Anne Frank: గూగుల్‌ డూడుల్‌లో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె డైరీ కాపీలు కోట్లలో అమ్ముడవుతున్నాయి..

|

Jun 26, 2022 | 1:18 PM

గూగుల్ డూడుల్‌లో వైరల్ అవుతున్న 'అన్నే ఫ్రాంక్‌' అనే 14 ఏళ్ల జర్మనీ అమ్మాయి ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ వరల్డ్‌గా మారింది. ఎవరీ అమ్మాయి? తన డైరీలో ఏం రాసుకుంది.. దాని గురించి 75 ఏళ్ల తర్వాత కూడా ఈ ప్రపంచం అంతా ఎందుకు చర్చిస్తోంది.. జూన్‌ 25న చరిత్ర పుటల్లో ఏం జరిగింది? ఆ విషయాలు మీకోసం..

Anne Frank: గూగుల్‌ డూడుల్‌లో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె డైరీ కాపీలు కోట్లలో అమ్ముడవుతున్నాయి..
Anne Frank
Follow us on

The Diary of a Young Girl: గూగుల్ డూడుల్‌లో వైరల్ అవుతున్న ‘అన్నే ఫ్రాంక్‌’ అనే 14 ఏళ్ల జర్మనీ అమ్మాయి ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ వరల్డ్‌గా మారింది. ఎవరీ అమ్మాయి? తన డైరీలో ఏం రాసుకుంది.. దాని గురించి 75 ఏళ్ల తర్వాత కూడా ఈ ప్రపంచం అంతా ఎందుకు చర్చిస్తోంది.. జూన్‌ 25న చరిత్ర పుటల్లో ఏం జరిగింది? ఆ విషయాలు మీకోసం..

అన్నే ఫ్రాంక్… జర్మన్-డచ్ మూలానికి చెందిన యూదుల సంతతికి చెందిన అమ్మాయి. ఆమె జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో 1929, జూన్‌ 12న జన్మించింది. జర్మనీలో నాజీల అకృత్యాలకు భయపడి అన్నే ఫ్రాంక్ కుటుంబం నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌కు వలస వెళ్లింది. 1942 (రెండో ప్రపంచ యుద్ధకాలంలో) వసంత ఋతువులో ఫ్రాంక్ కుటుంబం సభ్యులతో యూదులు) అజ్ఞాతంలోని వెళ్లింది. ఆ తర్వాత అన్నే, ఆమె సోదరి మార్గోట్ ఫ్రాంక్‌లను నాజీ దళాలు జర్మనీలోని బెర్గెన్-బెల్సెన్ నిర్బంధ శిబిరానికి తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లిన నెల రోజుల తర్వాత వాళ్లిద్దరూ మృతి చెందారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగిన సంఘటనలను, నిర్భంధం తర్వాత తను ఏ విధంగా ప్రాణాలతో బయటపడింది ఆ సంఘటనల గురించి అన్నే తన డైరీలో రాసుకుంది.

ఇవి కూడా చదవండి

అన్నే రాసిన డైరీ ‘ది డైరీ ఆఫ్‌ ఎ యంగ్‌ గర్ల్‌’ పేరుతో తొలిసారిగా జూన్‌ 25, 1947లో ముద్రించబడింది. ఆ తర్వాత దాదాపు 67 భాషల్లో ప్రపంచ దేశాల్లో 30 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. ఈ డైరీలో 14 ఏళ్ల అన్నే ఫ్రాంక్‌ రాసుకున్న ‘కొటేషన్లు’ ప్రపంచ దేశాల్లోని ఎందరినో కదిలిస్తున్నాయి. తనకు కేవలం 14 ఏళ్లే అయినప్పటికీ ఎంతో పరిణతి చెందిన అమ్మాయిగా నాటి చీకటి కోణాలను, హింసాకాండను, చావు బతుకుల చేదు-తీపి భావాలను ఎంతో సున్నితంగా తన డైరీలో రాసుకుంది.

వాటిట్లో కొన్ని విషయాలు మీకోసం..

నాకు పద్నాలుగేళ్లున్నప్పటికీ నాకేం కావాలో నాకు బాగా తెలుసు. ఏది ఒప్పో, ఏది తప్పో నాకు బాగా తెలుసు. నాకు నా సొంత అభిప్రాయాలు.. నా సొంత ఆలోచనలు.. నా సొంత సిద్ధాంతాలున్నాయి. యుక్తవయసులోనున్న వారికి నా చేష్టలు పిచ్చిగా అనిపించవచ్చు. పిల్లల కంటే మెరుగైనదాననుగా నన్ను నేను భావిస్తున్నాను. ఎవరితోనైనా స్వతంత్రంగా ఉండగలనని అనుకుంటున్నాను’

‘చనిపోయిన వ్యక్తులు జీవించి ఉన్న వాటి కంటే ఎక్కువ పువ్వులను పొందుకుంటారు. ఎందుకంటే కృతజ్ఞత కంటే విచారం బలమైనది’

‘ధైర్యం, విశ్వాసం ఉన్న వ్యక్తి ఎప్పటికీ బాధతో చనిపోడు’

‘మీకు ఆదర్శంగా ఉన్న వ్యక్తి ఏవరూ లేనప్పటికీ, గొప్ప వ్యక్తిగా మీకై మీరు ఎదగగలరు’

‘మెరుగైన, మరింత అందమైన ప్రపంచాన్ని నిర్మించగల శక్తి నేటి యువతలో ఉంది. కానీ వారు నిజమైన అందం గురించి ఆలోచించకుండా అల్పమైన విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు’

‘ఆనందంగా జీవించడానికి మనకు ఎన్నో దారులు ఉన్నాయి. ఐతే దానిని మనం సంపాదించుకోవాలి. అందుకు సులభమైన మార్గాలు లేవు’

‘సోమరితనం ఆహ్వదించదగినదిగా ఉన్నా.. పని మాత్రమే మీకు నిజమైన సంతృప్తిని ఇస్తుంది’

‘బయటికి వచ్చి ఆనందాన్ని తిరిగి పొందండి. మీలో దాగున్న మంచి విషయాల గురించి ఆలోచించండి’

‘మీ రెండు కాళ్ళపై నిలబడటం చాలా కష్టం. ఐతే ఆత్మాభిమానానికి కట్టుబడి ఉంటే అది మరింత కాష్టతరం అవుతుంది’

‘దురదృష్టంలోనూ మీ అంతరంలోని అందం అలాగే ఉంటుంది’

‘నిశ్శబ్ద అంతరాత్మ మీకు బలాన్నిస్తుంది’

‘మీ వ్యక్తిత్వాన్ని మీరే రూపొందించుకోవాలి. ఎప్పటికీ అది మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి’

జూన్‌ 25న అన్నే ఫ్రాంక్‌ జ్ఞాపకార్థం.. ఆమె డైరీలోని కొన్ని స్ఫూర్తి దాయకమైన కొటేషన్లను తెలుపుతూ గూగుల్ సెలబ్రేట్‌ చేస్తోంది.