Women Law: అక్కడ అత్యాచారం చేసి బిడ్డను ఇమ్మని ఆమెను కోరవచ్చు.. దారుణం కదూ.. ఇలాంటి అమానుష చట్టాలు ఎక్కడున్నాయో తెలుసా?

ఇజ్రాయెల్ వంటి సంపన్న దేశంలో కూడా, ఒక మహిళను కత్తితో 20 సార్లు పొడిచినా నిర్దోషిగా ప్రకటించే చట్టాలు ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా.. ఇలాంటి దేశం ఇజ్రాయెల్ ఒక్కటే కాదు. ఇలాంటి మహిళా వ్యతిరేక చట్టాలు భారతదేశంతో సహా అనేక పెద్ద దేశాల్లో ఇప్పటికీ అమలులో ఉన్నాయి.

Women Law: అక్కడ అత్యాచారం చేసి బిడ్డను ఇమ్మని ఆమెను కోరవచ్చు.. దారుణం కదూ.. ఇలాంటి అమానుష చట్టాలు ఎక్కడున్నాయో తెలుసా?
Anti Women Law

Women Law: ఈ చిన్న కథ చదవండి.. షిరా ఇసాకోవ్ అనే ఇజ్రాయెల్ మహిళపై సెప్టెంబరు 2020లో ఆమె భర్త పదునైన కత్తితో 20 సార్లు దాడి చేశాడు. ఆ తర్వాత షిరాను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పుడు ఆ మహిళ జీవితం దేవుడిపైనే ఆధారపడి ఉందని వైద్యులు తెలిపారు. ఆమె ధైర్య బలంతో, దేవుని నమ్మకాన్ని గెలుచుకుం. మరణాన్ని ఓడించింది.

కట్ చేస్తే..

14 నెలల తర్వాత, గృహ హింస కేసులో బలమైన చట్టం లేనందున, ఆమె నిందితుడైన భర్తను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. తరువాత తీర్పుపై మహిళ ఇలా చెప్పింది, “కోర్టు ఈ నిర్ణయాన్ని వింటున్నందున, శరీరంలో 20 సార్లు కత్తితో పొడిచిన దానికన్నా ఎక్కువ నొప్పిగా ఉంది.” అంది.

ఇప్పుడు ఈ కథను ఎందుకు గుర్తు చేశామంటే.. 2021 ఆధునిక యుగంలో, ఇజ్రాయెల్ వంటి సంపన్న దేశంలో కూడా, ఒక మహిళను కత్తితో 20 సార్లు పొడిచినా నిర్దోషిగా ప్రకటించే చట్టాలు ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా.. ఇలాంటి దేశం ఇజ్రాయెల్ ఒక్కటే కాదు. ఇలాంటి మహిళా వ్యతిరేక చట్టాలు భారతదేశంతో సహా అనేక పెద్ద దేశాల్లో ఇప్పటికీ అమలులో ఉన్నాయి.

ప్రపంచంలోని ఏ 7 దేశాల్లో ఏ చట్టాలు మహిళలకు వ్యతిరేకంగా ఉన్నాయో తెలుసుకుందాం..

భారతదేశం: భర్తకు..భార్యపై అత్యాచారం చేసే స్వేచ్ఛ

భారతదేశంతో సహా ప్రపంచంలోని 49 దేశాలలో ఇటువంటి చట్టం ఉంది. ఇక్కడ సమాజం,చట్టం తన భార్యపై అత్యాచారం చేసిన భర్తను దోషిగా పరిగణించదు. భారతదేశంలో, IPCలోని 375, 376 సెక్షన్ల ప్రకారం మహిళలపై అత్యాచారం ఒక ఘోరమైన నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి కేసుల్లో జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తారు. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారతదేశంలో ఎవరైనా తన భార్యపై అత్యాచారం చేస్తే, ఈ చట్టం ప్రకారం శిక్ష లేదు, చర్య కూడా తీసుకోలేరు.

