ఏటీఎంను ముట్టుకోకుండానే డబ్బులు విత్ డ్రా చేయ్యొచ్చు..సరికొత్త టెక్నాలజీ తెచ్చిన మాస్టర్ కార్డ్..
కరోనా వైరస్ మహామ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఎంతలా అంటే ఒక మనిషికి మనిషి దగ్గరగా కూడా

కరోనా వైరస్ మహామ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఎంతలా అంటే ఒక మనిషికి మనిషి దగ్గరగా కూడా నిల్చోలేని పరిస్థితులను తీసుకువచ్చింది. ఇక మన చేతులతో ఏదైనా వస్తువును పట్టుకోవాలనుకున్నా భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే చేతులతో పట్టుకోకుండా ఉండాటానికి అనేక రంగాల్లో కొత్తగా మార్పులు తీసుకువచ్చారు. ఇక మనకు నిరంతరం అవసరం ఉండే డబ్బులు తీసుకోవాలన్ని ఏటీఎంలను టచ్ చేయాలనుకున్నా భయపడే స్థాయికి వచ్చాం. తాజాగా కొన్ని బ్యాంకులు ఏటీఎంను ముట్టుకోకుండానే మనీ విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా మాస్టర కార్డ్ ఏజీఎస్ ట్రాన్ సక్ట్ టెక్నాలజీస్‌తో కలిసి పూర్తి కాంటాక్ట్‌లెస్‌గా క్యాష్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
కాంటాక్ట్ లెస్ విత్ డ్రా విధానం.. ఇందుకోసం యూజర్లు తమ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ నుంచి ఏటీఎం స్క్రీన్ పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఎంత డబ్బు కావాలన్నదానితోపాటు పిన్ నంబర్ కూడా ఆ యాప్‌లోనే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏటీఎం నుంచి డబ్బులు బయటకు వస్తాయి. ఇక ఈ అవకాశం ఉన్నదని.. కానీ విత్ డ్రా చేయాల్సిన డబ్బు కోసమైన కస్టమర్ ఏటీఎంను తాకాల్సి వచ్చేదని.. అందుకోసమే కాంటాక్ట్ లెస్ పరిష్కారాన్ని కనుగొన్నట్లు ఏజీఎస్ గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మహేష్ పటేల్ తెలిపారు. మాస్టర్ కార్డు ఉపయోగించే బ్యాంకు ఈ ఏజీఎస్ ట్రాన్సక్ట్ టెక్నాలజీ ద్వారా తమ కస్టమర్లకు ఈ అవకాశాన్ని అందించవచ్చు. ఈ విధానం కరోనా సమయంలో చాలా ఉపయోగపడడంతోపాటు, ఏటీఎం దగ్గర జరిగే మోసాలను తగ్గించవచ్చని మహేష్ తెలిపారు. ఇందుకు మాస్టర్ కార్డు కస్టమర్లు ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించకుండానే నెలకు మూడుసార్లు కాంటాక్ట్ లెస్ క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు. ఏజీఎస్టీటీఎల్ ఎండ్ టు ఎండ్ క్యాష్, డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ అండ్ ఆటోమేషన్ టెక్నాలజీ అందిస్తుందని తెలిపింది. కాంటాక్ట్ లెస్ టెక్నాలజీస్ పెంచడానికి క్యూఆర్ బేస్డ్ క్యాష్ విత్ డ్రా గేమ్ చేంజర్ కానుందని.. ఏజీఎస్ టీటీఎల్ చైర్మన్, ఎండీ రవి గోయల్ అన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో కాంటాక్ట్ లెస్ ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకోవడం ఉత్తమమని మాస్టర్ కార్డు సౌత్ ఆసియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వికాస్ వర్మ అన్నారు. కార్డు ఉపయోగించకుండా ఏటీఎంను తాకకుండానే డబ్బును విత్ చేయవచ్చని తెలిపారు.
Also Read:
5G Mobiles: 5జీ మొబైల్ తయారీలోకి దేశీయ మొబైల్ సంస్థ… అతి త్వరలో భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న..




