ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబూ.. వెరైటీగా సమోసాలపై కోడ్స్.. ఎందుకంటే?

చాలామంది తమ బిజినెస్‌ను పెంచుకునేందుకు క్రియేటివ్‌గా ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించడమే కాదు..

ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబూ.. వెరైటీగా సమోసాలపై కోడ్స్.. ఎందుకంటే?
Samosa Codes
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 12, 2022 | 9:15 PM

ఈ మధ్యకాలంలో చాలామంది తమ బిజినెస్‌ను పెంచుకునేందుకు క్రియేటివ్‌గా ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించడమే కాదు.. వచ్చిన ఐడియాను కూడా అమలు చేసి క్యాష్ చేసుకుంటున్నారు. మీరు ఫ్లెక్సీలు, లోగోలు, హోల్డింగ్స్ లాంటి ద్వారా తమ ఫుడ్స్‌ను ప్రమోట్ చేసుకున్న సంస్థలను చూసి ఉంటారు. అయితే మీరెప్పుడైనా ఫుడ్‌పైనే ముద్రించి.. పబ్లిసిటీని పెంచుకోవడం చూశారా.? అవునండీ.. ఇక్కడ అలాంటి వారి గురించే చెప్పబోతున్నాం.

ఓ సమోసా విక్రయదారుడు.. తన క్రియేటివిటీకి పదునుపెట్టి.. ఏయే వెరైటీలు ఉన్నాయో అందరికీ తెలియజేశాడు. అతడు ఎంచుకున్న మార్గం ఇప్పుడు సోషల్ మీడియా అంతటా ట్రెండ్ అవుతోంది. ఇంటర్నెట్‌లో బెంగళూరుకు చెందిన ఓ నెటిజన్ సమోసాల ఫోటోను తన ఖాతాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వాటిపై కోడ్స్ ఉండటమే విశేషం.

తాను ‘సమోసా పార్టీ’ అనే రెస్టారెంట్ నుంచి వీటిని ఆర్డర్ చేశానని.. ఇక ఇలా సమోసాలపై కోడ్స్ ఉండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అతడు పేర్కొన్నాడు. ఇక ఆ కోడ్స్‌ ఎందుకు ముద్రించారన్న ఆసక్తితో.. సదరు రెస్టారెంట్‌ను ఆ నెటిజన్ అడిగాడట. ‘సమోసాల్లో ఆలు, ఆనియన్, చికెన్, మటన్, కార్న్, నూడిల్స్.. అని రకాల వెరైటీలు తమ దగ్గర ఉండటంతో.. వాటిని కస్టమర్లు గుర్తించడానికి ఈ కోడ్స్ ఉపయోగపడతాయని’ ఆ రెస్టారెంట్ సమాధానం ఇచ్చిందట.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..