AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati temple : తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం.. ఎవరిచ్చారో తెలుసా..?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. కరోనా మహమ్మారి ‌ తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే

Tirupati temple : తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం.. ఎవరిచ్చారో తెలుసా..?
Rajeev Rayala
|

Updated on: Feb 06, 2021 | 7:22 PM

Share

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. కరోనా మహమ్మారి ‌ తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే.. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. ఆపదమొక్కుల వాడిని దర్శించుకునేందుకు జనం తరలి వస్తుండడంతో.. వడ్డీ కాసుల వాడి హుండీ ఆదాయం కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా.. ఓ భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందజేశాడు.

తమిళనాడు ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యుడు కుమారగురు స్వామి.. వేంకటేశ్వర స్వామి వారికి భారీ విరాళం సమర్పించారు. ఏకంగా 23 కోట్లు విలువైన స్థలం, నగదు అందించారు. తమిళనాడులో నిర్మించనున్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి 4 ఎకరాల స్థలంతోపాటు 3 కోట్ల 16 లక్షల నగదును అందించారు. ఈ భారీ విరాళానికి సంబంధించిన డీడీలు భూమి పత్రాలను టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి అందజేశారు కుమారుగురు స్వామి.

తిరుమలకు ఇంత భారీ విరాళం సమర్పించిన కుమారగురు అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే.  ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడిగానూ ఉన్నారు. ఆయన టీటీడీకి విరాళంగా ఇచ్చిన స్థలం ఉల్లందూర్‌పేట్‌లో ఉంది. ఆ భూమి విలువ సుమారు 20 కోట్ల మేర ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… త్వరలోనే తమిళనాడులో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడతామని అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి టీటీడీ చర్యలు చేపట్టిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.