Orange Melo Pearl: తాత కలలోకి వచ్చాడు.. రాత్రికి రాత్రే కోటేశ్వరుడయ్యాడు.. ఎలాఅంటే..
అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో ఎవరూ ఊహించలేదు.. రోజు గడవాలంటే కష్టంగా ఉండే ఓ నిరుపేదవాడికి లక్ కలిసి వచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైతే అది సినిమాలోనో.. కథల్లోనూ సాధ్యమవుతుంది..
Orange Melo Pearl: అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో ఎవరూ ఊహించలేరు.. రోజు గడవాలంటే కష్టంగా ఉండే ఓ నిరుపేదవాడికి లక్ కలిసి వచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైతే అది సినిమాలోనో.. కథల్లోనూ సాధ్యమవుతుంది.. అనుకుంటున్నారా.. కానీ థాయిలాండ్ లోని ఓ మత్య్సకారుడి విషయంలో నిజమైంది.
థాయిలాండ్ కు చెందిన హచాయ్ నియోండెకా అనే మత్య్సకారుడు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్ళాడు.. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఏమీ చేపలు పడవు.. నా ఆకలి తీరదు అంటూ నిరాశతో వల విసిరాడు.. ఆ వల ఖాళీగా వచ్చింది. అందులో ఒక్క చిన్న చేప కూడా చిక్కలేదు.. ఇదేగా నాకు 37 ఏళ్ల నుంచి జరుగుతుంది.. ఇంకెప్పుడూ నా జాతకం మారుతుంది అనుకుంటున్న హచాయ్ నియోండెకా జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇక జీవితంలో అతను ఎప్పటికీ వేటకు వెళ్లాల్సినవసరం లేదు. నీటిలో తేలుతున్న మూడు ఆల్చిప్పను హచాయ్ నియోండెకా తీసుకున్నాడు.. అదే తన జీవితం ఒక్కసారిగా మార్చేస్తుందని అతను భావించలేదు.
హచాయ్ నియోండెకా నీటిలో తేలుతున్న మూడు ఆల్చిప్పలను చూసి వాటిని తీసుకొని… తన సంచిలో వేసుకున్నాడు. ఇంటికి వెళ్లిన తర్వాత అతని తండ్రి బంగ్మాడ్ఈ రోజైనా వలలో చేపలు పడ్డాయా అని అడిగాడు. నిరాశతో అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయాడు. తండ్రి బంగ్మాడ్ ఆశగా మూడు ఆల్చిప్పలను సంచినుంచి బయటకు తీసి.. వాటిని క్లీన్ చేద్దామని అనుకున్నాడు. క్లిన్ చేస్తూ వాటిని తెరిచి చూస్తే… ఒక దాంట్లో ఆరెంజ్ రంగులో ఓ ముత్యం మెరుస్తూ కనిపించింది. బంగ్మాడ్ వేంటనే తన కొడుకు, భార్య, మనవళ్లను పిలిచాడు. సముద్రంలో లభించే ముత్యాల గురించి అతని ఐడియా ఉండడంతో . ఇది చూశారా అంటూ తన చేతిలో మెరుస్తున్న ముత్యాన్ని కుటుంబ సభ్యులందరికీ చూపించాడు. దాని బరువు ఎంత ఉందో తూకం వేశాడు. అది సరిగ్గా 7.68 గ్రాములు ఉంది.
ఈ ముత్యం మనల్ని కోటీశ్వరులను చేస్తుందని బంగ్మాడ్ చెప్పాడు. మర్నాడు అందరూ కలిసి మార్కెట్‌కి వెళ్లి ఆ ముత్యం ధర ఎంత అని అడిగారు. అది ఆరెంజ్ మెలో ముత్యమట మెలో మెలో అనే జీవి ద్వారా ఆ ముత్యం తయారవుతుంది. సాధారణంగా ఒక ఆరెంజ్ మెలో ముత్యం ధర రూ.2.5 కోట్లు ఉంటుంది. ఈ ఫ్యామిలీకి దొరికిన ముత్యం సైజు చాలా పెద్దగా ఉంది. అందువల్ల ధర ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్పారు. దీంతో హచాయ్ నియోండెకా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. తమ కష్టాలు తీరాయని సంతోషం పడ్డారు.
ఈ విషయంపై హచాయ్ నియోండెకా స్పందిస్తూ.. కొన్ని రోజుల క్రితం తన తాతయ్య కలలోకి వచ్చి సముద్రం వద్దకు రా నీకు నేను ఒకటిస్తా అన్నాడు. అయితే ఆ కల నిజమవుతుందని నేను అసలు అనుకోలేదు అంటూ సంతోషం తో చెప్పాడు. ఆ ముత్యాన్ని ఎక్కువ ధర ఎవరు ఇస్తే వారికే ఇస్తాన్నన్నాడు. డబ్బులు చేతికి వచ్చినా తన కుల వృత్తి చేపల వేటను కొనసాగిస్తానన్నడు, ఇప్పుడు ఆ ముత్యాన్ని కొనడానికి ఓ చైనా వ్యాపారి ముందుకొచ్చాడని తెలిపాడు.
Also Read: