Gold Bag: నిజాయితీకి మారుపేరు.. దొరికిన అర కేజీ బంగారం పోలీసులకు అప్పగించిన వ్యాపారి..

Vizag Honest Man: ఈ కాలంలో ఎవరికైనా పది రూపాయలు దొరికినా అటూ ఇటూ చూసి జేబులో పెట్టుకున్న సందర్భాలెన్నో..! ఎందుకంటే పరిస్థితులు అలా మారిపోయాయి.

Gold Bag: నిజాయితీకి మారుపేరు.. దొరికిన అర కేజీ బంగారం పోలీసులకు అప్పగించిన వ్యాపారి..
Gold Bag (Representative Image)
Follow us
Janardhan Veluru

|

Updated on: Jul 26, 2021 | 1:15 PM

Visakhapatnam Honest Man: ఈ కాలంలో ఎవరికైనా పది రూపాయలు దొరికినా అటూ ఇటూ చూసి జేబులో పెట్టుకున్న సందర్భాలెన్నో..! ఎందుకంటే పరిస్థితులు అలా మారిపోయాయి. కానీ.. అదే సమయంలో బంగారం దొరికితే.. ఇక చెప్పేదేమందీ.. పండగే పండగ. చోరీ చేయలేదు కదా.. దేవుడే ఇచ్చాడు అని నొక్కేసే ప్రయత్నం చేస్తారు కొంతమంది. కానీ.. విశాఖలో ఓ వ్యక్తికి అరకిలో బంగారం దొరికింది. విలువ అక్షరాలా రూ.27 లక్షలు. తనదికాని వస్తువును ఉంచుకోవడం మంచిదికాదని భావించి.. దాన్ని పోలీసులకు అప్పగించారు. మరోవైపు బంగారం పోగొట్టుకున్న వ్యక్తి ఫిర్యాదు ఇచ్చిన కొద్ది సేపటికే బంగారం పోలీసుల చెంతకు చేరడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

అవును.. విశాఖ నగరంలోని మారికకవలసలకు చెందిన దుర్గారావు అనే గోల్డ్‌ స్మిత్‌.. రాజీవ్‌ గృహకల్ప కాలనీలో నివాసముంటున్నాడు. దుర్గారావు.. శ్రీకాకుళం, నరసన్నపేట ప్రాతాల్లోని బంగారు వర్తకుల నుంచి గోల్డ్‌ పీస్‌లు సేకరించి వటిని వస్తువులుగా తయారు చేసి తిరిగి వారికి అప్పగిస్తుంటాడు. ఇందుకోసం కమిషన్‌ రూపంలో తీసుకుంటుంటాడు దుర్గారావు. అయితే.. ఇదే క్రమంలో శనివారం నాడు నరసన్నపేటలో ఐదు బంగారం షాపుల నుంచి 450 గ్రాముల బంగారాన్ని తీసుకుని బస్సులో బయలుదేరాడు దుర్గారావు. మారికవలసలో దిగిపోయాడు. ఈ క్రమంలో బంగారం బ్యాగ్‌ కనిపించలేదు. వెంటనే ఆందోళనతో డయల్‌ 100కు కాల్‌ చేశాడు. పీఎం పాలెం పోలీసులను ఆశ్రయించాడు.

Gold

Gold

దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు.. ఆ బస్సు చేరే ప్రాంతాన్ని గుర్తించి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. అక్కడ విచారణ చేపట్టారు. కండక్టరును, డ్రైవర్‌ను అడిగారు. ఫలితం లేదు. పోలీసులు తలలుపట్టుకుంటున్న సమయంలో.. అంబటి పోలరాజు, తంబాల శ్రీను అనే ఇద్దరు పోలీసులను ఆశ్రయించారు. బంగారం బ్యాగులు పోలీసులకు అప్పగించారుఉ. మద్దిలపాలెంలో బస్సు దిగుతున్న సమయంలో తనకు బ్యాగ్‌ దొరికిందని, తెరిచిచూసే సరికి బంగారం ఉన్నట్టు గుర్తించామన్నారు. దీంతో.. ఆ బ్యాగ్ దుర్గారావుదేనని గుర్తించి వారి నిజాయితీని మెచ్చుకున్నారు. నిజాయితీతో బంగారం బ్యాగును అప్పగించిన పోలరాజును క్రైం డీసీపీ సురేష్‌ బాబు.. అభినందించి సత్కరించారు.

(ఖాజా, టీవీ9 తెలుగు, విశాఖపట్నం)

దుర్గారావును అభినందిస్తున్న పోలీసులు..వీడియో

Also Read..

Viral Video: టిప్ ఇచ్చేందుకు డబ్బు లేదు.. కానీ ఆ కస్టమర్ డెలవరీ బాయ్‌ను నిరాశపరచలేదు..

 దీపావళి నాటికి బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? ఇప్పుడు గోల్డ్‌పై పెట్టుబడి మంచి పనేనా?

Garuda Purana : గరుడపురాణం ప్రకారం.. ఏ పాపం చేస్తే ఏ శిక్ష పడుతుందో తెలుసా..?