AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రంలోకి వెళ్లడానికి ప్రయత్నించిన యువకులు.. వింత శిక్ష విధించిన పోలీసులు.. వైరల్‌గా మారిన వీడియో..

POlice Funny Punishment: ఇటీవలి కాలంలో పోలీసుల తీరులోనూ మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఎక్కువగా లాఠీలకు పనిచెప్పే రక్షకభటులు ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా వేసే శిక్షల్లోనూ కొత్తదనం..

సముద్రంలోకి వెళ్లడానికి ప్రయత్నించిన యువకులు.. వింత శిక్ష విధించిన పోలీసులు.. వైరల్‌గా మారిన వీడియో..
Mumbai Police Funny Punishm
Narender Vaitla
|

Updated on: Apr 01, 2021 | 9:09 PM

Share

POlice Funny Punishment: ఇటీవలి కాలంలో పోలీసుల తీరులోనూ మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఎక్కువగా లాఠీలకు పనిచెప్పే రక్షకభటులు ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా వేసే శిక్షల్లోనూ కొత్తదనం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబయిలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ ముంబైలో కొందరు యువకులు సముద్రంలోకి దూకడానికి ప్రయత్నించారు. సముంద్రంలోకి దూకి సరదగా ఈత కొడుదామని భావించారు ఆ కుర్రాళ్లు. అయితే అది నిషేధిత ప్రాంతం అక్కడ సముద్రంలోకి వెళ్లడానికి అనుమతులు లేవు. దీంతో అటుగా వెళ్తోన్న పోలీస్ ఆఫీసర్లు ఆ విషయాన్ని గుర్తించి. యువకులను బెదిరించిన సముద్రంలోకి దూకాలని చేస్తోన్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం నిబంధనలను ఉల్లంఘించిన ఆ యువకులకు విచిత్ర శిక్షను విధించారు. ఆ యువకులను కోడిలాగా (కింద కాళ్లపై కూర్చొని) నడవమని ఆదేశించారు. దీంతో యువకులంతా తప్పక పోలీసుల ఆదేశాలను పాటించారు. స్థానికంగా ఉన్న కొందరు ఈ తతంగాన్ని మొత్తం తమ సెల్ ఫోన్లలో వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ యువకులు కేవలం సముద్రంలోకి వెళ్లడానికి ప్రయత్నించడమే కాకుండా మాస్కులు కూడా ధరించలేదన్న కారణంతో ఈ పనిష్మెంట్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..

Also Read: Sparrow Cat Video: పిల్లిపై పిచ్చుక ప్రాంక్.. ప్రాణం కాపాడుకోవడం కోసం భలే నాటకమాడిందే.. పక్షి ఐడియాకు ఫిదా..

Pawan Kalyan: ముగ్గురు రత్నాల చేతులో పవర్ స్టార్ పవన్.. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న పవన్..

Nivetha Pethuraj : ‘నో కిస్’ కామెంట్‌పై స్పందించిన పాగల్ బ్యూటీ.. తప్పుడు ప్రచారం చేయొద్దని హితవు..