Valentine Week: ప్రేమను వర్ణించడానికి ఎన్నో భావాలున్నాయి.. చూపించడానికి ఓ మార్గం ఉంది.. అదెంటంటే..

‘ప్రేమ’.. రెండక్షరాల పదం.. రెండు హృదయాల సవ్వడి.. ఇరువురి మనసుల కలయక.. ఎదలోని మధురభావాలను ఒకరికొకరు తెలుపుకునేదే 'ప్రేమికుల రోజు'. ముందుగా ఈ 'వాలెంటైన్స్ డే'ను

Valentine Week: ప్రేమను వర్ణించడానికి ఎన్నో భావాలున్నాయి.. చూపించడానికి ఓ మార్గం ఉంది.. అదెంటంటే..
Follow us

|

Updated on: Feb 06, 2021 | 10:25 PM

‘ప్రేమ’.. రెండక్షరాల పదం.. రెండు హృదయాల సవ్వడి.. ఇరువురి మనసుల కలయక.. ఎదలోని మధురభావాలను ఒకరికొకరు తెలుపుకునేదే ‘ప్రేమికుల రోజు’. ముందుగా ఈ ‘వాలెంటైన్స్ డే’ను విదేశాల్లో జరుపుకునేవారు. మారుతున్న కాలానుగుణంగా ఈ సంస్కృతి మన దేశంలోకి కూడా విస్తరించింది. ప్రేమికుల రోజు ఒక్కరోజు జరుపుకునే వేడుక కాదు.. ముందుగా రోజ్ డేతో మొదలు పెట్టి ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే ఇలా రోజుకో పేరుతో దాదాపు ఎనిమిది రోజుల పాటు జరుపుకుంటారు ప్రేమికులు. ఆఖరి రోజైన ఎనిమిదవ రోజును ‘వాలెంటైన్స్ డే’ ఎంతో పెద్దగా జరుపుకుంటారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ రోమాంటిక్ వీక్ మొదలయ్యి.. ఫిబ్రవరి 14 వరకు జరుపుకుంటారు. ఇందులో భాగంగా ప్రేమికుల రోజైన రోజ్ డేకు సంబంధించిన కొన్ని విషయాలు మీ కోసం.

ప్రేమికుల మనసులోని భావాలను ఒకరికోకరు వ్యక్తపరుచుకోవడానికి గులాబీ పువ్వులు ముఖ్యమైనవి. ప్రేమకు చిహ్నంగా గులాబీ పువ్వులను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ గులాబీ పువ్వులలో కూడా చాలా రంగులుంటాయి. అందులో ఒక్కో రంగుకు ఒక్కో అర్థం ఉంటుంది. మరీ ఆ అర్ధాలెంటో తెలుసుకుందామా..

ఎరుపు రంగు గులాబీ.. ఎరుపు రంగు గులాబీని ప్రేమకు చిహ్నాంగా ఉపయోగిస్తుంటారు. ఇవి పవిత్ర ప్రేమకు, స్వచ్చమైన మనసుకు, ప్రేమికులకు ఒకరి పట్ల ఒకరికి ఉండే నమ్మకానికి ప్రతీకగా ఈ ఎర్రని గులాబీలు నిలుస్తాయి. మీకు ఎదుటివ్యక్తిపై ఉన్న ప్రేమను తెలియజేయడానికి ఎరుపు రంగు గులాబీలను ఎంచుకోవడం ఉత్తమం. * తెలుపు: తెలుపు రంగు రోజాలను ఎక్కువగా పెళ్లిళ్లలో ఉపయోగిస్తుంటారు. అందుకే వీటిని ‘బ్రైడల్ రోజెస్’ అని కూడా అంటారు. ఇవి ప్రేమ, శాంతి, స్నేహం, అమాయకత్వం, నమ్మకానికి ప్రతీకగా నిలుస్తాయి.

లేత గులాబీ రంగు.. రోజా పూలలో లేత గులాబీ రంగుది ప్రత్యేకమైన స్థానం. ఈ రంగు గులాబీలు ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని, వారి వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. ప్రేమించే వారు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామని వారికి ఈ లేత గులాబీ రంగు రోజాలను ఇచ్చి తెలియజేయవచ్చు.

ఆరెంజ్ గులాబీలు.. ఈ రంగు పువ్వులు ఎక్కువగా రొమాంటిక్ ఆలోచనలకు గుర్తు. ఎదుటి వ్యక్తి గురించి తమలో ఉన్న భావనలను తెలియజేయడానికి ఈ ఆరెంజ్ రంగు గులాబీలను ఎంచుకోవచ్చు.

పసుపు రంగు గులాబీలు.. పసులు రంగు గులాబీలను ఎక్కువగా స్నేహితుల దినోత్సవం రోజున ఇచ్చుకుంటారు. వీటిని కల్మషం లేని స్నేహానికి గుర్తుగా ఇచ్చుకుంటారు.

లావెండర్ గులాబీలు… చూడగానే పుట్టే ప్రేమకు ప్రతీరూపంగా ఈ పువ్వులను ఉపయోగిస్తారు. అందుకే వీటిని వాలెంటైన ఫ్లవర్స్ అంటుంటారు. నిజమైన ప్రేమకు ఈ పువ్వులు సాక్ష్యంగా నిలుస్తాయని ప్రతి ప్రేమికుల భావన.

తెలుపు రంగు గులాబీలు.. తెలుపు రంగు శాంతి, స్వచ్చం, పవిత్రతలకు ప్రతీకగా నిలుస్తాయి. అయితే వీటిని ఎక్కువగా పెళ్లిలలో ఉపయోగిస్తారు. అందుకే వీటిని బ్రైడల్ ఫ్లవర్స్ అంటుంటారు.

ఇలా రంగు రంగుల రోజా పూలతో తయారు చేసిన బొకే మనలోని భావలను ఎదుటివారికి వ్యక్తపరుస్తాయి. విభిన్న రంగులతో తయారు చేసిన రోజా పూల బోకేతో ఈ వాలెంటైన్స్‏ను మొదలు పెడుతుంటారు ప్రేమికులు.

అంతేకాదండోయ్.. రోజాలు ఇచ్చే సంఖ్యలతో కూడా మన భావాలను తెలుపవచ్చు. అదేలానో తెలుసుకుందామా..

1 : తొలిచూపులో కలిగిన ప్రేమ నాది.. 2 : జీవితాంతం నీకు తోడుంటా.. 3 : నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 5 : నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. 6 : నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. చాలా మిస్సవుతున్నాను. 7 : నీ మాయ(ఆకర్షణ)లో పడిపోయా.. 9 : ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. 10 : నువ్వు చాలా అందంగా ఉన్నావు. 11 : నీకంటే విలువైంది నాకు ఈ లోకంలో లేదు. 12 : నీతో ఉండడం నిజంగా నా అదృష్టం. 13 : ఇద్దరం ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్‌గా ఉందాం. 15 : నిజంగా చెప్పాలంటే క్షమించూ! 20 : ఎప్పటికీ నీ చెంతే ఉంటా. 21 : ఇక జీవితాంతం నీతోనే.. 24 : నా మనసులో చెరగని ముద్ర నువ్వే.. 25 : అభినందనలు. 36 : మనం గడిపిన రొమాంటిక్ క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తే. 40 : నాది నిజమైన ప్రేమ. 99 : తుదిశ్వాస వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. 100 : నా సర్వస్వం నీకే అర్పితం. 101 : నీకంటే నాకెవరూ ఎక్కువ కాదు. 108 : నన్ను పెళ్లి చేసుకుంటావా?

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!