Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. అతడికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది..ఒక్క రోజులో కోటీశ్వరుడు

సుడి, అదృష్టం ఉంటే చాలు ఎక్కడ ఉన్నా కలిసివస్తోంది. కొంతమంది మాత్రం ఏళ్ల తరబడి కష్టపడుతున్నా సక్సెస్ దక్కదు.

వారెవ్వా.. అతడికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది..ఒక్క రోజులో కోటీశ్వరుడు
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 19, 2020 | 3:54 PM

సుడి, అదృష్టం ఉంటే చాలు ఎక్కడ ఉన్నా కలిసివస్తోంది. కొంతమంది మాత్రం ఏళ్ల తరబడి కష్టపడుతున్నా సక్సెస్ దక్కదు. అది వాళ్ల ఫేట్ అంతే. తాజాగా ఒక వ్యక్తికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది. అయ్యో నిజమండీ బాబు…ఆకాశం నుంచి పడిన ఓ గ్రహ శకలం అతడ్ని ఓవర్‌నైట్ కోటీశ్వరుడిని చేసింది.

వివరాల్లోకి వెళ్తే… ఇండోనేషియాలోని ఉత్తర సుమాత్రా ఏరియాలో 33 ఏళ్ల జోషువా హుటాగలుంగ్ తన కుటుంబంతో కలిసి నివశిస్తున్నాడు. శవపేటికలు తయారుచేయడం అతడి వృత్తి. కాగా ఇటీవల అతని ఇంటి పెరట్లో రాత్రి పూట ఓ భారీ గ్రహ శకలం పడింది. దాని బరువు 2.2 కిలోగ్రాములుగా ఉంది. అయితే అది మంచి వాల్యు ఉంటుందని అంచనా వేసిన అతడు దాన్ని భద్రపరిచాడు. మొదట టచ్ చేశాక కొద్దిగా వేడిగా అనిపించిందని… అయినప్పటికీ వెంటనే  ఇంట్లోకి తీసుకెళ్లి భద్రపరిచానని అతడు చెప్పాడు. అనంతరం అందుకు సంబంధించిన విజువల్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

కాగా ఆ వార్త తెలుసుకున్న అమెరికాకు చెందిన ఉల్క నిపుణుడు జేర్డ్ కొల్లిన్స్ ఆ గ్రహ శకలానికి భారీ మొత్తంలో చెల్లించి దాన్ని జోషువా నుంచి కొనుగోలు చేశాడు. అందుకు గాను జోషువాకు ఏకంగా 1.8 మిలియన్ డాలర్లు (దాదాపుగా రూ.13.37 కోట్లు) వచ్చాయి. కాగా సదరు గ్రహశకలం సుమారుగా 450 కోట్ల సంవత్సరాల కాలం నాటిదని, CM1 / 2 కార్బోనేషియస్ కొండ్రైట్ వర్గానికి చెందిన ఉల్క అని నిపుణులు గుర్తించారు.  దానిపై వారు పరిశోధనలు చేయనున్నారు.

Also Read :

తిరుమలలో వృద్ధులకు స్లాట్లు కేటాయింపు వార్తలపై టీటీడీ క్లారిటీ

సీనియర్ హీరోయిన్ల ఫేవరెట్ యాక్టర్‌గా మారిన జూనియర్ రామారావు

రైట్, రైట్.. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి ఆర్టీసీ అద్దె బస్సులు

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..