AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ఏటీఎం దగ్గర దుప్పటి కప్పుకుని నిల్చున్న వ్యక్తి.. తీరా దగ్గరకు వెళ్లి చూడగా..

ఏటీఎం దగ్గర ఎవరైనా డబ్బులు విత్ డ్రా చేస్తుంటే.. లైన్‌లో కొంచెంసేపు వెయిట్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే!.. అయితే చివరికి ఏం జరిగిందంటే..

Funny Video: ఏటీఎం దగ్గర దుప్పటి కప్పుకుని నిల్చున్న వ్యక్తి.. తీరా దగ్గరకు వెళ్లి చూడగా..
Person Infront Of Atm
Ravi Kiran
|

Updated on: Oct 03, 2022 | 5:29 PM

Share

డబ్బులు డిపాజిట్, విత్ డ్రా లాంటివి ఏటీఎంల వద్ద జరగడం సర్వసాధారణం. కొన్నిసార్లు క్యూ లైన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మన ముందుకు ఎవరైనా డబ్బులు విత్ డ్రా చేస్తుంటే.. లైన్‌లో కొంచెంసేపు వెయిట్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే!.. తమకంటే ముందు ఓ వ్యక్తి ఏటీఎం దగ్గర నిల్చుకుని డబ్బులు తీసుకుంటుండటంతో.. వెనకొచ్చిన వారు తమ అవకాశం కోసం ఎదురు చూశారు. అరగంట గడిచింది.. ఆ తర్వాత గంట.. రెండు గంటలు.. ఇలా మూడు గంటలు దాటుతోంది. ఎంతసేపయినా అక్కడ నుంచి అతడు కదలడే. చిరాకొచ్చి వెనకున్న ఓ వ్యక్తి.. అతడి దగ్గరకు వెళ్లి చూశాడు.. అంతే! ఒక్కసారిగా సదరు వ్యక్తి నోట మాట రాలేదు. ఇంతకీ అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

వివరాల్లోకి వెళ్తే.. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని టెస్కో క్యాష్ పాయింట్ దగ్గర ఓ వ్యక్తి నిల్చుని ఉన్నాడు. డబ్బులు తీసుకుంటున్నాడు కదా అని.. జనాలు అతడి వెనుక క్యూలో నిల్చుని ఉన్నారు. అయితే గంటలు గడిచిపోతున్నా సరే.. అతడు అక్కడ నుంచి ఏమాత్రం కదలట్లేదు. క్యూలో అతడి వెనుక నిల్చున్న ఓ వ్యక్తి చిరాకొచ్చి ముందుకొచ్చాడు. అతడి దగ్గరకు వెళ్లి చూశాడు. అంతే! ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అక్కడున్నది మనిషి కాదు.. ఓ బొమ్మ.

‘ఇప్పటిదాకా మనిషి అనుకున్నామని.. ఎందుకు అలా కదలకుండా ఉన్నాడో గ్రహించలేకపోయామని’ అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఈ వీడియోకి 3.4 మిలియన్ వ్యూస్, 41 వేల లైకులు, 6 వేలకుపైగా రీ-ట్వీట్లు వచ్చాయి. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..

Follow Us