IPS Pooja Yadav: రిసెప్షనిస్ట్ స్థాయి నుంచి IPS ఆఫీసర్ వరకూ.. స్ఫూర్తినిచ్చే పూజా యాదవ్ సక్సెస్‌ స్టోరీ

పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఎన్ని అడ్డంకులెదురైనా స్వప్నం సాకారం చేసుకోవచ్చని నిరూపించారు ఒక యువతి. ఎంతో కష్టపడి చివరికి విజయం సాధించారు.

IPS Pooja Yadav: రిసెప్షనిస్ట్ స్థాయి నుంచి IPS ఆఫీసర్ వరకూ.. స్ఫూర్తినిచ్చే పూజా యాదవ్ సక్సెస్‌ స్టోరీ
Ips Pooja Yadav
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 10, 2021 | 8:22 PM

పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఎన్ని అడ్డంకులెదురైనా స్వప్నం సాకారం చేసుకోవచ్చని నిరూపించారు ఒక యువతి. ఎంతో కష్టపడి చివరికి విజయం సాధించారు. రిసెప్టనిస్ట్‌ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.  హర్యానాకి చెందిన పూజా యాదవ్ సక్సెస్‌ ఫుల్‌ స్టోరీ ఇది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని యూపీఎస్‌సీ ఎగ్జామ్స్‌లో విజయం సాధించారామె.

హర్యానాలో ప్రైమరీ ఎడ్యుకేషన్‌ను పూర్తి చేసిన పూజాయాదవ్..బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత కెనడా, జర్మనీలో ఉద్యోగం చేశారు. కానీ ఏం చదివినా..ఏ జాబ్ చేసినా ఆమెకు సంతృప్తినివ్వలేదు. తాను విదేశాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాననీ, తన మాతృభూమి కోసం చేయట్లేదనీ అనుకున్నారు. దాంతో చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఇండియాకు వచ్చేశారు. ఐపీఎస్ అవ్వాలని కలలు కన్నారామె. ఆ డ్రీమ్‌ను నెరవేర్చుకునేందుకు ఎంతో కష్టపడ్డారు. కుటుంబసభ్యులందరూ తనకు మద్దతుగా నిలిచినా..ఆర్థిక ఇబ్బందులతో పిల్లలకు ట్యూషన్లు కూడా చెప్పారు. కొంతకాలం రిసెప్షనిస్టుగా కూడా పనిచేశారు. యూపీఎస్‌సీ ఎగ్జామ్స్‌కు కష్టపడి ప్రిపేరయ్యారు. ఐతే మొదటి ప్రయత్నంలో ఆమె విజయం సాధించలేకపోయారు. కానీ పట్టుదల వీడలేదు. ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశంపై రెండోసారి మరింత గట్టిగా ప్రయత్నించి విజయం సాధించారు. 2018 కేడర్‌లో ఐపీఎస్‌గా నియమితులయ్యారు. ఐతే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక డ్రీమ్‌ ఉంటుంది. కానీ ఆ కల నెరవేర్చుకోవాలంటే ఎంతో పట్టుదల, శ్రమ, క్రమశిక్షణ, సంకల్పం అవసరం. వాటిలో ఏది లోపించినా…సక్సెస్ సాధించడం కష్టమే. కానీ హర్యానాకి చెందిన ఈ పూజా యాదవ్ మాత్రం..తన లక్ష్యం దిశగా అడుగులు వేశారు. ఒకసారి విఫలమైనా పట్టువదలకుండా మళ్లీ ప్రయత్నించారు. ఎన్ని అడ్డంకులెదురైనా స్వప్నం సాకారం చేసుకోవాలనుకున్నారు. చివరకు సక్సెసయ్యారు. ఇప్పుడామె సాధించిన విజయంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందరిచేతా శభాష్‌ అనిపించుకుంటున్నారు.

Also Read: సింహం పరిగెత్తుకు వస్తున్నా ఫైటింగ్ ఆపని జింకలు, చివరకు ఏం జరిగిందంటే..?

బిగ్ బాస్ ఫేమ్, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ కన్నుమూత