AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అలా చేస్తే జీవితంలోని ఆనందాన్ని ఆస్వాదించలేము’.. సక్సెస్‌కు సరికొత్త అర్థం చెబుతోన్న పంజాబీ ముద్దుగుమ్మ.

విజయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా నిర్వచిస్తుంటారు. బాగా డబ్బలు సంపాదిస్తేనే విజయమని కొందరు.. ఆనందంగా జీవిస్తేనే విజయమని మరికొందరు భావిస్తుంటారు. అయితే తాను మాత్రం...

‘అలా చేస్తే జీవితంలోని ఆనందాన్ని ఆస్వాదించలేము’.. సక్సెస్‌కు సరికొత్త అర్థం చెబుతోన్న పంజాబీ ముద్దుగుమ్మ.
Narender Vaitla
|

Updated on: Dec 26, 2020 | 7:36 AM

Share

kiara advani New definition about success: విజయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా నిర్వచిస్తుంటారు. బాగా డబ్బలు సంపాదిస్తేనే విజయమని కొందరు.. ఆనందంగా జీవిస్తేనే విజయమని మరికొందరు భావిస్తుంటారు. అయితే తాను మాత్రం విజయాన్ని ఒక ప్రయాణంలా భావిస్తానని ‘మహర్షి’ సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్‌ను చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ. 2014లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘ఫగ్లీ’తో వెండితెరకు పరిచయమైంది పంజాబీ ముద్దుగుమ్మ కియరా అద్వానీ. అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది అనంతరం వరుస ఆఫర్లను దక్కించుకుంది. ఇక తెలుగులో మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ భామ. ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా కియారా మాట్లాడుతూ.. ‘విజయం నా గమ్యం కాదు.. అది ఒక నిరంతర ప్రయాణం. ఏదో ఒక్క విజయంతో సంతృప్తి పడి అక్కడే ఆగిపోతే జీవితంలోని ఆనందాన్ని ఆస్వాదించలేము. ప్రతి సందర్భంలో విజయం కోసం ప్రయత్నాలు చేస్తుండాలి. ఇక సినీ రంగంలో విజయానికి హద్దులుండవు. భిన్న పాత్రల్లో పాత్రలు పోషించి నాలోని విభిన్న కోణాలను ఆవిష్కరించాలన్నదే నా లక్ష్యం. నటిగా నన్ను నేను నిరూపించుకోవడం కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటా’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.