AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleep Divorce: దాంపత్య జీవితంలో గొడవలకు కొత్త పరిష్కారం !

భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే. అయితే, ఈ గొడవలను స్మూత్‌గా పరిష్కరించడానికి స్లీప్ డివోర్స్ అనే కొత్త పద్ధతి నిపుణుల ద్వారా పరిచయమైంది. గొడవలు అయినప్పుడు భార్యభర్తలు కలిసి నిద్రపోయే బదులు వేర్వేరుగా నిద్రపోవడం ద్వారా కోపం తగ్గుతుంది. ఇలా కొంత సమయం దూరంగా ఉండటం వల్ల, ఆవేశం, ఒత్తిడి తగ్గిపోతుంది. ఇది దాంపత్య బంధాన్ని బలపరచడం కోసం కూడా సహాయపడుతుంది. ఈ స్లీప్ డివోర్స్, ప్రత్యేకంగా యువతరంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న కొత్త ట్రెండ్‌గా మారింది.

Sleep Divorce: దాంపత్య జీవితంలో గొడవలకు కొత్త పరిష్కారం !
Sleep Divorce Secret
Prashanthi V
|

Updated on: Jan 18, 2025 | 2:31 PM

Share

భార్యాభర్తల మధ్య గొడవలు అనేది చాలా సహజమైన విషయం. ఇది దాంపత్య జీవితంలో ఒక భాగమే. అయితే ఈ గొడవలు ఎలా పరిష్కరించుకుంటున్నామో, అది దాంపత్య బంధం బలాన్ని నిర్ణయిస్తుంది. కొంతమంది గొడవలు పడినా ఉదయం అయ్యే సరికి వారు పరస్పరం సమస్యలను పరిష్కరించుకుంటారు. కానీ నేటి తరానికి ఈ విధానం పూర్తిగా భిన్నంగా మారింది. ఏ చిన్న విషయానికైనా గొడవలు పెరిగి, అది పెద్ద గొడవగా మారిపోతుంది. ఇలాంటి గొడవలు పెద్దగా మారి చివరకు వారి బంధాన్ని దూరం చేయడానికి కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిపుణులు స్లీప్ డివోర్స్ అనే కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. ఈ స్లీప్ డివోర్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్లీప్ డివోర్స్ అంటే ఏంటి ?

దంపతులు ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరుస్తూ తీవ్రంగా గొడవ పడుతుంటారు. గొడవ పడిన రోజు కలిసి నిద్రపోవడం బదులు వేర్వేరుగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గొడవల సమయంలో ఇద్దరు బాగా తిట్టుకోవడం వల్ల దాదాపు ఇద్దరి మధ్య కోపాన్ని పెంచేలా చేస్తుంది. ఈ సమయంలో వేరు వేరు గదుల్లో నిద్రపోవడం, మనసులలో ఒక ఆలోచనకు అవకాశం ఇస్తుంది. అయితే రాత్రి గడిచిన తర్వాత మనసు కుదుటపడుతుంది. మనం ప్రశాంతమైన మనసుతో ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం దొరుకుతుంది. నిద్రపోవడం వల్ల, మనస్సులో ఉన్న ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. అలాగే ప్రతిరోజు కొత్తగా మొదలైనట్టు అనిపిస్తుంది.

ప్రస్తుతం చాలా మంది మగవాళ్లు, గొడవలు అయినా సరే వాటిని పెద్దగా పట్టించుకోకుండా, ఎలాంటి ప్రభావం లేకుండా నడుస్తుంటారు. ఇక, ఆడవాళ్లు మాత్రం సాధారణంగా ఆ కోపాన్ని తట్టుకోలేక పోతారు. అది ఎక్కువగా వారి మనసులో మిగిలిపోతుంది. కానీ ఇది సమస్యను పరిష్కరించడంలో మంచి పద్ధతి కాదు. ఒక రాత్రి ఒంటరిగా గడపడం, కోపాన్ని తగ్గించడానికి మంచి మార్గం అని నిపుణులు చెబుతున్నారు.

గొడవ తర్వాత చాలా మంది బాధపడుతుండడం వల్ల అది మానసిక ఒత్తిడిపై ప్రభావం చూపుతుంది. ఒకరు బాధపడితే, ఇంకొకరు నిద్రపోతుంటారు. ఇది మనసులో ఉన్న ఆవేశాన్ని, దుఃఖాన్ని పెంచుతూనే ఉంటుంది. ఆ క్షణాల్లో, ఒకరికి కాస్త దూరంగా ఉండటం మంచి విషయం. అవతలివాళ్లతో సమయం గడపకుండా.. మనసును మన సొంత విషయాల మీద మళ్లించడం, కొన్నిసార్లు ఒక పాజిటివ్ మార్గం అవుతుంది. గొడవను పరిష్కరించుకోవడానికి సమయం ఇచ్చుకోవడం, క్షమాపణలను స్వీకరించడం మేలైన మార్గం.

మంచి నిద్ర సమయంలోనే సమస్యలను పరిష్కరించే దారి చూపిస్తుంది. దీని ద్వారా ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అవసరమైన స్థితిని పొందుతారు. ఇది దాంపత్య సంబంధాల్లో నిజమైన సహజత్వం, పరస్పర అంగీకారం ఏర్పడేందుకు అనువుగా ఉంటుంది. కాబట్టి ప్రతిసారీ గొడవల తర్వాత మనసు కుదుటపడే వరకు ఆగి ఒక్కసారి ఆలోచించడం, ఒకదాని నుండి మరొకటి దూరంగా గడపడం గొప్ప పరిష్కారం అవుతుంది.

ఈ స్లీప్ డివోర్స్ ఎక్కువగా యువతరం పాటిస్తున్నారు. ఈ స్లీప్ డివోర్స్ దాంపత్య సంబంధాలను మరింత బలంగా పెంచుతుంది. దీని వల్ల వారిద్దరి వ్యక్తిగత జీవితం కూడా ఒకరకంగా సంతృప్తిగా మారుతుంది. దాంపత్యంలో ఏ గొడవలు వచ్చినా, వాటిని సురక్షితంగా, సమర్థంగా పరిష్కరించడమే ముఖ్యమైంది.