!
కుప్పకూలిన అజిత్ 285 అడుగుల కటౌట్..
కుప్పకూలిన అజిత్ 285 అడుగుల కటౌట్..
అయ్యో భగవంతుడా.. పసివాడి ఉసురు తీసిన ఊర కుక్క..
అయ్యో భగవంతుడా.. పసివాడి ఉసురు తీసిన ఊర కుక్క..
ఉల్లిపాయ రసంలో వీటిని కలిపి రాస్తే జుట్టు సమస్యలకు చెక్ పడినట్టే!
ఉల్లిపాయ రసంలో వీటిని కలిపి రాస్తే జుట్టు సమస్యలకు చెక్ పడినట్టే!
ఒక్క ఏడాదిలోనే 12 సినిమాలు.. అప్పట్లోనే పాన్ ఇండియా క్రేజ్..
ఒక్క ఏడాదిలోనే 12 సినిమాలు.. అప్పట్లోనే పాన్ ఇండియా క్రేజ్..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు..
ఎండిన ఈ పండ్లు రోజూ గుప్పెడు తింటే చాలు.. ఆడ, మగ ఇద్దరికీ లాభామే!
ఎండిన ఈ పండ్లు రోజూ గుప్పెడు తింటే చాలు.. ఆడ, మగ ఇద్దరికీ లాభామే!
అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?
అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?
ఐఫోన్ 17 ప్రో కెమెరా ఎలా ఉంటుందో తెలుసా? మునుపటి కంటే రెండింతలు!
ఐఫోన్ 17 ప్రో కెమెరా ఎలా ఉంటుందో తెలుసా? మునుపటి కంటే రెండింతలు!
రూ. 39.25 కోట్లు ఖర్చు చేస్తే కావ్య పాపను నిండా ముంచేసిన ముగ్గురు
రూ. 39.25 కోట్లు ఖర్చు చేస్తే కావ్య పాపను నిండా ముంచేసిన ముగ్గురు