AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువకుడిని గాడిదపై తలక్రిందులుగా కూర్చో బెట్టి.. శశ్మానం చుట్టూ తిప్పిన గ్రామస్తులు!

మధ్యప్రదేశ్‌లో అనుహ్య ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాల కారణంగా వరదల వంటి పరిస్థితులు తలెత్తాయి. అయితే ఉజ్జయినిలోని నాగ్డా ప్రాంతంలో, ప్రజలు ఇప్పటికీ మంచి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. నాగ్డా గ్రామస్తులు వర్షాలు కురవాలని ఒక ఉపాయం చేశారు. ఇక్కడి స్థానికులు ఒక వ్యక్తిని గాడిదపై తలక్రిందులుగా కూర్చోబెట్టి, శ్మశాన వాటిక చుట్టూ.. 7 రౌండ్లు తిరిగేలా చేశారు.

యువకుడిని గాడిదపై తలక్రిందులుగా కూర్చో బెట్టి.. శశ్మానం చుట్టూ తిప్పిన గ్రామస్తులు!
Man sit upside down on Donkey
Balaraju Goud
|

Updated on: Aug 10, 2025 | 3:12 PM

Share

ఆధునిక యుగంలో మనిషి అంతరిక్షం వైపు పరుగులు పెడుతున్నాడు. అయినప్పటికీ మూఢ నమ్మకాలతో బతికేస్తున్నాడు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ ఘటన రుజువు చేస్తోంది. ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా అనేక రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుణ, నివారీ, టికమ్‌గఢ్, మాండ్లా, అశోక్‌నగర్ అత్యధిక వర్షపాతం నమోదు అయ్యాయి. అనేక జిల్లాల్లో వరదలు సంభవించాయి. కానీ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని నాగ్డాలో మాత్రం వర్షాలు అంతంత మాత్రమే కనిపించాయి.

నాగ్డా ప్రాంతంలో వర్షాలు లేకపోవడం వల్ల ఇక్కడి ప్రజలు చాలా కలత చెందుతున్నారు. సాగు చేసేందుకు వాన జాడ కోసం ఎదురుచూస్తున్నారు. చాలా చోట్ల చెరువులు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితిలో, నాగ్డా గ్రామస్తులు ఒకదాని తర్వాత ఒకటి ఉపాయాలు అనుసరించి వానదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారు. గ్రామస్తులు ఒక వ్యక్తిని గాడిదపై తలక్రిందులుగా కూర్చోబెట్టి, అర్ధరాత్రి శ్మశాన వాటిక చుట్టూ ప్రదక్షిణలు చేయించారు.

ఒక వ్యక్తి గాడిదపై కూర్చుని దహన సంస్కారాల స్థలం చుట్టూ తిరిగేలా చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్షం లేకపోవడంతో ఇక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు వర్షం రాకకోసం ఎదురుచూస్తున్నారు, కానీ వర్షం పడటం లేదు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు పాత కాలంలో వర్షం కోసం ఉపయోగించిన ఈ ఉపాయాన్ని అనుసరించి, ఒక వ్యక్తిని గాడిదపై తలక్రిందులుగా కూర్చోబెట్టి శ్మశాన వాటిక చుట్టూ తిరిగేలా చేశారు.

గాడిదపై కూర్చున్న వ్యక్తి పేరు లఖన్ పటేల్. అతను ఉన్హెల్ నగర్ నివాసి. ఇక్కడ, ధకాడ్ కమ్యూనిటీ ప్రజలు గాడిదపై కూర్చోబెట్టి, తిప్పుతూ ఉండేలా చేసే ఉపాయాన్ని ప్రదర్శించారు. లఖన్ పటేల్ కూడా సంతోషంగా గాడిదపై కూర్చుని, ఈ పాత సంప్రదాయాన్ని అనుసరించి ప్రదర్శించారు. ఈ ఉపాయానికి ముందు, లఖన్ పటేల్ పూజ చేసి, ఆపై గాడిదపై తలక్రిందులుగా కూర్చున్నాడు. దీని తరువాత, అతను శ్మశాన వాటిక చుట్టూ 7 రౌండ్లు తిరిగాడు. ఈ ఉపాయంతో గ్రామంలో మంచి వర్షం కురుస్తుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..