EPF Amount : పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు..
సాధరణంగా ప్రతి ఉద్యోగి నెలసరి జీతం నుంచి కొంత అమౌంట్ పీఎఫ్ రూపంలో కట్ అవుతుందన్న విషయం విధితమే. ఇందులో భాగంగా ఉద్యోగి వేతనంలో 12 శాతం డబ్బులు పీఎఫ్ ఖాతాలోకి వెళ్లిపోతాయి.
సాధరణంగా ప్రతి ఉద్యోగి నెలసరి జీతం నుంచి కొంత అమౌంట్ పీఎఫ్ రూపంలో కట్ అవుతుందన్న విషయం విధితమే. ఇందులో భాగంగా ఉద్యోగి వేతనంలో 12 శాతం డబ్బులు పీఎఫ్ ఖాతాలోకి వెళ్లిపోతాయి. దీంతోపాటు కంపెనీ నుంచి కూడా అంతే మొత్తంలో పీఎఫ్ అకౌంట్ కు బదిలి అవుతాయి. అయితే ఈ పీఎఫ్ డబ్బులు కొంత వరకు జమ అయ్యాక విత్డ్రా చేసుకోవాలనుకుంటారు చాలా మంది. అయితే ఈ డబ్బులను విత్ డ్రా చేసుకునే సమయంలో చాలా మంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. దీంతో అనేక సమస్యలు ఎదుర్కోంటుంటారు. అలా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే కొన్ని విషయాలు తెలుసుండాలి. అవేంటో తెలుసుకుందాం.
ఒక ఉద్యోగి తన ఐదేళ్ళ సర్వీస్ కన్నా ముందే పీఎఫ్ డబ్బులను తీసుకుంటే ట్యాక్స్ పడుతుంది. పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకుంటే ఇన్ కమ్ ట్యాబ్ కింద ఐటీఆర్ లో చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు పీఎఫ్ అకౌంటను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మార్చుకుంటే ఆ సర్వీస్ కూడా మీకు యాడ్ అవుతుంది. ఇలా కాకుండా మీరు డబ్బులను డ్రా చేసుకుంటే కొత్త కంపెనీలో చేరిన తర్వాత మీ సర్వీస్ మొదటి సంవత్సరం నుంచి ప్రారంభమౌతుంది. మీకున్న అవసరాన్ని బట్టి పీఎఫ్ విత్ డ్రా అమౌంట్ కూడా మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక గరిష్టంగా 75 శాతం వరకు పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.
ఒకవేళ మీ ఉద్యోగం పోతే అప్పుడు పీఎఫ్ అకౌంట్ నుంచి మొత్తం డబ్బులు తీసుకోవచ్చు. ఇలా చేయాలంటే మీ ఉద్యోగం కోల్పోయి కనీసం రెండు నెలలు అయినా గడిచి ఉండాలి. ఇదిలా ఉంటే పీఎఫ్ అకౌంట్ విత్ డ్రా చేసుకునేవారు కచ్చితంగా డాక్యుమెంట్ ప్రూఫ్ అందించాలి. లేదంటే డబ్బులు తీసుకోలేరు. అయితే కేంద్ర ప్రభుత్వం కరోనా ప్రభావంతో కొవిడ్ వైరస్ ఆప్షన్ కింద పీఎఫ్ డబ్బులు సులభంగానే విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కానీ ఈ ప్రక్రియ ఇంకా అమలులో ఉందో లేదో తెలియదు. ఉద్యోగం చేసేవారు సాధ్యమైనంత వరకు పీఎఫ్ డబ్బులను తీయకపోవడం ఉత్తమం. ఇలాకాకుండా ముందే డబ్బులను విత్ డ్రా చేయడం ద్వారా కాంపౌండింగ్ బెనిఫిట్ కోల్పోతారు.
Also Read:
Valentine Week: ప్రేమను వర్ణించడానికి ఎన్నో భావాలున్నాయి.. చూపించడానికి ఓ మార్గం ఉంది.. అదెంటంటే..