AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశ్వాసం లేని కుక్క..కరిచి..కరిచి తన యజమానురాలిని చంపేసింది, బర్మింగ్ హాం‌‌లో ఘోరం

కుక్కలు చాలా విశ్వాస పాత్రమైనవని, తమ యజమానులను కంటికి రెప్పలా కాపాడుతాయని అంటారు. కానీ అన్ని శునకాలకూ ఈ సూత్రం వర్తించదని..

విశ్వాసం లేని కుక్క..కరిచి..కరిచి తన యజమానురాలిని చంపేసింది, బర్మింగ్ హాం‌‌లో ఘోరం
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 07, 2021 | 5:06 PM

Share

కుక్కలు చాలా విశ్వాస పాత్రమైనవని, తమ యజమానులను కంటికి రెప్పలా కాపాడుతాయని అంటారు. కానీ అన్ని శునకాలకూ ఈ సూత్రం వర్తించదని తేలిపోయింది. బ్రిటన్..లోని బర్మింగ్ హాం లో 25 ఏళ్ళ యువతిని ఆమె ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న కుక్కే కరిచి..కరిచి చంపేసింది.. తీవ్ర గాయాలకు గురైన ఆమె  ఎలాంటి చికిత్సకూ నోచుకోకుండానే మృతి చెందడం స్థానికులను దిగ్భ్రాంతి పరచింది. కీరా లాడ్ లో అనే ఈ మహిళ  తన ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తుండగా ఈమె పెంపుడు శునకం ఒక్కసారిగా దాడి చేసి.. ఆమె చేతిని కొరికివేసింది. కీరా మణికట్టు తెగినంత పనై ఆమె బాధతో విలవిలలాడుతుండగా ఈ జాగిలం కూడా భయంకరంగా మొరుగుతూ ఆమె శరీరంలో పలు చోట్ల గోళ్లు, పళ్లతో రక్కివేసింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమె బాధతో పెట్టిన కేకలు ఎవరికీ వినిపించలేదు.

నాలుగేళ్ల క్రితం తను లోగడ ఇష్టంగా పెంచుకున్న డాగ్ మరణించడంతో ఓ గార్డెన్ లో కూనగా ఉన్న ఈ వీధికుక్కను కీరా రక్షించి ఇంటికి తెచ్చుకుని పెంచుకున్నట్టు తెలిసింది. చివరకు అది ఇలా తన విశ్వాస రాహిత్యాన్ని, కుక్కబుధ్డిని ప్రదర్శించుకుంది. పోలీసులు వఛ్చి ఈ ‘హంతక’ శునకాన్ని పట్టుకుపోయి కాల్చి చంపారు.

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్