అమెరికా: పురుషులు అత్యాచారం చేయడం ద్వారా బాలికలను తల్లులుగా మార్చే హక్కు

యూఎస్ లోని కొన్ని రాష్ట్రాల్లో అత్యాచారం తర్వాత, బాధితురాలు తల్లిదండ్రుల హక్కు కింద బాధితుడి కోసం బిడ్డను కనివ్వాల్సి ఉంటుంది. ఈ చట్టం కారణంగా, అమెరికాలోని మేరీల్యాండ్, అలబామా, మిస్సిస్సిప్పి, మిన్నెసోటా, నార్త్ డకోటా, న్యూ మెక్సికోలలో వేలాది మంది అత్యాచార బాధితులు ఇష్టం లేకపోయినా రేపిస్ట్ బిడ్డకు తల్లి కావాల్సి వస్తుంది. మిగిలిన యూఎస్ రాష్ట్రాలలో రేపిస్టులు పిల్లల హక్కును గుర్తించకుండా నిరోధించే చట్టాలు ఉన్నాయి. కానీ, ఈ రాష్ట్రాలు అలా చేయడం లేదు. అమెరికాలోని ఈ రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం 17 వేల నుండి 32 వేల మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు, ఇందులో 32% నుండి 35% కేసులలో, రేపిస్ట్ తను మానభంగం చేయడం ద్వారా పుట్టిన బిడ్డను కోర్టు ద్వారా తనకు ఇవ్వమని కోరతాడు.

సూడాన్: పదేళ్లలోపు బాలికలకు పెళ్లి చేయడం నేరం కాదు

సూడాన్‌లో, అమ్మాయిలు 10 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకోవచ్చు. ఇతర దేశాలలో, అమ్మాయిలు ఈ వయస్సులో హోమ్‌వర్క్ చేయాలని ఆలోచిస్తే, ఆ వయస్సులో సూడాన్‌లో అమ్మాయిలకు పెళ్లి చేస్తారు. ఇప్పుడు సూడాన్‌లో, ప్రతి ముగ్గురిలో ఒక అమ్మాయికి 18 ఏళ్లు నిండకుండానే పెళ్లయింది. దేశ చట్టం దీనికి మద్దతు ఇస్తుంది. ఈ అమ్మాయిల శరీరంలో ఎప్పుడైతే మార్పులు వస్తున్నాయో అప్పుడే చాలా మంది ఆడపిల్లలు తల్లులు అవుతారు.

ఇరాన్: భార్య పాస్‌పోర్ట్-వీసా భర్త అనుమతితో మాత్రమే

ఇరాన్‌లో భర్త అనుమతి లేకుండా భార్య విదేశాలకు వెళ్లకూడదు. ఇరాన్ చట్టం ప్రకారం భర్త సంతకం లేకుండా మహిళలు విదేశాలకు వెళ్ళడం కుదరదు. ఒక రకంగా చెప్పాలంటే, దేశం నుంచి బయటకు వెళ్లాలంటే, మహిళలు తమ భర్తతో పాస్‌పోర్ట్-వీసా కోసం మొదట దరఖాస్తు చేసుకోవాలి. ఆపై ప్రభుత్వ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

జోర్డాన్: పరువు పేరుతో కూతురిని చంపినందుకు శిక్ష నుంచి మినహాయింపు

జోర్డాన్‌లో పరువు హత్య నేరంగా పరిగణించరు. ఈ దేశ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 340, 98 ప్రకారం పరువు హత్య తీవ్రమైన నేరంగా ఇక్కడ పరిగణన లోకి రాదు. ఈ చట్టం ప్రకారం, కుటుంబ గౌరవానికి భంగం కలిగించి మహిళ హత్యకు గురైతే, న్యాయమూర్తి నిందితులకు శిక్షను తగ్గించవచ్చు.

రష్యా: గృహహింస నేరం కాదు..

2017లో, రష్యా పార్లమెంట్ మహిళలపై గృహహింసను నేరంగా పరిగణించని సవరణకు అనుకూలంగా ఓటు వేసింది. భారతదేశంలో లాగానే రష్యాలో కూడా ఈ విషయం ప్రైవేట్‌గా పేర్కొంటున్నారు. రష్యా ప్రభుత్వ నివేదిక ప్రకారం, రష్యాలో ప్రతి 40 నిమిషాలకు ఒక మహిళ తన భాగస్వామి లేదా భర్త కారణంగా మరణిస్తోంది. అటువంటి పరిస్థితిలో, గృహహింసను నేరంగా పరిగణించని రష్యన్ పార్లమెంట్ చేసిన సవరణను ఎన్జీవోలు(NGO) మహిళా మద్దతుదారులు వ్యతిరేకించారు.

