Highway: ప్రపంచంలో అత్యంత పొడవైన రహదారి ఏదో తెలుసా.? ప్రయాణానికి నెలలు..
భారత్‌లో అత్యంత పొడవైన రహదారి నేషనల్ హైవే 44. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండే ఈ హైవే పొడవు సుమారు 4వేల కిలోమీటర్లు ఉంటుంది. మనకు తెలిసినంత వరకు ఇదే అత్యంత పొడవైన హైవే. దేశం ఒక చివరి నుంచి మరో చివరికి వరకు ఉండే ఈ రహదారి ఎన్నో ప్రముఖ పట్టణాలను, రాష్ట్రాలను కలుపుతూ ముందుకు సాగుతుంది...
భారత్‌లో అత్యంత పొడవైన రహదారి నేషనల్ హైవే 44. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండే ఈ హైవే పొడవు సుమారు 4వేల కిలోమీటర్లు ఉంటుంది. మనకు తెలిసినంత వరకు ఇదే అత్యంత పొడవైన హైవే. దేశం ఒక చివరి నుంచి మరో చివరికి వరకు ఉండే ఈ రహదారి ఎన్నో ప్రముఖ పట్టణాలను, రాష్ట్రాలను కలుపుతూ ముందుకు సాగుతుంది. అయితే ప్రపంచంలో అత్యంత పొడవైన హైవే ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
ప్రపంచంలో అత్యంత పొడవైన రహదారి ఎన్ని కిలోమీటర్లో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత పొడవైన హైవే పొడవు అక్షరాల 48,000 కిలోమీటర్లు. అవును మీరు చదివింది నిజమే. ఉత్తర అమెరికాలోని అలాస్కా నుంచి దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా వరకు విస్తరించి ఉన్న ఈ హైవే ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవేగా పేరు గాంచింది.
ఈ రహదారి గుండా ప్రయాణించేందుకు కొన్ని నెలల సమయం పడుతుంది. ఈ రహదారి పాన్ అమెరికన్ హైవే యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో, గ్వాటెమాల, హోండురాస్, నికరాగ్వా, కోస్టా రికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, బొలీవియా, చిలీ, అర్జెంటీనాతో సహా 14 దేశాల గుండా వెళ్తుంది.
ఈ రహదారిపై ప్రయాణం చాలా ప్రత్యేకమైంది. ఈ హైవేపై ఎడారి, అడవి, పర్వతాలు, బీచ్‌లు వంటి అనేక రకాల ప్రదేశాలు కవర్ అవుతాయి. ఈ రహదారి గుండా వెళుతున్నప్పుడు అనేక సంస్కృతులు, అనేక రకాల వ్యక్తులు కనిపిస్తారు. అయితే ఈ హైవే పలు దేశాలను, విభిన్న ప్రాంతాలను కవర్ చేస్తాయి కాబట్టి.. అన్ని రకాల డాక్యుమెంట్స్ వెంట పెట్టుకొని ప్రయాణించాలని చెబుతుంటారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..