ఇంట్లో ఈగలను వదిలించుకోవడం చాలా కష్టం. ఇంటి చుట్టూ కొంచెం మురికి పడినా చాలు.. ఈగలు దండయాత్రకు దిగుతాయి. ఇంటిని ఆక్రమించేసి విసుగుపుట్టిస్తాయి ఈగల గుంపు. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్, కంటి ఇన్ఫెక్షన్, టైఫాయిడ్ జ్వరం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మీరు కూడా ఈగల వల్ల ఇబ్బంది పడుతుంటే, ఇక్కడ పేర్కొన్న చిట్కాలు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
అది కూడా అతి తక్కువ ఖర్చుతో, ఇంట్లో ఉంచిన వస్తువులతోనే ఈగలను తరిమికొట్టవచ్చునని మీకు తెలుసా.? ఈగలను తరిమికొట్టడానికి ఇటువంటి హోం రెమెడీస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా చెదపురుగులు, శిలీంధ్రాల నుండి బట్టలను కాపాడుకునేందుకు..దాదాపు ప్రతి ఇంట్లో నాఫ్తలీన్ మాత్రలను ఉపయోగిస్తుంటారు. అందుకే ఈగలను తరిమికొట్టడం చాలా చౌక. ఎలాగంటే.. ఇందుకోసం 4-5 నాఫ్తలిన్ మాత్రలు తీసుకుని బాగా గ్రైండ్ చేసి నీళ్లలో వెనిగర్ కలపాలి. ఇప్పుడు అది పూర్తిగా కరిగిపోయే వరకు వేడి చేయండి. చల్లారిన తర్వాత, మొత్తం మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపండి. ఇప్పుడు ఇళ్లు తుడుచుకునే ముందు ఇంటి అంతటా చల్లుకోండి. ఇలా చేయడం వల్ల కేవలం 1 నిమిషంలో ఈగలు ఇంటి నుండి పారిపోతాయి.
1 టీస్పూన్ ఎర్ర కారం పొడిని నీళ్లలో కలిపి తలుపులు, కిటికీల దగ్గర చిలకరిస్తే ఇంట్లోకి ఈగలు రావు. మీరు డ్రైనేజీ దగ్గర కూడా పిచికారీ చేయవచ్చు. కాకపోతే, చల్లేటప్పుడు జాగ్రత్త వహించండి. లేదంటే, ఈ ద్రావణం ఘాటుకు కళ్ళు, చేతులు మండిపోతాయి. ఇంకా మీరు కారంపొడికి బదులుగా వేప లేదా తులసి ఆకుల పొడిని కూడా ఉపయోగించవచ్చు.
ఉప్పు, నిమ్మకాయ సహాయంతో ఇంట్లో ఈగలను తరిమికొట్టడానికి స్ప్రేని తయారు చేసుకొవచ్చు. దీని కోసం, 1 కప్పు నీటిలో 1 నిమ్మకాయ రసం, 2 టీస్పూన్ల ఉప్పు కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత దాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి, ఈగలు ఎక్కువగా ఉన్న చోట చల్లుకోండి. ఈగలు పుల్లని రుచిని ఇష్టపడవని చెబుతారు. దాంతో అవి వెంటనే అక్కడ్నుంచి పారిపోవటం ఖాయం.
ఇంట్లో ఏదో ఒక మూలలో మురికి పడితే ఈగలు ఎక్కువగా వస్తాయి. అటువంటి పరిస్థితిలో, అనేక సార్లు పైన పేర్కొన్న చర్యలు కూడా సమర్థవంతంగా పనిచేయవు. అలాంటప్పుడు ఈగలను పూర్తిగా వదిలించుకోవడానికి, మీరు ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.. వంటగదిలోని డస్ట్‌బిన్‌ను ఖాళీ చేయడం, మురికి పాత్రలను ఎక్కువసేపు సింక్‌లో ఉంచకుండా చూసుకోండి. కిటికీలు, తలుపులకు నెట్ ఏర్పాటు చేసుకోండి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం ..