Money Saving Tips: డబ్బు వృధాగా ఖర్చు చేస్తున్నారా? ఇలా చేస్తే ఆదా చేసుకోవచ్చు..

Money Saving Tips: చాలా మంది వ్యక్తులు సంపాదించిన డబ్బును అనవసరమైన వాటికోసం, దుబారాగా ఖర్చు చేస్తుంటారు. దీని కారణంగా వారి నెలవారీ బడ్జెట్.. సంపాదనకంటే ఎక్కువ అవుతుంది.

Money Saving Tips: డబ్బు వృధాగా ఖర్చు చేస్తున్నారా? ఇలా చేస్తే ఆదా చేసుకోవచ్చు..
Money Saving Tips
Follow us

|

Updated on: Feb 23, 2023 | 2:08 PM

చాలా మంది వ్యక్తులు సంపాదించిన డబ్బును అనవసరమైన వాటికోసం, దుబారాగా ఖర్చు చేస్తుంటారు. దీని కారణంగా వారి నెలవారీ బడ్జెట్.. సంపాదనకంటే ఎక్కువ అవుతుంది. ఇలాంటి వ్యర్థమైన ఖర్చులు తగ్గించుకుంటే డబ్బును ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందుకోసం సరైన ఆర్థిక ప్రణాళికలు చేసుకోవడం ముఖ్యం. మీ నెలవారీ బడ్జెట్ గాడితప్పకుండా, సరైన రీతిలో డబ్బును ఉపయోగించుకునేందుకు అవసరమైన టిప్స్‌ను మీకోసం అందిస్తున్నాం..

మీ ఖర్చులను ముందే ప్లాన్ చేసుకోవాలి..

చాలా మంది ప్రజలు తమ నెలవారీ ఖర్చులను నిర్వహించలేక, తమ పొదుపు డబ్బును సైతం ఖర్చు చేస్తుంటారు. ఈ కారణంగా, వారి బడ్జెట్ నెల కంటే ముందే ముగుస్తుంది. అలాంటి పరిస్థితిలో మీ నెలవారి ఖర్చులను ముందే ప్లాన్ చేసుకుని, దాని ప్రకారం డబ్బును ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీ సమయంలో షాపింగ్..

ఖాళీ సమయాల్లోనే షాపింగ్ చేయాలి. తద్వారా డబ్బును తెలివిగా ఉపయోగించుకోగలుగుతారు. ఇక షాపింగ్ సమయంలో ఖరీదైన వస్తువల కొనుగోలుకు దూరంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

పొదుపు అలవాటు చేసుకోవాలి..

మీకు ఇంకా పొదుపు చేసే అలవాటు లేకపోతే.. వెంటనే ఈ అలవాటు చేసుకోవాలి. పొదుపు అనేది మీ ఆదాయాన్ని ఆదా చేస్తుంది. మీరు ఆదా చేసిన డబ్బును సరైనచోట పెట్టుబడి పెడితే.. ఆదాయం కూడా పెరుగుతుంది. మీ ఆదాయాన్ని మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ ఎఫ్‌డిలు, ప్రభుత్వ పథకాలలో డిపాజిట్ చేయవచ్చు.

తెలివిగా షాపింగ్ చేయాలి..

గృహోపకరణాలు, నెల బడ్జెట్ కోసం షాపింగ్ చేస్తున్నట్లయితే.. ఒకేసారి అన్ని తీసుకోవాలి. ఇది మీ ఖర్చులను తగ్గిస్తుంది. ఆన్‌లైన్, దుకాణాల్లో ధరలను బేరీజు వేసుకుని కొనుగోలు చేస్తే మీ డబ్బు ఆదా అవుతుంది.

ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్‌ను పదే పదే చెక్ చేయొద్దు..

చాలా మంది ఖాళీ సమయాల్లో ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్‌ను పదే పదే చెక్ చేస్తుంటారు. అలా చేయడం మానుకోవాలి. లేదంటే.. అనవసరంగా కొనుగోళ్లు చేయాల్సి వస్తుంది. ఇది మీ బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది.

ఒత్తిడి కూడా అధిక ఖర్చులకు దారి తీస్తుంది..

ఒత్తిడి లేదా ఏదైనా కుటుంబ సమస్య కారణంగా చాలా మంది వ్యక్తులు అధికంగా ఖర్చులు చేస్తుంటారు. అలాంటి సమయాల్లో కాస్త సంయమనం పాటించాలి. వస్తువులపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలి.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..