AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine’s Week 2021: నేటి నుంచి ప్రేమికుల వారం మొదలు.. ఈ రోజు నుంచి 7రోజులు ఏయే బహుమతులు ఇస్తారో తెలుసుకుందాం..!

ఈరోజు నుంచి ప్రేమికుల వారం మొదలైంది. ప్రేమికులు ఒక్కో రోజును ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు., ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7 నుండి 14 వరకు కాలాన్ని ప్రేమికుల వారంగా జరుపుకుంటారు. తమ ప్రేమను వ్యక్తం చేయడానికి...

Valentine’s Week 2021: నేటి నుంచి ప్రేమికుల వారం మొదలు.. ఈ రోజు నుంచి 7రోజులు ఏయే బహుమతులు ఇస్తారో తెలుసుకుందాం..!
Surya Kala
|

Updated on: Feb 07, 2021 | 1:46 PM

Share

Valentine’s Week 2021: ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు.. ఇప్పటికే ప్రేమికుల సందడి మొదలైంది. కొందరు ప్రేమికుల దినోత్సవం మన సంస్కృతి కాదు అంటూ తిడతారు.. కానీ రెండు మనసులు కలిసిన వ్యక్తులు ఎంతో ఇష్టంగా ఆ రోజు కోసం ఎదురు చూస్తారు. జాలీగా డెస్టినేషన్ డే అంటూ జరుపుకుంటారు.

అయితే ఈరోజు నుంచి ప్రేమికుల వారం మొదలైంది. ప్రేమికులు ఒక్కో రోజును ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు., ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7 నుండి 14 వరకు కాలాన్ని ప్రేమికుల వారంగా జరుపుకుంటారు. తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తారు. అయితే మిగిలిన సమయాల్లో ఒకరికొకరు ఎన్ని బహుమతులిచ్చుకున్నా ఈ ప్రేమికుల వారోత్సవాల్లో ఇచ్చిన బహుమతులు వెరీవెరీ స్పెషల్ గా నిలిచిపోతాయి. మరి ప్రేమికుల దినోత్సవం రోజున సహజంగా ఇచ్చే బహుమతులు ఏమిటో చూద్దాం..!

ప్రేమికుల రోజు అంటే ఒక రోజు వేడుక మాత్రమే కాదు. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే అని వారోత్సవాలు ఉంటాయి. ప్రేమికులు రోజుకో గిఫ్ట్ ఇచ్చిపుచ్చుకుంటారు.

పువ్వులు:

గులాబీ తో మీ మనసులోని మాటను సులువుగా అవతలి వారికి తెలియచేయవచ్చు. ముఖ్యంగా ఎరుపు రంగు గులాబీలను అవతలి వ్యక్తిపై తన ప్రేమని వ్యక్తం చేయడానికి ఉపయోగిస్తారు.

గ్రీటింగ్ కార్డు:

వాలెంటైన్స్ డేకి గ్రీటింగ్ కార్డుకు మించిన మంచి గిఫ్ట్ లేదు. గ్రీటింగ్ కార్డు లోని సందేశం ద్వారా సులువుగా మీ ఫీలింగ్స్ ను అవతలి వ్యక్తిని తెలియజేయవచ్చు

చాకోలెట్స్:

చాకోలెట్స్ ద్వారా కూడా మీ ప్రేమని వ్యక్తం చేయవచ్చు. సాధారణంగా డైరీమిల్క్ ఈ సందర్భంలో ఇస్తారు.

కేక్:

కేక్ అనేది తమని ప్రేమని ఇష్టపడిన వాళ్లకు చెప్పిన తర్వాత… ఆ ఆనందాన్ని పంచుకోవడానికి కానుకగా ఇస్తారు.

తయారు చేసిన బహుమతులు:

ప్రేమించిన వారిని బాగా ఆకర్షించి, వారి ప్రేమని గెలుచుకోవాలంటే, ప్రేమించిన వారు సొంతగా వారి చేతులతో ఎదుటివారి అభిరుచులకు తెగ్గట్టుగా తయారుచేస్తే ఇంకా బాగుంటుంది మరియు అది కలకాలం గుర్తుగా ఉంటుంది. షాపులలో ఎక్కువ ఖరీదు పెట్టి కొనే వస్తువులకన్నా, ఇటువంటి చిన్న చిన్న బహుమతులతో వచ్చే బంధమే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది మరియు కలకాలం నిలుస్తుంది.

వీటితో పాటు గాడ్జెట్స్, డ్రెస్ల వంటి వాటితో కూడా ప్రేమను వ్యక్తం చేయవచ్చు. అయితే ఆ గిఫ్ట్ వెరీ వెరీ స్పెషల్ అనే ఫీలింగ్ వచ్చేలా ఉండాలి. ఇచ్చేది ఎలాంటి గిఫ్ట్ అయినా.. అది మీ మధ్య ప్రేమను గుర్తుచేసేదిలా ఉండాలి. నచ్చిన రంగు డ్రెస్, ఇష్టమైన గాడ్జెట్, అందమైన హ్యాండ్ బ్యాగ్.. ఇలా పార్ట్నర్ని సంతోషపెట్టే ఏ గిఫ్ట్స్ అయినా ఇవ్వొచ్చు. మరి ఈ ప్రేమికుల రోజు మీ మనసుకి నచ్చిన వారికి ఇటువంటి చిన్న మరియు విలువైన బహుమతులతో మీ బంధాన్ని దృఢపరచుకోండి.

Also Read:

ఎస్‌ఈసీ ఆదేశాలను కొట్టివేసిన హైకోర్టు.. మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడకూడదని కీలక ఆదేశం

కొత్తగా పెళ్లైందా.. ఈజీగా ఆన్ లైన్ లోనే ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ మార్చుకోవడం ఎలాగంటే?…

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!