వినియోగదారులను హెచ్చరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు బలైపోవద్దంటూ..

ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన మోసాలు ఎక్కువయిపోయాయి. లోన్ లు ఇపిస్తామని, రకరకాల ఆఫర్లు అంటూ కేటుగాళ్లు ఫోన్ కాల్స్ ద్వారా మన డబ్బు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు...

  • Rajeev Rayala
  • Publish Date - 2:05 pm, Sat, 30 January 21
వినియోగదారులను హెచ్చరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు బలైపోవద్దంటూ..

ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన మోసాలు ఎక్కువయిపోయాయి. లోన్ లు ఇపిస్తామని, రకరకాల ఆఫర్లు అంటూ కేటుగాళ్లు ఫోన్ కాల్స్ ద్వారా మన డబ్బు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించండి’ అని ఎస్బీఐ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఎవరైనా రుణాలు ఇప్పిస్తామని కానీ, రుణాలను మాఫీ చేయిస్తామని కానీ కొన్ని లింకులను పంపించి వివరాలను బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలను పొందుపరచమని అడుగుతారు. అలంటి వారి పట్ల జాగ్రత్తగా ఉందని హెచ్చరించింది ఎస్బీఐ.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)లో రిజిస్టర్ చేయబడిన బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల తరపున చట్టబద్ధంగా రుణం ఇవ్వవచ్చు. ఇది కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలతో రిజిస్టర్డ్ యూనిట్లు కూడా రుణాలు ఇవ్వవచ్చు. అలా కాకుండా ఏ విధంగానైనా అనధికార డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు బలైపోకుండా ఉండాలని ఎస్బీఐ హెచ్చరించి. ఈమేరకు తమ వినియోగదారులకు పలు సూచనలు ఇచ్చింది. దీనితో పాటు, కొన్ని భద్రతా చిట్కాలను కూడా ఎస్బీఐ పంచుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Budget 2021: మరో రెండు రోజులు.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక బడ్జెట్.. లైవ్ టెలికాస్ట్‌ను వీక్షించండి ఇలా..