AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer symptoms: గొంతు బొంగురుపోవడం కూడా క్యాన్సర్‌కు సంకేతం.. ఈ లక్షణాలను అశ్రద్ద చేయవద్దు

క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే.. చికిత్స తీసుకుని దాని నుంచి బయడపడొచ్చు. క్యాన్సర్ 4వ స్టేజీకి చేరిందంటే.. అప్పుడు ఎన్ని రకాల చికిత్సలు తీసుకున్నా.. ఉపయోగం ఉండకపోవచ్చు. ప్రజలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చూపుతోన్న కొన్ని రకాల క్యాన్సర్ లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Cancer symptoms: గొంతు బొంగురుపోవడం కూడా క్యాన్సర్‌కు సంకేతం.. ఈ లక్షణాలను అశ్రద్ద చేయవద్దు
Cancer Symptoms
Ram Naramaneni
|

Updated on: Jan 18, 2025 | 4:24 PM

Share

క్యాన్సర్ అన్న పదం వింటే చాలు మనసులో ఒకింత అలజడి చెలరేగుతుంది. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ వ్యాధి బారిన పడిన వారు కోలుకుంటున్నవారి సంఖ్య పెరిగడం ఒక శుభ పరిణామం. అయితే క్యాన్సర్‌కు ముందుగానే గుర్తిస్తే.. దాన్ని జయించడం ఈజీ అవుతుంది. వ్యాధి ప్రారంభ దశలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని అలక్ష్యం చేయవద్దు. ఆ సింటమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

  1. ఒక్కసారిగా బరువు తగ్గడం: క్యాన్సర్ లక్షణాలలో ఇది ప్రధానమైనది. కొందరు మంచిగానే ఆహారం తీసుకుంటున్నా కూడా ఒక్కసారిగా వెయిట్ లాస్ అవుతారు. కడుపు, ఊపిరితిత్తులు, పాంక్రియాస్, అన్నవాహిక క్యాన్సర్స్ వచ్చినప్పుడు.. ఇలా జరుగుతూ ఉంటుంది. నెల వ్యవధిలోనే 5 లేదా అంతకంటే ఎక్కువ కేజీలు బరువు తగ్గితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
  2. శరీరంలో మార్పులు: హైపర్‌పిగ్మెంటేషన్, జాండిష్, చర్మంపై దురద, స్కిన్ రంగు మారడం వంటి లక్షణాలు క్యాన్సర్‌ సంకేతాలు. చర్మ క్యాన్సర్లతో పాటు, కొన్ని ఇతర క్యాన్సర్లు సమయంలో శరీరంలో ఈ మార్పులు వస్తాయి.

  3. విపరీతమైన అలసట:  కొందరికీ విపరీతమైన అలసట ఉంటుంది. ఎంత రెస్ట్ తీసుకున్నా అలానే అనిపిస్తుంది. లుకేమియా లాంటి కొన్ని క్యాన్సర్లలో ఇది ప్రధాన లక్షణం. క్యాన్సర్ పెరుగుతుంది అనే విషయం తెలుసుకోడానికి ఇది ఒక రకమైన సిగ్నల్.
  4. గాయాలు మానకపోవడం: చర్మంపై పుట్టుమచ్చలు, పులిపిర్లు అకస్మాత్తుగా ఏర్పడటం. అవి పెరుగుతూ ఉండటం.. వాటి నుంచి రక్తం కారణం వంటి లక్షణాలను అశ్రద్ద చేయవద్దు. అలానే గాయాలు మానకపోవడాన్ని కూడా క్యాన్సర్‌ లక్షణంగా భావించాలి.

  5. జ్వరం: క్యాన్సర్‌ లోపల పెరుగుతుంటే మీ బాడీ జ్వరం  రూపంలో హెచ్చరిస్తుంది. క్యాన్సర్ కణాలు రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తున్నప్పుడు అదే పనిగా జ్వరం బారిన పడతారు. అందుకే జ్వరం పదే, పదే వస్తుంటే.. ఒకసారి స్క్రీనింగ్‌కు వెళ్లడం మంచింది.

డయేరియా, మలబద్ధకం,  మలంలో మార్పులు, మూత్రంలో రక్తం పడటం, పదే పదే మూత్రానికి వెళ్లాలనిపించడం, యూరిన్ పోసేటప్పుడు  నొప్పి బ్లాడర్ లేదా ప్రొస్టేట్ క్యాన్సర్లకు సంకేతాలు. వృషణాలు, గ్రంథులు, కణజాలం,  రొమ్ముల్లో మార్పులను అలక్ష్యం చేయవద్దు. నీటిని తాగడం, ఆహారాన్ని మింగడంలో ఇబ్బందులు, విపరీతంగా దగ్గు, గొంతు బొంగురుపోవడం, విరేచనాలు తగ్గకపోవడం కూడా కొన్ని రకాల క్యాన్సర్లకు సంకేతాలు.

(ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించబడింది. మీకు ఎలాంటి సంకేతాలు, సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..