టర్కీ: ఉద్యోగం కోసం కంపెనీ కంటే ముందే భర్తకు సీవీ పంపడం తప్పనిసరి

టర్కీలో కూడా మహిళల పరిస్థితి అంతగా లేదు. ఎందుకంటే ఈ దేశంలోని మహిళలు ఉద్యోగాల్లో చేరే ముందు తమ భర్తల అనుమతి తీసుకోవాలి. భర్తకు ఇష్టం లేకపోతే అతని భార్య ఉద్యోగం చేయదు. ఈ కారణంగా, టర్కీలో ఉద్యోగ వృత్తిలో మహిళల సంఖ్య 29 శాతం మాత్రమే.

అందుకే మహిళల ప్రయోజనాల కోసం చట్టాలు అవసరం..

ఒక దేశంలో మహిళలకు న్యాయం, భద్రత, ప్రగతికి సరైన అవకాశాలు లభించనప్పుడు ఆ దేశ మహిళలే కాదు దేశం మొత్తం సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా వెనుకబడి పోతుంది. దీనికి తాజా ఉదాహరణ ఆఫ్ఘనిస్థాన్. స్త్రీల ప్రయోజనాల కోసం చట్టాలు ఉంటే, స్త్రీలకు పురుషులతో సమాన అవకాశాలు లభిస్తే, అది లింగ అంతరాన్ని తగ్గిస్తుంది. మహిళలపై నేరాల కేసులు కూడా తక్కువ అవుతాయి.

మహిళలకు అవకాశం లభించిన ప్రపంచంలోని 5 దేశాలు..

ఒకవైపు ప్రపంచంలోని అనేక దేశాల్లో మహిళలు తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తోంది. అదే సమయంలో, యూఎన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2021 ప్రకారం, ఐస్‌లాండ్, ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ ప్రపంచంలోని మొదటి ఐదు దేశాలు. ఇక్కడ మహిళలకు అవకాశం ఇస్తారు. అప్పుడు మహిళలు, పురుషుల మధ్య అంతరం తగ్గిపోతుంది. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో స్త్రీ పురుషుల భాగస్వామ్యం, స్థితి ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది.

ఎక్కడ స్త్రీలకు స్వాతంత్ర్యం లభించిందో అక్కడి ప్రజలే ఎక్కువ సంతోషిస్తారు

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2021ని పరిశీలిస్తే, ఫిన్‌లాండ్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా అవతరించింది. లింగ వ్యత్యాసాన్ని తగ్గించడంలో మొదటి 5 దేశాల జాబితాలో, ఫిన్లాండ్‌లోని ప్రజలు అత్యంత సంతోషంగా ఉన్నారు. అదే సమయంలో, మహిళలను సామాజిక, మతపరమైన సంకెళ్లలో ఉంచడం వల్ల లింగ అంతరాన్ని తగ్గించడంలో అట్టడుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా ప్రపంచ సంతోష నివేదికలో 149 వ స్థానంలో ఉంది. అంటే ఇక్కడి ప్రజలు మరింత అసంతృప్తితో ఉన్నారు.

ఇవి కూడా చదవండి: Facebook Profile: ఫేస్‌బుక్ లో మీ ప్రొఫైల్ ఎవరు చూశారో తెలుసుకోవాలని ఉందా? ఇలా చేయండి.. చాలు!

Detox Juice: ఆరోగ్యానికి మంచిదని డిటాక్స్ జ్యూస్ తాగుతున్నారా? ఈ జ్యూస్ వలన ఫలితం ఉంటుందా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి

PM-SYM: రోజుకు 2 రూపాయలు చెల్లించండి.. ఈ పథకం ద్వారా నెలకు 3 వేల రూపాయల పెన్షన్ పొందండి.. ఎలా అంటే..

Click on your DTH Provider to Add TV9 Telugu