AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: మీకు పీఎఫ్‌ అకౌంట్‌ ఉందా..? పేరులో మార్పులు చేసుకోవాలనుకుంటున్నారా.? ఈ కొత్త మార్గదర్శకాలను చూడండి..

Name Correction And Profile Change In PF Account: సహజంగా పీఎఫ్‌ అకౌంట్‌లో పేరు సరిచేసుకోవడం లేదా ప్రొఫైల్‌ మార్పులను ఆన్‌లైన్‌లో చాలా సులభంగా చేసుకుంటాం. ఇది మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈపీఎఫ్‌ఓ...

EPFO: మీకు పీఎఫ్‌ అకౌంట్‌ ఉందా..? పేరులో మార్పులు చేసుకోవాలనుకుంటున్నారా.? ఈ కొత్త మార్గదర్శకాలను చూడండి..
Narender Vaitla
|

Updated on: Feb 18, 2021 | 12:46 PM

Share

Name Correction And Profile Change In PF Account: సహజంగా పీఎఫ్‌ అకౌంట్‌లో పేరు సరిచేసుకోవడం లేదా ప్రొఫైల్‌ మార్పులను ఆన్‌లైన్‌లో చాలా సులభంగా చేసుకుంటాం. ఇది మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈపీఎఫ్‌ఓ (ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌) కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే ఇకపై అభ్యర్థి వివరాలకు సంబంధించి ప్రధాన వివరాల మార్పులను ఆన్‌లైన్‌లో చేసుకునే వెసులుబాటును తొలగించినట్లు తెలిపింది. ఇలా ఆన్‌లైన్‌లో వివరాలను మార్చడం ద్వారా కొన్ని సందర్భాల్లో మోసాలకు దారితీసే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ కారణంగానే మెంబర్‌ ప్రొఫైల్‌ మార్పులకు అటు ఆన్‌లైన్‌, ఇటు ఆఫ్‌లైన్‌లో అత్యవసరమైతే తప్ప అనుమతించరు. ఈ క్రమంలో ఈపీఎఫ్‌ఓ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అవేంటంటే..

* అభ్యర్థి తన ఇంటిపేరు, పేరు మార్పునకు సంబంధించిన వాటిని ఈపీఎఫ్‌ఓ మైనర్‌ కరెక్షన్స్‌గా విభాగంలో చేర్చింది.

* అదేవిధంగా అభ్యర్థి వివాహం తర్వాత ఇంటిపేరు మార్పు మార్పులు ఆధార్‌లో ఉన్న పేరు విధంగా మార్చుకోవచ్చని ఈపీఎఫ్‌ఓ కొత్త మార్గరద్శకాల్లో తెలిపింది.

* ఇక అభ్యర్థి పూర్తి పేరు మార్చడం లాంటి వాటిని సరైన డాక్యుమెంట్‌ ప్రూఫ్‌ లేకుండా ఆన్‌లైన్‌లో మార్చుకోవడడానికి వీలులేదు.

* ఒకవేళ యాజమాన్యం జాయింట్‌ డిక్లరేషన్‌పై సంతకం చేస్తే.. సంస్థ ఉద్యోగికి సంబంధించిన ఎంప్లాయ్‌ రిజిస్టర్‌, ఇంక్రిమెంట్ ఆర్డర్లు, పే స్లిప్‌, అపాయింట్‌ మెంట్‌ ఆర్డర్‌, పేరు మార్పునకు సంబంధించిన ఈపీఎఫ్‌ ఆఫీసుకు అందించిన ఏదైనా అప్లికేషన్‌ ఫామ్‌ ఒరిజినల్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌తో ధృవీకరణ చేసుకోవాల్సి ఉంటుంది.

* ఉద్యోగి లేదా సంస్థ అందించిన డాక్యుమెంటరీ ప్రూఫ్‌లను ఆడిట్‌ చేయడం కోస ఇంటర్నల్‌ ఆడిట్‌ పార్టీకి (ఐఏపీ) అందుబాటులో ఉంచాలని ఈపీఎఫ్‌లో పేర్కొంది. అంతేకాకుండా ఐఏపీకి 100 శాతం ఆడిట్‌ చేసే అధికారం కల్పించారు. దీంతో పాటు సీఏసీ (కాంకరంట్‌ ఆడిట్‌ సెల్‌) కూడా ఈ కేసులను పరిశీలించే అవకాశం కల్పించారు.

Also Read: State Bank Of India: ఒక్క మిస్డ్ కాల్‌తో పర్సనల్ లోన్ పొందొచ్చు.. ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్.!

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