AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మినీ సంజీవని.. అలా బురదలో పడేసినా మొలకెత్తుతది.. లెక్కలేనన్ని బెనిఫిట్స్..

వాము ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనితో పలు సమస్యలను దూరం చేసుకోవచ్చు. వాము ఆకుల్లో విటమిన్ A, C, సెలీనియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని.. దీనిని తీసుకుంటే చాలా మంచిదని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. ఈ మొక్క కఫ, వాత సంబంధిత వ్యాధులకు చక్కగా పనిచేస్తుంది.

మినీ సంజీవని.. అలా బురదలో పడేసినా మొలకెత్తుతది.. లెక్కలేనన్ని బెనిఫిట్స్..
Vaamu Aaku Health Benefits
Shaik Madar Saheb
|

Updated on: Mar 28, 2026 | 10:46 AM

Share

వాము ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనితో పలు సమస్యలను దూరం చేసుకోవచ్చు.. వాము ఆకు, దీనిని సాధారణ వాడుక భాషలో కర్పూరవల్లి, ఇండియన్ బోరేజ్, కంట్రీ బోరేజ్, ఇండియన్ మింట్ వంటి అనేక పేర్లతో పిలుస్తారు. ఇది మనందరికీ బాగా పరిచయమైన, సులభంగా లభించే ఒక ఔషధ మొక్క. నిజానికి, దీనిలో అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వాము ఆకు (Ajwain Leaves) లో విటమిన్ A, C, సెలీనియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని.. దీనిని తీసుకుంటే చాలా మంచిదని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. వాము ఆకు శ్రమక, కఫ, వాత సంబంధిత వ్యాధులకు అద్భుతమైన పరిష్కారం చూపుతుంది. దీని ఆకు రసాన్ని నేరుగా ఔషధంగా చాలా వరకు ఉపయోగించుకోవచ్చు. దీనిని తరచుగా అలంకరణకు, వంటకు ఉపయోగిస్తుంటారు. దీని ఆకు కొద్దిగా వగరుగా, ఘాటుగా రుచిగా ఉంటుంది.. దీని వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇంట్లో చిన్నపిల్లలకు గానీ, కుటుంబ సభ్యులకు గానీ వచ్చే అనేక చిన్నపాటి రోగాలను ఎటువంటి ఇతర మందులు లేకుండా కేవలం వాము ఆకును ఉపయోగించి తగ్గించుకోవచ్చు.

ఈ మొక్క శరీరానికి వేడిని ఉత్పత్తి చేస్తుంది. వాము ఆకు వాసన మాత్రమే వాము వలె ఉంటుంది కానీ, వాము వేరే జాతి మొక్క నుండి వస్తుంది. వాము ఆకు మొక్క ఆకు మందంగా, మెత్తగా, బలహీనంగా ఉంటుంది. ఇది నీరు లేకపోయినా చక్కగా బ్రతుకుతుంది.. సుమారు మూడు అడుగుల వరకు పెరుగుతుంది. దీనికి వేరు కూడా అవసరం లేదు, ఎక్కడైనా సులభంగా పెరుగుతుంది. వాము రైస్, బజ్జీలు, చట్నీ, చారు వంటి వంటకాలు కూడా దీనితో చేసుకోవచ్చు.

వాము ఆకు ప్రధాన ఆరోగ్య లాభాలు:

దగ్గు నివారణ: దగ్గు వచ్చినప్పుడు కొన్ని ఆకులను కొద్దిగా ఉప్పుతో కలిపి తీసుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. చిన్న పిల్లల దగ్గుకు ఐదు ఆకులను ఉప్పుతో కలిపి ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.

జీర్ణక్రియ మెరుగుదల: చిన్నచిన్న నొప్పులు, అజీర్తి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలకు ఈ మొక్కను ఉపయోగించవచ్చు. దీనికి ఆకలిని పెంచే గుణం ఉంది. తద్వారా ఆకలి, జీర్ణ0శక్తి మెరుగుపడతాయి.

జ్వరం, జలుబు, అలర్జీలు: 10 ml ఆకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి, అలర్జీలు తగ్గుతాయి.

అంతర్గత శుద్ధి: ఇది నీళ్ల విరేచనాలకు కూడా చక్కగా పనిచేస్తుంది. కడుపులో ఉండే సూక్ష్మ క్రిములను, నులిపురుగులను చంపే గుణం దీనికి ఉంది. నులిపురుగులు ఉన్నప్పుడు ఆకు రసాన్ని వేడి నీటితో కలిపి తీసుకుంటే అవి బయటకు వచ్చేస్తాయి.

మూత్రపిండాలు, గుండె ఆరోగ్యం: మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి, హృదయ సంబంధిత జబ్బులు ఉన్నవారికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

స్త్రీల ఆరోగ్యం: పీరియడ్స్ సరిగ్గా రాని మహిళలకు వాము, మిరియాల పొడిని వేయించి పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పీరియడ్స్ క్రమబద్ధీకరించబడతాయి. కడుపులోని వ్యర్థాలు బయటకు వస్తాయి.

మొలల వ్యాధి: ఆకు రసాన్ని జ్యూస్ రూపంలో తీసుకుంటే రక్త మొలల సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే, రక్తం కారని మొలలకు మాత్రమే ఇది మంచిది. రక్తం కారే స్థితిలో ఉన్న మొలలకు దీనిని వాడటం అంత మంచిది కాదు.

వాము మొక్కను ఎలా పెంచుకోవాలి..

వాము ఆకును ఇంట్లో పెంచుకోవడం ద్వారా ఒక విలువైన ఔషధ మొక్కను కలిగి ఉన్నట్లు అవుతుంది. పెద్దలు దీనిని చిన్న పిల్లలకు, పెద్దలకు సంజీవనిగా చెబుతుంటారు.

ఎన్నో ఔషధ గుణాలున్న వాము మొక్కను ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు.. దీనిని కుండీలో లేదా నేల మీద, కొమ్మ ద్వారా సులభంగా నాటుకోవచ్చు. తక్కువ నీరు, ఎక్కువ ఎండ అవసరమయ్యే ఈ మొక్క, నిత్యం ఆకులు ఇస్తూ పలు సమస్యలను తగ్గిస్తుంది. వాము ఆకుల రసాన్ని లేదా.. మరిగించి ఆ నీటిని తీసుకోవచ్చు..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us