AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Health Tips: మాయ లేదు మంత్రం లేదు.. ఇలా చేస్తే మీ బ్రెయిన్ షార్ప్ కావడం పక్కా..!

మెదడు ఆరోగ్యం శారీరక ఆరోగ్యంలో ముఖ్యమైన భాగం. మీ మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని ముఖ్యమైన పద్ధతులు పాటించడం మంచిది. ప్రతిరోజూ పజిల్ గేమ్స్ ఆడడం, రోజువారీ సంఘటనలను రీకాల్ చేయడం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. ధ్యానం చేయడం, విజువలైజేషన్, గణిత సమస్యలు ప్రాక్టీస్ చేయడం మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. సరిగా నిద్రపోవడం, వ్యాయామం చేయడం మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. మాటలను ఆసక్తిగా వినడం, కొత్త విషయాలను నేర్చుకోవడం ద్వారా మెదడును శక్తివంతంగా మార్చుకోవచ్చు.

Brain Health Tips: మాయ లేదు మంత్రం లేదు.. ఇలా చేస్తే మీ బ్రెయిన్ షార్ప్ కావడం పక్కా..!
Simple Exercises To Boost Brain Health
Prashanthi V
|

Updated on: Jan 18, 2025 | 4:16 PM

Share

శారీరక ఆరోగ్యంలో మెదడు ప్రధానమైన పాత్రను నిర్వహిస్తుంది. అయితే, మెదడు సమస్యలకు ప్రత్యేకమైన లక్షణాలు లేకపోవడం వల్ల వాటిని అస్సలు పట్టించుకోకుండా ఉండటం జరుగుతుంటుంది. కానీ, అలా నిర్లక్ష్యం చేయడం వల్ల గడచిన కొంతకాలానికే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అందుకే, మెదడు ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే కొన్ని ముఖ్యమైన చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ రోజుకు 5-10 నిమిషాల పాటు బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేయడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఏకాగ్రత పెరుగుతుంది.

రీకాల్ ఎక్సర్‌ సైజ్ రోజు 5 నుంచి 10 నిమిషాల పాటు రీకాల్ ఎక్సర్ సైజ్ చేయడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఉదాహరణకు మీరు కలిసిన వ్యక్తుల పేర్లు, మాట్లాడిన విషయాలు, రోజులో జరిగిన ముఖ్యమైన సంఘటనలను గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి.

ధ్యానం రోజుకు 10-15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ధ్యానం ద్వారా మెదడు మరింత శాంతంగా మారుతుంది. డిస్ట్రాక్షన్లు తగ్గి ఏకాగ్రత మెరుగవుతుంది.

పజిల్ గేమ్స్ సుడోకు, క్రాస్వర్డ్ పజిల్స్ వంటి గేమ్స్ నిత్యం ఆడటం ద్వారా సమస్య పరిష్కార నైపుణ్యం పెరుగుతుంది. ఈ గేమ్స్ మీ బ్రెయిన్ ని మరింత షార్ప్ చేస్తాయి. తద్వారా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

వ్యాయామం శరీరానికి వ్యాయామం అవసరం ఉన్నట్లే మెదడుకు కూడా వ్యాయామం అవసరం. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, మెదడును చురుకుగా మార్చే శక్తిని అందిస్తుంది.

గణిత సమస్యల పరిష్కారం సరళమైన గణిత సమస్యలను లేదా లాజికల్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం మెదడును పదును చేస్తుంది. ఇది జ్ఞాపకశక్తి, సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది.

విజువలైజేషన్ ప్రతి రోజు కనీసం 5 నిమిషాలు విజువలైజేషన్ కోసం కేటాయించండి. మీకు ఇష్టమైన ఒక సన్నివేశాన్ని లేదా మీరు కోరుకున్న లక్ష్యాన్ని స్పష్టంగా ఊహించేందుకు ప్రయత్నించండి. దీని ద్వారా మీ సృజనాత్మకత పెరుగడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుంది.

ఆసక్తిగా వినడం మాట్లాడే సమయంలో మరొకరు చెప్పే విషయాలను ఆసక్తిగా వినండి. మధ్యలో ఇంకోటి పట్టించుకోకుండా, వాళ్లు చెప్పే విషయాలపై దృష్టి పెట్టండి. ఆ సంభాషణలోని ముఖ్య విషయాలను గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి.

సరైన నిద్ర రోజుకి కనీసం 7-9 గంటల నిద్ర సరైన మానసిక ఆరోగ్యానికి అవసరం. పూర్తి నిద్ర మీ మెదడును విశ్రాంతి చేస్తుంది. తద్వారా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడుతాయి. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా మీ మెదడును చురుకుగా ఉంచి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మరింతగా పెంచుకోవచ్చు.