Viral Video: వామ్మో… ఇదేంటీ ఇలా ఉంది.! భయాందోళనకు గురి చేస్తోన్న మూడు కళ్ల వింత జీవి.. వైరల్‌ అవుతోన్న వీడియో..

Viral Video: ఈ భూగ్రహం ఎన్నో వింతలకు, మరెన్నో విశేషాలకు నెలవు. ఆశ్చర్యం కలిగించే ఎన్నో అంశాలు ప్రపంచంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఇలాంటి వింతలు, విశేషాలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి...

Viral Video: వామ్మో... ఇదేంటీ ఇలా ఉంది.! భయాందోళనకు గురి చేస్తోన్న మూడు కళ్ల వింత జీవి.. వైరల్‌ అవుతోన్న వీడియో..
Three Eyed Different Creatu
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 07, 2021 | 8:26 PM

Viral Video: ఈ భూగ్రహం ఎన్నో వింతలకు, మరెన్నో విశేషాలకు నెలవు. ఆశ్చర్యం కలిగించే ఎన్నో అంశాలు ప్రపంచంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఇలాంటి వింతలు, విశేషాలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూలన ఏది జరిగినా వెంటనే స్మార్ట్‌ ఫోన్‌లలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇలా నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియోల జాబితాలోకి తాజాగా మరో వీడియో వచ్చి చేరింది. వివరాల్లోకి వెళితే.. టెక్సాస్‌లో ఓ వింత జీవి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా అమెరికాలోని టెక్సాస్‌ నగర వీధుల్లో ఓ వింత జీవి కనిపించింది. దాన్ని ఓ టిక్‌టాక్‌ యూజర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో యావత్‌ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఎలుకను పోలినట్లు ఉన్న ఆ జీవికి రెండు కళ్లతో పాటు మధ్యలో ఇంకో కన్ను ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు భయపడుతున్నారు. అయితే ఆ జీవి గురించి తెలిసిన కొందరు నెటిజన్లు మాత్రం దాని గురించి వివరించే ప్రయత్నం చేశారు. ఈ వింత జీవి మెలనిస్టిక్‌ బూడిత ఉడుత అని ఓ నెటిజన్‌ తెలిపారు. ఇక ఆ మూడో కన్ను గురించి తెలుపుతూ.. ఈ జాతి ఉడుత, పిల్లలకు జన్మనిచ్చే సమయంలో గూడు నిర్మించుకుంటుంది. ఇందుకోసం తన శరీరానికి ఉన్న వెంట్రుకలను తీస్తుంది. ఆ క్రమంలో ఊడిపోయిన ఆ జుట్లు స్థానంలోనే మూడో కన్నులాగా కనిపిస్తుందని సదరు నెటిజన్‌ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ వింత జీవిని చూసిన కొందరు ఒకింత ఆసక్తి కనబరుస్తున్నా.. చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు.

నెట్టింట వైరల్‌గా మారిన ఆ వింత జీవి వీడియో..

Also Read: గోవాలో విశిష్టమైన పరమేశ్వరుని ఆలయం.. పరమ శివుడు ప్రత్యేక్షమైన ప్రదేశం గురించి తెలుసా..

Viral Video: ఈ బుడ్డోడు వయసులోనే చిన్నోడు..దయా గుణంలో చాలా పెద్దోడు.. పిల్లలంటే ఇలా ఉండాలి..

LPG Booking In WhatsApp: ఇకపై గ్యాస్‌ బుకింగ్‌ మరింత సులువు.. వాట్సాప్‌లో కేవలం నిమిషాల్లోనే.. ఎలా చేసుకోవాలంటే..