AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goldfish: గోల్డ్ ఫిష్‌తో శాస్త్రజ్ఞుల ప్రయోగం.. కారు నడుపుతున్న గోల్డ్‌ ఫిష్‌.. నెట్టింట వీడియో వైరల్‌..

Goldfish: అక్వేరియంలో అటూ ఇటూ తిరుగుతూ చూపరులను ఎంతగానో ఆకర్షించే గోల్డ్‌ ఫిష్‌ ఏకంగా డ్రైవింగ్‌ చేసేస్తోంది. శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో భాగంగా ఈ చేప తెలివిగా ఈదుతూ..

Goldfish: గోల్డ్ ఫిష్‌తో శాస్త్రజ్ఞుల ప్రయోగం.. కారు నడుపుతున్న గోల్డ్‌ ఫిష్‌.. నెట్టింట వీడియో వైరల్‌..
Goldfish To Drive A Vehicle
Surya Kala
|

Updated on: Jan 07, 2022 | 6:31 PM

Share

Goldfish: అక్వేరియంలో అటూ ఇటూ తిరుగుతూ చూపరులను ఎంతగానో ఆకర్షించే గోల్డ్‌ ఫిష్‌ ఏకంగా డ్రైవింగ్‌ చేసేస్తోంది. శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో భాగంగా ఈ చేప తెలివిగా ఈదుతూ నీటితో నింపిన వాటర్‌ ట్యాంక్‌ని ముందుకు తీసుకెళ్లింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ చిన్న వాటర్ ట్యాంక్‌లో నీటిని నింపారు. అందులో గోల్డ్ ఫిష్‌ని ఉంచారు. ఆ ట్యాక్ కింద ఓ 4 చక్రాలు అమర్చారు. ట్యాంక్ నుంచి ఓ గొట్టాన్ని నిలబెట్టి… దానికి పైన ఓ లైడర్, కంప్యూటర్, కెమెరా అమర్చారు. ఇప్పుడు ఆ చేప… ఈదుతూ ముందుకు వెళ్లాలి. అలా వెళ్లేటప్పుడు అది అడ్డంకులను తప్పించుకొని వెళ్లాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా అంతా సెట్‌ చేశారు. శాస్త్రవేత్తలు ఊహించినట్లే ఆ చేప తెలివిగా ముందుకు వెళ్లింది. అది ముందుకు ఎటు వెళ్తే అటు ఆ ట్యాంక్ కదిలింది. సముద్రాలు, చెరువుల్లో చేపలు తమ ముందు వచ్చే అడ్డంకులను తప్పించుకుంటాయి… తమ ఆహారాన్ని అవి ఎలా వెతుక్కుంటాయి.. వాటి గూడును అవి ఎలా కనిపెడతాయో గ్రహించేందుకు ఈ ప్రయోగం చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

ముఖ్యంగా పగడపు దీవుల్లో చేపలు ఎలా నివసిస్తాయో, వాటి బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది.. చేపల్ని అవి ఉన్న ప్రదేశం నుంచి వేరు చేస్తే… అప్పుడు అవి నావిగేషన్ చేసుకోగలవో లేదా అనే అంశాలు తెలుసుకునేందుకు ఈ పరిశోధనలు చేసినట్లు ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. మోటర్ తో పనిచేసే కారును గోల్డ్ ఫిష్ నడిపిందని, ఆ చేపకు తాము ఎలాంటి ట్రైనింగూ ఇవ్వలేదనీ… దానంతట అదే ముందుకు సాగిందని తెలిపారు. జనవరి 3న పోస్ట్ చేసిన వీడియోని వీక్షించిన లక్షలమంది నెటిజన్లు చేప డ్రైవింగ్‌ను ఎంతగానో లైక్‌ చేస్తున్నారు.

Also Read:  నిరుపేదలకు వైద్యం అందించే దిశగా జీహెచ్ఎంసీ అడుగులు.. మరో 27 బస్తీ దవాఖానలు త్వరలో ఏర్పాటు